Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#59
"అంత ముక్తసరిగా చెబుతారేం?.." చిరుకోపంతో అడిగింది లావణ్య.






"లావణ్యా! ఆమెకు ఏం తక్కువ!.. మనం ఏం తక్కువ చేశాము!.. మనమంటే ఎంతో అభిమానంగా వున్న ఆమె అలా ఎలా మారిపోయిందో.. మనకు ఒక్కమాట చెప్పకుండా తనకు నచ్చినవాడితో ఎలా వెళ్ళిపోగలిగిందో!.. తలుచుకొంటుంటే.. ఎదలో ఎంతో బాధ లావణ్యా!.. అందుకే కళ్ళు మూసుకొని దైవాన్ని ధ్యానిస్తూ పడుకొన్నాను!.."



"నా మనఃస్థితీ మీలాగే వుందండీ!.. కన్నతల్లిని కదా!.. మూడేళ్ళ తర్వాత చూచేసరికి నాలో ఎంతో ఆవేదన.. అమ్మా!.. అమ్మా!.. అంటూ నా చుట్టూ తిరుగుతూ తనకు ఏం కావాలన్నా నన్ను అడిగి అది నాకు నచ్చితే తప్ప తానుగా తీసుకొన్నదంటూ ఏమీలేదు. అలాంటి పిల్ల తన జీవితానికి అతి ముఖ్యమైన విషయంలో మన సలహా సంప్రదింపూ లేకుండా.." హృదయ ఆవేదనతో లావణ్య చెప్పడం ఆపేసింది.



"నిన్ను అమ్మా!.. అమ్మా.. అని నీవు ఆమె తల్లివి కాబట్టి పిలిచింది కానీ నేను ఆమెను నా తల్లిగానే భావించాను లావణ్యా!.. ఆమె కోరింది ఏది నేను కాదన్నాను!.. 
అందరికంటే మిన్నగా వుండాలని.. నా శక్తి కొద్దీ ఆమె కోరిన రీతిగా.. తండ్రిగా నేను చేయవలసింది చేశాను. ఎంతో యోగ్యుడైన శివరామకృష్ణ పెద్ద కొడుకు చంద్రంతో ఆమె వివాహం జరిపించాలనుకొన్నాను. వాడితోనూ మాట్లాడాను. వాడూ సరేరా అన్నాడు. కానీ.. వాణి.. హుఁ.. తండ్రి తన భావిజీవితాన్ని సక్రమంగా తీర్చిదిద్దలేడని.. తనకై తాను తన ఇష్టానుసారంగా మనకు తలవంపులు కలిగేలా.. స్వనిర్ణయాన్ని తీసుకొంది. మనతో తనకు ఎలాంటి అవసరం లేదని వెళ్ళిపోయింది" నిట్టూర్చి తలదించుకొన్నాడు హరికృష్ణ.



భర్త మాట్లాడిన ప్రతి అక్షరం.. నగ్న సత్యం అయిన కారణంగా లావణ్య మారు పలుకలేకపోయింది. ఆవేదనతో కన్నీరు కార్చింది.
కొన్ని నిముషాలు వారి మధ్యన మౌనంగా గడిచిపోయాయి. కన్నీటిని తుడుచుకొని లావణ్య,
"ఏమండీ!.."



"చెప్పు లావణ్యా!.."



"మీరు వాణిని క్షమించలేరా!.."



"నీవు క్షమించగలవా!.."



"నేను దాని తల్లినండీ.. అది నా పెద్దబిడ్డ!.."  బొంగురుపోయిన కంఠంతో చెప్పింది లావణ్య.



"ఆమె నీకు బిడ్డ.. నాకు తల్లి.. వ్యక్తి అయినా తన తల్లిని అసహ్యించుకొంటాడా లావణ్యా!.."



బొంగురుపోయిన కంఠంతో చెప్పాడు హరికృష్ణ.
"అంటే మీరు నా బిడ్డను క్షమిస్తారు కదూ!.."



"ఆమె నా ముందుకు వస్తే తప్పకుండా క్షమిస్తాను.."



"మనం దాని ముందుకు వెళ్ళేదానికి మీకు అభ్యంతరమా!.." దీనంగా అడిగింది లావణ్య.



హరికృష్ణ ఆశ్చర్యంతో లావణ్య ముఖంలోకి చూచాడు.
"నాకు.. నా బిడ్డను చూడాలని వుందండి. తప్పుగా అడిగాననుకొంటే.. నన్ను క్షమించండి" దీనంగా చెప్పింది లావణ్య.



"ఢిల్లీకి వెళతావా!.."



"మీరు రారా!.."



"నాకు నా బిడ్డను చూడాలని వుందండీ.. అని అన్నావు కాని.. మనం వెళ్ళి మన బిడ్డను చూచి వద్దామండీ అని అనలేదు కదా!.."



".. సారీ.. సారీ అండీ.. ఏదో ఆవేశంలో అలా అన్నాను.. మీరు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళగలనండీ!..



"అంటే నీతో నన్నూ రమ్మంటావా!.."



"నేను చెప్పిన మాటకు అర్థం అదేకదండీ!.."



"సరే!.."



"ఆఁ.."



"సరే అన్నాను లావణ్య!.."



"దేనికి!!!" ఆశ్చర్యంతో అడిగింది లావణ్య



"నీవు అన్నదానికి!.. నీ కోరిక తీర్చేదానికి!" చిరునవ్వుతో చెప్పాడు హరికృష్ణ.



ద్వారం వెనుక నిలబడి వున్న ఈశ్వర్, శార్వరీలు అంతా విన్నారు. వారి ముఖాల్లో ఎంతో ఆనందం. ఈశ్వర్ చెల్లెలి చేతిని పట్టుకొన్నాడు. ఇరువురూ అతని గదిలో ప్రవేశించారు.



"శారూ!.. సర్వేశ్వరుడు దయామయుడు. మనం అమ్మా నాన్నలకు చెప్పకుండా ఢిల్లీకి వెళితే.. విషయం ఏనాటికైనా వారికి తెలిస్తే.. మనలను ద్వేషిస్తారేమో అని నాకు భయం. మన నిర్ణయం మంచిదే అనేదానికి అమ్మా నాన్నల మాటలే సాక్ష్యం. ఇక మనం నిర్భయంగా ఢిల్లీకి వెళ్ళవచ్చు" నవ్వుతూ చెప్పాడు ఈశ్వర్.



"వారి మాటలను బట్టీ అమ్మా నాన్నలు కూడ త్వరలో ఢిల్లీకి బయలుదేరబోతున్నారుగా అన్నయ్యా!.."



"అవునురా!.."



"అయితే మనం వెళ్ళే విషయం వారికి చెప్పవచ్చుగా!.."
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 10 - by k3vv3 - 22-01-2025, 09:52 AM



Users browsing this thread: 1 Guest(s)