Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#56
"ధర్మం... న్యాయం... నీతి... నిజాయితీ... అనుకొనేదానికి ఆనందంగా వుంటాయి. కానీ... అవేవీ కాసులను సంపాదించలేవు!... పొలంలో నారుపోసి నాటి... మందులు కొట్టి... రైతులు మంచి దిగుబడిని ఆశిస్తారు. పెట్టిన పెట్టుబడి కన్నా అధిక లాభం రావాలని కోరుకొంటారు. అలా పెట్టిన పెట్టుబడి తిరిగి లాభంతో వస్తే దాన్ని మరో పనికి ఉపయోగించుకోవచ్చు. పెట్టిన పెట్టుబడి మునిగిపోతే మనిషి దివాలైపోతాడు. 



డబ్బు విలువ సంపాదించే వాడికే తెలుస్తుంది. ఖర్చు పెట్టే నీలాంటి వాళ్ళకు దాన్ని సంపాదించడం ఎంత కష్టమో... దాని విలువేంటో తెలీదు. మరోమాట! నేను నీ తండ్రిని... నీచేత ఏం చేయించాలో... ఎలా చేయించాలో నీకన్నా నాకు బాగా తెలుసు. మాటను మరిచిపోకు" వ్యంగ్యంగా నవ్వాడు ప్రజాపతి.



ప్రణవి అక్కడికి వచ్చింది. తలవంచుకొని మౌనంగా కూర్చొని వున్న దీప్తిని చూచింది.
"దీప్తిని ఏమన్నారండీ!..."



"నేను ఏమీ అనలా!... ఆమె భావి జీవితం ఎలా సాగాలో విషయం చెప్పా!...."



"నాన్నా!... నా భావిజీవితాన్ని గురించి నిర్ణయాలు తీసుకొనే అధికారం నాకు లేదా!..." రోషంతో అడిగింది దీప్తి.



"నీ నిర్ణయం... నాకు నచ్చితే అభ్యంతరం లేదు. నచ్చకపోతే... నా నిర్ణయమే నీ నిర్ణయం కావాలి. అదే నేను నీకు చెప్పింది!..."



"ఏం చెప్పారు?..." అడిగింది ప్రణవి.



"చెన్నైలో ప్రాక్టీస్ ప్రారంభించాలని చెప్పాను."



"చెన్నైలోనా!..."



"అవును... రకరకాల రోగులు వుండే స్థలం... పెద్దనగరం..."



దీప్తి దీనంగా తల్లి ముఖంలోకి చూచింది.
"అది సరేలే!... చూద్దాం... నీ ఢిల్లీ ప్రయాణాన్ని గురించి చెప్పావా అమ్మా!...."



"లేదమ్మా!...."



"ఏమండీ!... అమ్మాయి ఢిల్లీకి వెళుతుంది."



"ఎందుకు?..."



"ఆమె స్నేహితురాలి పెళ్ళి..."



" విషయం తను నాతో చెప్పలేదే!..." ఆశ్చర్యంతో అడిగాడు ప్రజాపతి.



"మన మధ్యన చాలా ఘాటైన సంభాషణ జరిగింది కదా నాన్నా!... విషయాన్ని మీకు నేను చెప్పేదానికి మీరు నాకు అవకాశం ఇవ్వలేదుగా!..." బుంగమూతితో చెప్పింది దీప్తి.



ముఖం చిట్లించి కూతురు ముఖంలోకి చూచాడు ప్రజాపతి.
కొన్ని క్షణాల తర్వాత....
"అమ్మా దీప్తీ! వెళ్ళితీరాలా!..."



"రాధ అమెరికాలో నా రూమ్మేట్ నాన్నా!... ఫోన్ చేసి ఎంతగానో బ్రతిమాలింది. నేను తన పెళ్ళికి వెళ్ళితే కదా!... అది నా పెళ్ళికి రాగలదు!..." చిరునవ్వుతో చెప్పింది దీప్తి.



