Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#58
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 11

హరికృష్ణగారి ఇల్లు.. మధ్య హాలు.. టీవీలో.. ఢిల్లీ నుంచి తెలుగులో వార్తా ప్రసారం.
అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని భోం చేస్తున్నారు. రాత్రి సమయం.
ఆకాశవాణి.. తెలుగులో వార్తలు చదువుతున్నది తిరుమలగిరి వాణి.
ఘనంగా వినబడ్డ మాటలను విని శార్వరి పరుగున టీవి ముందుకు వచ్చింది. తన అక్క వాణిని చూచింది.



"అమ్మా!.. వార్తలు చదువుతున్నది మా వాణీ అక్క.." సంతోషంతో బిగ్గరగా అరిచింది.
ఈశ్వర్.. లావణ్య.. వారి వెనకాల హరికృష్ణ టీవీ ముందుకు వచ్చారు
తెల్లచీర.. దానిపై క్రమంగా దూరం దూరంగా వరుసలుగా గులాబీపూలు, తెల్ల జాకెట్ బంగారు వర్ణపు అంచు, నొసటన సింధూరం, తలకు స్నానం చేసి కురులు, తల్లో మల్లెపూలు, గాలికి ముఖంపైన అందంగా కదిలాడే ముంగురులు, అప్సరసలా వున్న వాణి.. చిరునవ్వుతో అచ్చ తెలుగులో వార్తలు చదువుతూ వుంది.



అందరి ముఖాల్లో ఎంతో ఆనందం. లావణ్య, హరికృష్ణ ముఖంలోకి కన్నీటితో చూచింది. వారి వదనంలో చిరునవ్వు.. కళ్ళల్లో కన్నీరు. ఈశ్వర్.. శార్వరి ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు. వారి కళ్ళల్లోనూ కన్నీరు.. ముఖాల్లో ఎంతో ఆనందం. అవి, క్షణాల్లో.. దుఃఖంతో వచ్చిన కన్నీరు కాదు. ఆనంద పరవశపు పన్నీరు. అందరూ ఒకరి ముఖాలొకరు చూచుకొన్నారు. వారి పెదవులపై చిరునవ్వు.. ముఖాల్లో ఎంతో ఆనందం.



వార్తలు ముగిశాయి. టీవి స్క్రీన్ పైని వాణి అదృశ్యం అయింది. ముందు ఈశ్వర్, వెనకాల శార్వరి, లావణ్య, హరికృష్ణ డైనింగ్ టేబుల్ను సమీపించారు. అందరూ కుర్చీల్లో కూర్చున్నారు. వారి మనస్సుల్లో వాణిని గురించిన ఆలోచనలే!.. మనసుల్లో ఒకే రకమైన బాధ. వారి మధ్యన మాటలకు తావు లేని మనస్థితులు. ఏదో తిని ముందు లావణ్య, ఈశ్వర్, హరికృష్ణ, శార్వరి చేతులు కడుక్కొని వారి వారి గదులకు వెళ్ళిపోయారు.






ఈశ్వర్ నేను, శార్వరీ ఢిల్లీకి వెళ్ళి వాణిని చూచి వస్తామని చెబితే.. అమ్మా నాన్నా.. సంతోషిస్తారా!.. వాణి అక్కయ్య ఎంతో ఠీవిగా వార్తలు చదివింది!.. అంటే తనకు సమస్యలూ లేకుండా హాయిగా వుందన్న మాటేగా!.. బావ అక్కను బాగా చూచుకొంటున్నట్లేగా!.. మూడేళ్ళయింది. పిల్లలు కలిగారో లేదో!.. అంతా సవ్యంగా వుంటే ప్రజాపతి మామయ్యకు జాబు ఎందుకు వ్రాసినట్లు!.. భార్యభర్తల మధ్యన ఏమైనా సమస్యలా!.. ఏది ఏమైనా సరే.. అనుకొన్న ప్రకారం ఢిల్లీకి వెళ్ళి వాణి అక్కయ్యను తప్పక కలవాలి అనుకొన్నాడు ఈశ్వర్.



శార్వరి.. పడుకొంది గాని మనస్సుకు కొంత శాంతి కలగవచ్చు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎప్పుడు బయలుదేరాలనుకొంటున్నాడో కనుక్కోవాలి మంచం దిగి.. శార్వరి ఈశ్వర్ గదిని సమీపించింది. తలుపును నెట్టబోయింది.



ఈశ్వర్ తలుపును తెరిచాడు. శార్వరిని చూచాడు.
"శారూ!.. ఏమ్మా!.. నిద్రపోలేదా!.." అడిగాడు.



"నిద్ర రావడం లేదు. నీతో మాట్లాడాలని వచ్చాను!.."



"అలాగా!.."



"అవును.."



"సరే, రా లోనికి.."



"నీవు ఎక్కడికి బయలుదేరావు?.."



"అమ్మానాన్నలు ఏం చేస్తున్నారో చూడాలని.."






"సరే పదా, చూచి వద్దాం.."



"ముందు వారి గదిలోనికి వెళ్ళకూడదు!.."



" విషయం నాకు తెలీదా!.. ద్వారం ముందు నిలబడితే.. వారి మాటలు వినిపిస్తాయిగా!.."



"అవునవును.. పద.." అన్నాడు ఈశ్వర్.
వారిరువురూ.. తల్లిదండ్రుల గదిని సమీపించారు.



"ఏమండీ!..



"ఏమిటి?.."



"ఒక్కమాట కూడా మాట్లాడరేం!.."



" విషయాన్ని గురించి లావణ్యా!.."



"అదే.. మన.."



"వాణీని గురించా!.."



"అవును.."



"ఏం మాట్లాడేది లావణ్యా!.."



"బిడ్డ బాగుంది కదూ!"



"ఆఁ.."
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 10 - by k3vv3 - 22-01-2025, 09:51 AM



Users browsing this thread: 1 Guest(s)