23-01-2025, 02:58 PM
వాళ్ళు ఓపికగా అక్కడ ఉన్న సమస్య ఏందో చెప్పారు , వాళ్ళ మాటలు వింటూ వాళ్ళు చెప్పిన దానికి తల ఉపసాగాను.
"ఎఫక్ట్ అయ్యిన ఓ సిస్టం ఇవ్వండి , దాన్ని చుస్తే గానీ ఎం అయ్యిందీ చెప్పలేను" అన్నాను , వాళ్ళు ఓ ప్రింటర్ కి కనెక్ట్ అయ్యిన ఓ మెషిన్ ని నాకు ఇచ్చారు.
"నాకు కొద్దిగా టైం ఇస్తే, చూస్తాను" అన్నాను కొద్దిగా ప్రైవసీ కావాలి అన్నట్లు, నన్ను ఓ హాల్ లో కూచోపెట్టారు. అక్కడ CCTV కెమెరాలు ఉన్నాయి , కానీ అవ్వి కూడా నెట్వర్క్ కనెక్ట్ కావడం వాళ్ళ రికార్డు అవుతూ ఉన్నాయి కానీ డేటా ఎక్కడ స్టోర్ చెయ్య లేక పోతూ ఉన్నాయి. ఏదైనా చూడాలి ఆంటీ ఈ సిస్టమ్స్ అప్ కాకముందే చూడాలి అనుకొంటూ వాళ్ళు ఇచ్చిన సిస్టం ముందు కూచోన్నాను.
అవి ఎందుకు కనెక్ట్ కాలేదో తెలిసినా ఓ రెండు గంటల పాటు దాని మీద కూచొని ఎదో సీరియస్ గా పనిచేస్తూ ఉన్నట్లు బిల్డ్ అప్ ఇస్తూ దాదాపు రాత్రి 7 గంటలకు నేను వదిలిన బోట్ ని disable చేసి దాన్ని సిస్టం లొంచి డిలీట్ చేసి , నెట్వర్క్ కి కనెక్ట్ చేసి రెండు టెస్ట్ పేపర్స్ ప్రింట్ చేసాను.
"ఏమైంది , సర్ ఇప్పుడు ఎలా కనెక్ట్ అయ్యింది" అంటూ వచ్చారు వాళ్ళ IT కుర్రాళ్ళు.
"అన్ని సిస్టమ్స్ లేటెస్ట్ బోట్ తో ఇన్ఫెక్ట్ అయ్యాయి , దీనికి స్టాండర్డ్ సొల్యూషన్ లేదు , ఈ బోట్ చాలా అడ్వాన్స్ గా రాయబడింది , సిస్టం కి ఒకరకంగా మార్పు చెందింది , ప్రతి సిస్టం లో అది ఏవిధంగా మార్పు చెందిందో చుస్తే గానీ దాన్ని తీయలేము" అంటూ కొద్దిగా టెక్నికల్ సోది చెప్పాను నమ్మేట్లు.
వాళ్ళకి వేరే దారి లేదు నేను చెప్పినట్లు నమ్మడం తప్ప , నేను రాసిన స్క్రిప్ట్ antivirus కి కూడా దొరకదు , కాబట్టి చచ్చినట్లు నాకు ప్రతి సిస్టం చూపించి దానిమీద నేను వర్క్ చేస్తే గానీ నెట్వర్క్ కి కనెక్ట్ కాదు అన్నట్లు బిల్డుప్ ఇచ్చాను.
IT వాళ్ళు మేనేజర్ తో ఓ 20 నిమిషాలు మాట్లాడిన తరువాత ,రావుా , మేనేజర్ ఇద్దరూ పక్క రూమ్ కే వెళ్లి మరో 20 నిమిషాలు మాట్లాడారు ఆ తరువాత నా దగ్గరకు వచ్చారు ఇద్దరు.
"శివా, థాంక్స్ ఈరోజు ఎలాగైనా అన్ని సిస్టమ్స్ అప్ చెయ్యాలి , రాత్రికి కొద్దిగా లేట్ అయ్యినా ఇక్కడే ఉండి హెల్ప్ చెయ్యవా , ప్లీజ్" అన్నాడు రావుా గారు.
"రావుా గారు నన్ను మీరు అలా బ్రతిమలాడవద్దు , నాకు స్వామీ వారికి సేవ చేసుకొనే అదృష్టం మీరు కల్పించారు అదే నాకు చాలా సంతోషం ఈ విధంగా అయినా స్వామీ వారి దర్శనం అవుతుంది అంటే నాకు ఇంతకంటే కావాలసింది ఏముంది" అన్నాను సంతోష పడుతున్నల్టు మొహం పెడుతూ.
