Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#43
 ఒకనాడు శుభాంగిని దర్శించిన మహర్షులు "అమ్మా శుభాంగి. అశ్వనీ దేవ తేజోవిలాసిని! వేద పురాణే తిహాసాలను సమస్తం చక్క గా అభ్యసించావు. సుపరిపాలనకు దశ అర్హతలను సంపాదించుకున్న దశార్హ మహారాజు సుపుత్రికగ పదికి మించి అనేక శుభార్హతలను సంపాదించుకుని శుభాంగి వయ్యావు.. 



 గగనానికి వెలుగునిచ్చేవాడు శ్రీ సూర్య నారాయణుడు అయితే దశార్హ దేశానికి వెలుగునిచ్చే దానివి నువ్వు. నువ్వు శ్రీ సూర్య నారాయణుని అనుగ్రహం కూడా పొందావంటే నిన్ను మించిన వారు భువిలో, దివిలో మరెక్కడా ఉండరు. కావున శ్రీ సూర్య నారాయణుని అనుగ్రహం పొందడానికి నువ్వు తపస్సు చెయ్యి. నీ చరిత్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. " అని అన్నారు. 



 శుభాంగి మహర్షుల మాటలను అనుసరించి శ్రీ సూర్య నారాయణ మూర్తిని ధ్యానిస్తూ తపస్సు చేయసాగింది. 



ఒకనాడు వశిష్ట మహర్షి కురు మహారాజు మందిరానికి వెళ్ళాడు. కురు మహారాజు వశిష్ట మహర్షి ని తగిన విధంగా సత్కరించాడు. 



అంత వశిష్ట మహర్షి, " కురు మహారాజ! మీ పూర్వీకులు హస్తి మహారాజు పేరు మీద హస్తినాపుర రాజధాని ఏర్పడింది. నీ తల్లి సాక్షా త్తు సూర్య నారాయణుని పుత్రిక. నువ్వు నీ చిన్న తనం లోనే సూర్య మండలాన్ని సందర్శించావు. తండ్రిని మించిన తేజస్సు తో ప్రకాశిస్తున్నావు. నీ తలిదండ్రులు వివాహం చేసుకున్న కొత్తలో వారెక్కువ కాలం దేవలోకాల లో, పవిత్ర వనాలలోనే గడిపారు. నువ్వు పవిత్ర వనంలోనే వారికి పుట్టావు.
 
నీ తండ్రి సంవరుణుడు పవి త్ర వనంలో ఉన్నప్పుడు నేనే హస్తినాపురంలో అనేక శాంతి యాగాలను జరిపించాను. అలా హస్తినాపురం పవిత్ర పురం గా మారింది. అలాంటి పవిత్ర పురమును నువ్వు మరింత పవిత్ర పురంగ మార్చు. సుపరిపాలన చేసి వంశ కర్తగా పేరు తెచ్చుకో. " అని అన్నాడు. కురు మహారాజు వశిష్ట మహర్షి మాటలను శిరసా వహిస్తానని మహర్షికి మాట యిచ్చాడు. 



 కురు మహారాజు రాజ్యంలోని దుర్గపరిఖాదుల ను మరింత పటిష్టం చేసాడు. హస్తినాపురంలో గొప్ప గొప్ప హర్మ్యాదులను నిర్మించే ప్రజలకు సహకరించా డు. రథగజతురగభటాదుల సంఖ్యను పెంచాడు. హస్తినాపురం ను అందంగ తీర్చిదిద్దాడు. తాతగారైన సూర్య భగవానుని సేవలో కాలం గడపసాగాడు. 
 శుభాంగి పర్ణశాలల నడుమన ఉన్న పర్వత ప్రాంతాన తపము చేయసాగింది. ఆమె తపో ప్రభావాన సూర్య మండలం అతలాకుతలం అయ్యింది. సూర్య భగవానుడు శుభాంగి ముందు ప్రత్యక్షమయ్యాడు. సూర్య భగవానుని చూచిన శుభాంగి సూర్య తేజాన్ని తట్టుకునే శుభదేహాన్ని తనకివ్వమని కోరింది. 



సూర్య భగవానుడు తథాస్తు అంటూ "శుభాంగి, నువ్వు నా కుమార్తెకు బంధువు అవుతావు. నా కుమార్తె పుత్రుని వంశ కర్తవు చేస్తావు. అశ్వనీ దేవతల తేజస్సు తో మరియు నా తేజస్సు తో ప్రకాశించే నీ శుభ అంగమైన తనువును మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ఎవరు తాకిన వారు సర్వ రోగాలనుండి విము క్తి పొందుతారు.. అశ్వినీ తేజో విలాస శ్రీసూర్య నారాయ రూప శుభాంగీ తనూలత.. అంటూ నీ పేర విజ్ఞానాత్మక మంత్ర తేజం ఆవిర్భవిస్తుంది. " అని ఆశీర్వ దించాడు. 



