Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#61
[font=var(--ricos-font-family,unset)] [/font]
"అవునమ్మా!.. నీకు హక్కు వుంది" నవ్వుతూ చెప్పాడు హరికృష్ణ. 
"ఆఁ.. దీని అబ్బకేమో మనమీద పంతం, పగ, దీనికేమో మన మీద.." లావణ్య ముగించకముందే..
"వల్లమాలిన ప్రేమ, అభిమానం, ఇదే కదా అత్తయా మీరు చెప్పాలనుకొన్నది!" కాటుక కళ్ళను చిత్రంగా త్రిప్పుతూ ఒక్కక్షణం ఈశ్వర్ ముఖంలోకి చూచి చెప్పింది దీప్తి చిరునవ్వుతో.
"బావా! నేను జోక్గా అనలేదు ఢిల్లీ టిక్కెట్ విషయం. నేను ఢిల్లీకి వెళ్ళాలి. నాకూ టికెట్ బుక్ చేయండి."



"నీకేం పనే ఢిల్లీలో!.." అడిగింది లావణ్య.
శార్వరి వచ్చి కాఫీ గ్లాసును అందించింది దీప్తికి.
సిప్ చేసి "శారూ!.. అమృతమే" నవ్వింది దీప్తి. " నాకేం పని అడిగావుగా అత్తయ్యా!.. ఢిల్లీలో. అక్కడ నాకో స్నేహితురాలు వుంది. దాని వివాహం అందుగ్గా వెళ్ళాలి."



"ఒంటరిగా వెళ్లాలనుకొన్నావా!"
"లేదే!.."
"మరి ఎవరు నీతో వస్తున్నారు?.."
"మీరంతా!.." గలగలా నవ్వింది దీప్తి.



మాటకు హరికృష్ణకు నవ్వు వచ్చింది ఆనందంగా నవ్వాడు.
లావణ్య ఆశ్చర్యంతో "ఎందుకండీ నవ్వుతున్నారు!.."
"ఆరోగ్యం కోసం లావణ్యా!.."



"కరెక్ట్!.. అత్తయ్యా!.. నవ్వు అనేది మనకు దేవుడిచ్చిన వరం. ఆనందకరమైన విషయాలను విన్నప్పుడు, ఆహ్లాదకరమైన దృశ్యాలను చూచినప్పుడు, అయినవాళ్లందరూ ఒకచోట చేరినప్పుడు, సరదా కబుర్లతో నవ్వుకోవడం ఒంటికి ఎంతో మంచిది తెలుసా!.."



"అవును దీప్తీ!.. నీవు చెప్పింది నిజం" నవ్వుతూ చెప్పింది శార్వరి.
"అయితే నాన్నా!.. ఎల్లుండికి మనకు ఢిల్లీకి టిక్కెట్లు బుక్ చేస్తాను."
"ఆఁ.. దీప్తికి కూడా చెయ్యి" అన్నాడు హరికృష్ణ.
దీప్తి నవ్వుతూ ఈశ్వర్ ముఖంలోకి చూచింది. చూపుల్లో తీక్షణతకు ఈశ్వర్ తట్టుకోలేక.. తల త్రిప్పుకొని తన గదికి వెళ్ళిపోయాడు.



"మామయ్యా!.."
"ఏమిటమ్మా!.."
"మీరంతా వాణి వదినను కలువబోతున్నారుగా!" అడిగింది దీప్తి.
అవునన్నట్లు తలాడించాడు హరికృష్ణ.



"ఇప్పుడు వాణి వదిన ఆలిండియా రేడియో ఢిల్లీ కేంద్రంలో తెలుగు వార్తల అనౌన్సర్. నిన్న రాత్రి నేను, అమ్మా వదిన చెప్పిన వార్తను వినాము" అమాయకంగా నవ్వుతూ చెప్పింది దీప్తి.
"ఆఁ.. మేమూ విన్నాము వదినా!.. అక్క వార్తలను చాలా బాగా చెప్పింది కదూ!.."
"అవును శారూ!.. చాలా బాగా చెప్పింది."
"అది ఎవరి కూతురు!.." గర్వంగా అంది లావణ్య.



"మామయ్యగారు శ్రీ శ్రీ.. తిరుమలగిరి హరికృష్ణగారి పెద్దకుమార్తె. మా వదినగారు" నవ్వుతూ నాటకీయంగా చెప్పింది దీప్తి.
హరికృష్ణ నవ్వాడు ఆనందంగా.
"దీపూ!.. నీవు ఇక్కడికి వచ్చేటప్పుడు మీ నాన్నతో చెప్పావా!" అడిగింది లావణ్య.
"అవసరమా అత్తయ్యా!.."
"అంటే చెప్పలేదా!.." అడిగింది శార్వరి.



"నా అత్తారింటికి వచ్చేదానికి నాకు ఆయన పర్మిషన్ కావాలా ఏంటి? అమ్మతో చెప్పా!.. వెళ్ళిరా అంది, అంతే వచ్చేశా!.." 
ఆశ్చర్యంతో చూచింది లావణ్య.



దీప్తి లేచి లావణ్యను సమీపించి "అత్తయ్యా!.. నా అలంకారం ఎలా వుంది. పోయినసారి నేను వచ్చినప్పుడు నీవు చెప్పిన మాటలను నేను మరువలేదు. ఎన్నటికీ మరువబోను"
లావణ్య పెదవులపై చిరునవ్వు.. ప్రీతిగా అభిమానంతో దీప్తి ముఖంలోకి చూచింది. 
"దీపూ!.. చాలా అందంగా వున్నావే!.."
"ఆమె అంతా నీ పోలికేగా!.." నవ్వాడు హరికృష్ణ.



"శారూ!.. పద.. నా బావగారు ఏం చేస్తున్నారో చూద్దాం" శార్వరీ చేతిని తన చేతిలోకి తీసుకొంది. ఇరువురూ ఈశ్వర్ గదిలోకి ప్రవేశించారు.
"బావా!.. టికెట్లు బుకింగ్ అయిపోయిందా!"



"అయిపోయింది."
"నాకు బుక్ చేశావా లేదా!."
"తప్పదుగా!"
"అంటే!?"
"మా నాన్నగారు చెప్పారు."
"నేను చెబితే చేయవా?"
"ఎందుకు చేయడు వదినా. నీవు చెప్పినా, నాన్న చెప్పినా విషయం ఒక్కటేగా!



"శారూ!"
"ఏమిటొదినా!.."
"మీ అన్నయ్య మారిపోయాడే!"
"పరిస్థితులు వ్యక్తుల మనస్తత్వాలను మారుస్తాయి"



"పరిస్థితులకు తగిన రీతిగా మనస్సును మార్చుకొనేవారు ఊసరవెల్లి లాంటివారు. వారిని మనుషులని అనకూడదు. అన్ని పరిస్థితుల్లో సహనంతో శాంతంగా వుండేవారే అసలైన మనుషులు. స్వార్థం కన్నా పరమార్థం గొప్పది. మా మామయ్యలాగా!"
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 10 - by k3vv3 - 22-01-2025, 09:55 AM



Users browsing this thread: