23-01-2025, 02:58 PM
చుస్తే అక్కడ హాల్ లో ఎవరి ట్రాన్స్ లో వాళ్ళు ఉన్నారు, ఏదైతే అది అయ్యింది అని పల్లవి దగ్గరికి వెళ్లి తన చెంప మీద చిన్నగా తడుతూ వాళ్ళ నాన్న వేరు చెప్పి , "మీ నాన్న నిన్ను తీసుకొని రమ్మని నన్ను పంపాడు నాతొ వస్తావా" అన్నాను.
"అక్కడ నాకు , టాబ్లెట్స్ దొరుకుతాయా, టాబ్లెట్స్ ఇప్పిస్తాను అంటే నాతొ పాటు జ్ఞాపికా , దీపికా కూడా వస్తారు , ముగ్గురినీ తీసుకొని వెళతా అంటే వస్తాము"
"అక్కడ అన్నీ దొరుకుతాయి , సరే ముగ్గురినీ తీసుకొని వెళతా వస్తారా?"
"వాళ్ళు వెళ్లనీరుగా , వాళ్లకు దొరికితే డార్క్ రూమ్ లో పెడతారు , వాళ్లకు దొరకకుండా తీసుకొని వెళతావా"
"ఎవరికీ దొరకకుండా తీసుకొని వెళతాలే" అంటూ సిస్టం దగ్గరికి వచ్చాను. నేను తన నుంచి దూరం జరగగానే తన లోకం లోకి తనకు వెళ్ళింది.
ఇక్కడ నుంచి ఎవరన్నా తప్పించు కోవాలని ట్రై చేసి వీళ్లకు దొరికితే ఎక్కడో డార్క్ రూమ్ లో వేస్తారు , చూస్తుంటే ఆ డార్క్ రూమ్ అందరినీ బాగానే భయపెట్టింది, వీళ్ళను ఇక్కడ నుంచి తప్పించాలి , ఆ తరువాత వీళ్ళను ఏదైనా రిహాబిటేషన్ సెంటర్ లో పెట్టాలి ,లేదంటే వీళ్ళు ఇంటికి వెళితే ఆ టాబ్లెట్స్ కి అలవాటు పడతారు అనుకొంటూ అక్కడ ఉన్న సిస్టమ్స్ ని ఆన్లైన్ కి తీసుకొని వచ్చాను. రెండో సిస్టం మీద ఉండగా రావుా వాటర్ తో పాటు టీ తీసుకొని వచ్చాడు. ఆ హాల్ అవ్వగానే
"శివా ఇప్పుడు మనం వెళ్ళేది కొద్దిగా సీక్రెట్ ప్లేస్ , ఇక్కడికి ఎవ్వరికీ అనుమతి లేదు , సాధారణంగా ఇక్కడికి ఎవ్వరినీ రానివ్వరు , కానీ ఇప్పుడు తప్పదు కాబట్టి నిన్ను తీసుకొని వెళుతున్నా , నువ్వు ఇక్కడికి వచ్చినట్లు ఎవ్వరికీ తెలియనీయకు , ఒక వేళా అలా తెలిసింది అంటే ప్రాణానికే ముప్పు" అంటూ నేను ఇంతక ముందు ఉహించి నట్లు అక్కడ ఉన్న అండర్ గ్రౌండ్ కి తీసుకొని వెళ్ళాడు, పైన ఎంత ప్లేస్ లో కట్టడాలు ఉన్నాయో , కింద కూడా అంతే ప్లేస్ లో రూమ్స్ , హాల్స్ ఉన్నాయి నన్ను ఓ హాల్ లో కి తీసుకొని వెళ్ళాడు అక్కడ అన్నీ హై ఎండ్ ప్రింటింగ్ machines ఉన్నాయి అన్నీ ఇంపోర్టెడ్ సిస్టమ్స్ వీటితో నే ప్రింటింగ్ చేసేది అనుకొంటూ వాటిని కంట్రోల్ చేసే టెర్మినల్ మీద కూచోన్నాను.