నా మాటలు విన్న మేనేజర్ నా బుట్టలో పడ్డాడు, "శివా ఎలాగైనా రాత్రికి సిస్టమ్స్ అప్ చెయ్యి రేపు పొద్దున్నే నిన్ను స్వామీ వారి దగ్గరకు తీసుకొని వెళ్లే బాధ్యత నాది,నువ్వు స్వామీ వారి భక్తుడివి అని మాకు తెలియదు , ఇప్పటికే చాలా నష్టం జరిగింది , రావుా గారు మీతో ఉంటారు" అన్నాడు
"తప్పకుండా సర్ , థాంక్స్ సర్ నా జీవితం ధన్యం అయ్యింది ఇలాగైనా స్వామీ గారికి సేవ చేసుకొనే అదృష్టం కలిగి నందుకు" అంటూ తన ఆఫర్ కి పొంగి పోయాను.
"రావుాజీ ఇంక లేట్ ఎందుకు అన్ని సిస్టమ్స్ చూపించి రెడీ చేయించు పొద్దున కల్లా, నేను పొద్దున్నే కలుస్తాను, బాయ్ శివా" అంటూ తనకు అక్కడ నుంచి వెళ్ళాడు.
"ఎన్ని సిస్టం ఉన్నాయి ఏంటి ? "
"దాదాపు 20 దాకా ఉంటాయి అందులో కొన్ని ప్రింటర్స్ మిగిలినవి కంప్యూటర్స్"
"ఇంకోటి చూపించండి"
"ఇద్దరం కలిసి , ఇంకో హాల్ లోకి వెళ్ళాము , అక్కడ ఓకే ప్రింటర్ ఒక desktop ఉంది, ఆ రెండింటిని నెట్వర్క్ కనెక్ట్ చేసాను, నాకు కావాల్సింది ఇవ్వి కావు , ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికే సిస్టమ్స్, వాటిని నెట్వర్క్ లో కలుపుతూ ఉన్నప్పుడాల్లా అవి అవసరం అనిపిస్తే వాటిలో రిమోట్ అడ్మిన్ install చేయడం నా ఉద్దేశం. దాదాపు అన్నీ సాధారణమైన సిస్టమ్స్ వాటిలో ఎం లేదు.
"శివా ఇప్పుడు మనం వెళ్ళేది చాలా ముఖ్యమైన ప్లేస్" అంటూ ఇంకో వింగ్ లోకి తీసుకొని వెళ్ళాడు , అక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు అందులో ఎక్కవ మంది 20 నుంచి 27 మధ్య వయస్సు అమ్మాయిలూ , ఉన్న మగ వాళ్ళు అంతా 40 పై బడ్డ వాళ్లు అందరు ఎదో ట్రాన్స్ లో ఉన్నట్లు ఉన్నారు.
"వీళ్లంతా భక్తులా సార్" అన్నాను పల్లవి కోసం చూస్తూ, కొద్దిగా దూరంలో ఇద్దరి అమ్మాయి ల మధ్య పల్లవి కూచొని తను కూడా ఎదో ట్రాన్స లో ఉన్నట్లు ఉంది.
"అవును శివా వీళ్ళు ఇక్కడే ఉంటారు చాలా మంది , కొందరు పోయి వస్తు ఉంటారు వాళ్లను గురించి పట్టించు కోవద్దు, మన పని చేసుకుందాము పద." అంటూ అక్కడ ఉన్న సిస్టం ముందు కూచో పెట్టాడు.
అక్కడ మొత్తం 4 సిస్టమ్స్ ఉన్నాయి, ఈ సిస్టమ్స్ ఆన్లైన్ లోకి వచ్చే లోపల ఓ సారి పల్లవి తో మాట్లాడాలి ఎలా అని ఆలోచిస్తూ నేను కుచోన్న సిస్టమ్ ని ఆన్లైన్ లో తేవడానికి ట్రై చేయసాగాను. కెమెరా లు ఎలాగూ ఆన్లైన్ లో లేవు , ఇంకా రావుా ని కొద్దీ సేపు ఇక్కడ నుంచి తప్పిస్తే ఆ టైం లో పల్లవి తో మాట్లాడడానికి వీలు అవుతుంది అనుకొంటూ.
"సార్ వచ్చిన దగ్గర నుంచి బిజీ గా ఉన్నాము , కొద్దిగా తాగడానికి ఏమైనా ఏర్పాటు చేయండి , కొన్ని నీళ్లు , టీ లేదా కాఫీ లాంటిది లేదంటే బుర్ర పని చేయదు" అన్నాను మొహం కొద్దిగా అలసటగా పెడుతూ.
"అయ్యే శివా ఆ విషయం మరిచి పోయాను, ఇక్కడికి కిచెన్ కొద్దిగా దూరం గా ఉంటుంది , నువ్వు నీ పని చూస్తూ ఉండు , నేను వెళ్లి టీ ఆరెంజ్ చేసి వస్తా" అంటూ తను బయటికి వెళ్ళాడు.