 కురు మహారాజు కలలో శుభాంగి దివ్య రూపము కనపడింది. కురు మహారాజు చిత్ర కారులను పిలిపించి తన కలలో కనపడిన వనిత రూపురేఖలను వివరించాడు. సూర్య మండలంలో ప్రకాసిస్తున్న శుభాంగి చిత్ర పటాన్ని ఒక చిత్ర కారుడు చక్కగ చిత్రించాడు. 



చిత్ర పటాన్ని చూసిన వసిష్ట మహర్షి "కురు మహా రాజ, సుందరి దశార్హ మహారాజు కుమార్తె శుభాంగి. తపో మార్గాన సూర్య భగవానుని ప్రత్యక్షం చేసుకున్న పుణ్య స్త్రీ. దశార్హ మహారాజుకు మన హస్తినాపురం రాజులన్నా, మన హస్తినాపురం అన్నా మహా గౌరవం. నీ వివాహ విషయం మాట్లాడటానికి దశార్హ మహారాజు దగ్గరకు నేనే ప్రత్యేకంగా వెళతాను.", అని అన్నాడు. 



కురు మహారాజు తన మూల పురోహితుడు, తన వంశ సంరక్షకుడైన వసిష్టుని మాటలను విని మహదానంద పడ్డాడు. 



 వశిష్ట మహర్షి దశార్హ మహారాజు ఆస్థానానికి వె ళ్ళాడు. దశార్హ మహారాజు వశిష్ట మహర్షిని తగిన రీతి లో సత్కరించాడు. పేము బద్దలతో తయారు చేయబడిన ఉచితాసనం ఇచ్చి గౌరవించాడు. 



అప్పుడు వశిష్ట మహర్షి " దశార్హ మహారాజ! నేను ఇక్కడకు ఒక శుభ కార్యం నిమిత్తం వచ్చాను. అదేమిటో చెబుతాను విను. చంద్రవంశ రాజులలో సంవరణ మహారాజు కు గొప్ప పేరు ఉంది. సంవరణ మహారాజు హస్తినాపురం ను పరిపాలిస్తున్నాడు. అతని ధర్మపత్ని తపతి సూర్య భగవానునికి కుమార్తె. పుణ్య దంపతులకు పుట్టిన వాడే కురు మహారాజు. 



 యదు వంశ రాజులలో నీవెలా ప్రజానురంజక పాలన చేసి దశార్హ వంశ కర్తవయ్యావో అలాగే కురు మహారాజు వంశ కర్త గా మారాలని పలు ప్రయత్నాలు చేస్తున్నాడు. కురు మహారాజు నీ కుమార్తె శుభాంగిని యిష్ట పడుతున్నాడు. నువ్వూ, నీ కుమార్తె శుభాంగి యిష్టపడితే కురు మహారాజు తలిదండ్రులు ప్రత్యక్షంగా మి మ్ములను కలిసి వివాహ మాటలు మాట్లాడాలనుకుంటున్నారు. " అని అన్నాడు. 



 వశిష్ట మహర్షి మాటలను విన్న దశార్హ మహారాజు మహర్షిని రోజు విశ్రాంతి తీసుకోమని మహర్షికి రాజ మందిరంలోని ప్రత్యేక పర్ణశాలను విడిది మందిరంగా ఏర్పాటు చేసాడు. వశిష్ట మహర్షి పర్ణశాల లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు శుభాంగి వశిష్ట మహర్షి ని కలిసి సాష్టాంగ ప్రణామాలర్పించింది. 



వశిష్ట మహర్షి శుభాంగిని ఆశీర్వదించాడు. అనంతరం కురు మహారాజు గుణగణాలను, రాజ్యాన్ని పరిపాలిస్తున్న విధానాన్ని శుభాంగికి తెలిపాడు. అనంతరం "అమ్మా ! శుభాంగి, నీ దివ్య తేజో యశస్సు ప్రభావాన నీ తండ్రి దశార్హ వంశ కర్త అయ్యాడు. అలాగే నీ ధర్మపతి కురు మహారాజు కురువంశ కర్త కావాలి" అన్నాడు. 



"మీ ఆశీర్వాద బలమే సర్వ శుభాలకు మూలము" అని శుభాంగి వశిష్ట మహర్షి కి మరోమారు నమస్కరించింది. 
 మహారాజుల, మహర్షుల, శుభాంగి బంధువుల, కురు మహారాజు బంధువుల సమక్షంలో శుభాంగి కురు మహారాజు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శుభాంగి, కురు మహారాజులను శ్రీ సూర్య నారాయణుడు ఆశీర్వదించాడు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - ప్రియంవద - by k3vv3 - 15-01-2025, 09:40 PM



Users browsing this thread: 1 Guest(s)