ఆ టెర్మినల్ ని ఆన్లైన్ లోకి తెచ్చి , దాంట్లో రిమోట్ అడ్మిన్ install చేసి అక్కడ ఉన్న అన్ని సిస్టమ్స్ ని ఆన్లైన్ లోకి తెచ్చాను.
రావుా అక్కడ నుంచి వేరే పని మీద ఆ సిస్టం లోని డేటాని ఆన్లైన్ లోని ఓ డ్రైవ్ లోకి అప్లోడ్ చేసాను. ఆ రూమ్ లోకి రావడానికి వేరే దారి ఏదైనా ఉందా అని చుట్టూ చూసాను, కానీ ఏమీ కనబడ లేదు ఈ లోపల బయటికి వెళ్ళిన రావుా తిరిగి వచ్చాడు.
"ఇక్కడ ఉన్నవి అన్నీ ఆన్లైన్ లో కి వచ్చాయి ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా"
"ఇంకా రెండు మూడు ఉన్నాయి , కానీ అవి చాలా ముఖ్యమైనవి" అంటూ అక్కడే ఇంకో రూమ్ లోకి తీసుకొని వెళ్ళాడు. చూస్తూనే అది మేనేజర్ గాడి రూమ్ లాగా ఉంది. ఫైవ్ స్టార్ హోటల్ లో పెంట్ హౌస్ లాగా ఉంది. అక్కడ వాడి మెషిన్ ని చూపించాడు. దాన్ని ఆన్లైన్ లో కి తెచ్చి వాడి దాంట్లో రిమోట్ అడ్మిన్ install చేసాను. చివరగా రావుా ఇంకో రూమ్ కి తీసుకొని వెళ్ళాడు , మేనేజర్ గారి రూమ్ ని మించి ఉంది , ఇదే ఆ స్వామిగాడి రూమ్ అనుకొంటా, వాడి మెషిన్ ని ఆన్లైన్ లో తెచ్చి దాంట్లో కూడా రిమోట్ అడ్మిన్ install చేసి రావుా గారితో పాటు పైకి హాల్ లోకి వచ్చాను.
"రావుా జీ, ఇంతకూ వీళ్ళు ఎం తాగారు ఏంటి అందరు అదో రకంగా ఉన్నారు?"
"వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు, స్వామీ గారే వాళ్లకు ప్రత్యేకమైన తీర్తం ఇస్తారు అది తాగి వాళ్ళు అలా మెడిటేషన్ లో ఉంటారు"
ఆ హాల్ కి అనుకోని కొన్ని బెడ్ రూమ్ లు ఉన్నాయి, వాటిలో ఎవరు ఉన్నారో తెలీదు కానీ తలుపులు వేసి ఉన్నాయి.
"ఆ తీర్తం అందరికీ దొరుకుతుందా ?, నాకు కూడా కొద్దిగా తాగాలని ఉంది"
"నువ్వు ఇక్కడ మెంబెర్ కాదుగా , ఇక్కడ మెంబెర్ అయినా వాళ్లకు మాత్రమే , అందులోనా స్వామి కొన్ని పరీక్షలు పెడతాడు వాటిలో నెగ్గితేనే ఈ తీర్తానికి అర్హులు"
"అబ్బో చాలా పెద్ద తతంగం ఉందే అయితే"
"ఇక్కడి విషయాలు గురించి నువ్వు ఎక్కడా బయట చెప్పక, అది మనకి మంచిది కాదు"
"నేను ఎక్కడా చెప్పను లెండి సర్, ఇంతకూ మనం ఇంటికి వెళుతున్నామా , లేదా రాత్రికి ఇక్కడే ఉంటున్నామా?"
"ఈ టైం లో ఎం వెళతాం లో ఇక్కడే పడుకో" అంటూ ఆ హాల్ కి పక్కన ఓ గెస్ట్ రూమ్ చూపిస్తూ, "ఇక్కడ పడుకో పొద్దున్నే ఇంటికి వెళదాం"
"మరి మీరు ఎక్కడ పడుకొంటారు?"
"ఒకో సారి నేను రాత్రిళ్ళు కూడా పని చేయాల్సి వస్తుంది అందుకే నాకో సెపరేట్ రూమ్ కూడా ఉంది" అంటూ తన రూమ్ కి వెళ్ళాడు.