"సరే వెళ్ళిరా!..." అన్నాడు ప్రజాపతి.



"నాన్నగారు అనుమతించారుగా! ఇక పద... వారిని పని చేసికోనీ!..." అంది ప్రణవి.



"ఎప్పుడమ్మా నీ ప్రయాణం!..." అడిగాడు ప్రజాపతి.



"వచ్చే సోమవారం నాన్నా...." అంది దీప్తి.



"సరే!..." లెడ్జర్లోని పేజీలను చూడసాగాడు ప్రజాపతి.



దీప్తి, ప్రణవీలు గది నుంచి బయటికి వచ్చారు.
వారికి మాధవయ్య ఎదురైనాడు. 
"అమ్మా!... దీప్తి నాన్న ఇంట్లో వున్నారా!..."



"ఆఁ... వున్నారు..."



మాధవయ్య ప్రజాపతి గదిలో ప్రవేశించాడు.
"ప్రజాపతీ!... నీకో శుభవార్త..." నవ్వారు మాధవయ్య.



"ఏమిటది!..." అడిగాడు ప్రజాపతి.



మాధవయ్య తలుపును మూసి వచ్చి ప్రజాపతికి ఎదురుగా కూర్చున్నాడు.



"అమోఘమైన సంబంధం ప్రజాపతి!" చిరునవ్వుతో చెప్పాడు మాధవయ్య.



"ఆడనా!... మగనా!..."



"మనకు ముందు కావలసింది మొగపిల్లావాడే కదా!..."



" వూరు?.."



"చెన్నై..."



"పిల్లవాడు ఏం చేస్తున్నాడు?..."



"డాక్టర్... కోటీశ్వరులు. ఒకే కొడుకు. అతనికి ముందు ఆడపిల్ల. అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. తండ్రికి పడవల మీద వ్యాపారం. ఎగుమతి దిగుమతి. మన దీప్తికి అన్నివిధాలా తగిన సంబంధం ప్రజాపతీ!..."



"వాళ్ళు మనవాళ్ళేనా!..."



" నిక్షేపంలా.... ఇంటిపేరు కంచర్ల.... అబ్బాయి పేరు వినోద్. తండ్రిగారి పేరు సాంబయ్య. అబ్బాయి వయస్సు ఇరవై ఎనిమిది" చంకకు తగిలించుకున్న గుడ్డ సంచిలో నించి ఫోటోను తీసి ప్రజాపతికి అందించాడు మాధవయ్య.
ఫొటోను పరిశీలనగా చూచాడు ప్రజాపతి.
"అబ్బాయ్ ఎలా వున్నాడు?..." నవ్వుతూ అడిగాడు మాధవయ్య.



"మన వివరాలను వారికి అందించావా!..."



"నీవు సరే... అంటే అదెంత పని!..."



"సరేరా మాధవా!... ప్రొసీడ్ అయిపో..."



"మన దీప్తికి... నీ భార్యామణికి ఫోటోను చూపిస్తావా?..."



విషయం నాకు వదిలెయ్యి. వారిని కలిసి మాట్లాడి నెలరోజుల లోపల పెండ్లిచూపులు... నిశ్చితార్థం జరిగేటట్లు చూడు... సంచిలో నుంచి మరో కాగితాన్ని తీసి "ఇది అబ్బాయి జాతకం... నేను దీప్తికి అతనికి పొంతనాలు చూచాను. మన దీప్తి పులి... అతను మేక. మన అమ్మాయి మాటను ఏనాడూ కాదనలేడు" నవ్వాడు మాధవయ్య.



"సరే పద... ఫ్యాక్టరీ దాకా వెళ్ళిద్దాం."



ప్రజాపతి... మాధవయ్యలు గది నుండి బయటికి నడిచారు.
====================================================================
ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 9 - by k3vv3 - 10-01-2025, 09:42 PM



Users browsing this thread: 1 Guest(s)