Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#40
గురుబ్రహ్మ
రచన: సుజాత స్వర్ణ






"రోజా! తొందరగా రావే! ఆలస్యమవుతోంది" స్కూటీని స్టార్ట్ చేస్తూ కేకేశాను నేను. 



"ఇదిగో వస్తున్నా అంత తొందరైతే ఎలా?" అంటూ చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ వచ్చి బండెక్కింది రోజ. 



"ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. రామనాథం మాస్టారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి వెళ్లాలని చెప్పాను కదా! ఇప్పుడు సమయం నాలుగు గంటల ముప్పై నిమిషాలయ్యింది. కార్యక్రమం నాలుగు గంటలకే మొదలవుతుందన్నారు. మనం అక్కడికి చేరుకునేసరికి ఎంత సమయమవుతుందో ఏమో!" కంగారుగా అన్నాను నేను. 



"సరేలే సుజా! సన్మాన సమయానికి ఉంటే సరిపోతుంది కదా! మాస్టారంటే అంత అభిమానం ఉన్న దానివి ఒక్క పూట బడికి సెలవు పెట్టొచ్చు కదా! పెట్టలేదు. ఇప్పుడేమో హడావిడి చేస్తున్నావు" అంది రోజ. 
 
"కార్యక్రమం సాయంత్రమని, బడి వదలగానే వెళ్ళొచ్చని అనుకున్నా. నువ్వు ఆలస్యం చేస్తావని నేనేమైనా కలకన్నానా?" అన్నాన్నేను కొంచెం ఉక్రోషంతో. 



"అబ్బా! సరేలే! తొందరపడకోయ్ సుందరవదనా! నువ్వు కంగారుపడి నీ వాహనాన్ని భారీ వాహనానికో ముద్దు పెట్టావనుకో!.. సన్మానానికి ఏమో గానీ.. పైకి పోతాం" ఆకాశం వైపు వేలు చూపుతూ నవ్వుతూ అంది రోజా. 



మాటలకు కాసేపు ఇద్దరం నవ్వుకున్నాం. కాస్త సమయం దొరికినా తన హాస్యవల్లరితో ఎదుటి వారిని రంజింపజేస్తుంది రోజ. 



రోజ నా సహాధ్యాయిని. మేము సీతానగరం ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాము. ఇంచుమించు ఇద్దరం ఒకే వయసు వారం కావడం వల్ల మా మధ్య స్నేహం త్వరగా చిగురించింది. మండలంలో సమావేశం జరిగినా, కార్యక్రమానికైనా ఇద్దరం కలిసే వెళ్తాం. మమ్మల్ని అందరూ 'జంట కవులు' అని సంబోధిస్తూ ఉంటారు. ఎప్పుడైనా మాకు వీలుపడక ఒక్కరమే కనబడితే, ''ఏంటండీ ఈరోజు జంట కవులలో ఒకరు తగ్గారే?' అంటారందరూ. 



రామనాథం మాస్టారు నా గురువుగారు. నేను ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి ఆయన కృషి చాలా ఉంది. ఆయన మాకు గణితం బోధించే వారు. అన్ని సబ్జెక్టుల్లో ప్రథమంలో ఉండే నాకు, గణితమంటే గుండెపట్టుకునేది. విషయాన్ని గుర్తించిన మాస్టారు, మా నాన్నతో మాట్లాడి నన్ను సెలవు రోజుల్లో వారింటికి పిలిపించి, అర్థం కాని లెక్కలను అర్థమయ్యేలా చెప్పేవారు. అలా నా గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో నేను పదవ తరగతి గట్టెక్కగలిగాను. తర్వాత పై చదువులు చదివి నేను ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి కూడా ఆయనే సలహాలు ఇచ్చారు. అందుకే మాస్టారంటే నాకు ఎంతో గౌరవం, భక్తీనూ. 



పావుగంట పైనే పట్టింది మేము అక్కడికి చేరుకోవడానికి. రామనాథం మాస్టారు మా మండల కేంద్రమైన రామాపురం ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. జాతీయ రహదారి ప్రక్కనే ఉంటుందా ఊరు. సాయంత్రమైనా పెద్దగా వాహనాలేవీ అడ్డురాలేదు కానీ ఊర్లోని గేదెలను తప్పించుకుని బయటపడడం మాత్రం కష్టమైంది మాకు. 



మేమెళ్ళేసరికి కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు. మండల, జిల్లా విద్యాశాఖ అధికారులు అప్పుడే వస్తున్నారు. 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకొని స్కూటీకి స్టాండ్ వేసి పక్కన ఉంచాను. ఇద్దరు పిల్లలు ఎదురొచ్చి మాకు స్వాగతం పలికారు. 



పిల్లలు, పెద్దలతో ఆవరణంతా నిండిపోయింది. వాతావరణం కోలాహలంగా ఉంది. మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులతో వేదికను పెళ్లి మండపంలా అలంకరించారు. నేలంతా నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టారు. మార్చి నెల కావడంతో భానుడి ప్రతాపం ఇంకా తగ్గలేదు. పచ్చని చెట్లు ఎక్కువగా ఉన్నందున ఏదో తెలియని హాయిగొలుపుతోంది అక్కడి వాతావరణం. మాస్టారు దంపతులు వేదిక ముందు కూర్చుని ఉన్నారు. మేము వారి వద్దకు వెళ్లి నమస్కరించగా, కుశల ప్రశ్నలు వేసి మమ్ము ఆశీర్వదించి కూర్చోమని చెప్పారు వారు. 



కొద్దిసేపటి తర్వాత అందరికీ నమస్కారం మరికొద్ది నిమిషాలలో కార్యక్రమం ప్రారంభమవుతుందంటూ వ్యాఖ్యానం వినిపించింది. దాంతో అప్పటి వరకు కోలాహలంగా ఉన్న వాతావరణం నిశ్శబ్దంగా మారిపోయింది. ఇంతలో అటువైపు నుంచి కార్ల కాన్వాయ్ వస్తుండడం చూసి అందరి దృష్టి అటు మరలింది. రోజాతో కబుర్లలోఉన్న నేను కూడా అటు చూశాను. కార్లు దిగి వస్తున్నవారికి స్వాగతం పలకడానికి కొందరు ఎదురెళ్ళారు. 



కలెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తి, పక్కన జవాన్ పరిగెత్తుకుని వస్తుండగా రామనాథం మాస్టారి దగ్గరికి వచ్చారు. ఎవరో అధికారి వచ్చారనుకొని లేచి నిల్చోబోయిన మాస్టారిని పొదివి పట్టుకుని కూర్చోబెట్టి పాదనమస్కారం చేశాడు వచ్చినాయన. చర్యకు మాస్టారు ఆశ్చర్య పడతుండగా"గుర్తుపట్టలేదా మాస్టారూ.. నేను భరత్ ఐఎఎస్. మీ ప్రియశిష్యుడిని" అన్నాడు. ఆనందపారవశ్యంతో మాస్టారు ఆతడిని ఆలింగనం చేసుకున్నారు. కాసేపటివరకు ఇద్దరు మాట్లాడలేక పోయారు. ఆనందభాష్పాలు కన్నుల నిండాయి. వారిద్దరి మధ్య ఏర్పడిన అవ్యాజమైన ప్రేమకి ఎంతని వెలకట్టగలం? చూపరులకు దృశ్యం ఎంత మనోహరంగా ఉందో!
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - మాతృదేవోభవ - by k3vv3 - 21-01-2025, 04:25 PM



Users browsing this thread: 1 Guest(s)