Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#55
"వున్నారు... మీ పేర్లు!"



"సోమయ్య... చంద్రయ్య..."



"కూర్చోండి. నాన్నగారికి చెప్పి వస్తాను" లోనికి వెళ్ళింది దీప్తి.



"నాన్నా!.... మీకోసం సోమయ్య, చంద్రయ్య వచ్చారు."



"లోనికి రమ్మని చెప్పు"



దీప్తి గది నుండి బయటికి నడిచి వారిని లోనికి రమ్మని పిలిచింది.
ఇరువురూ... ప్రజాపతి గదిలో ప్రవేశించారు. వినయంగా నమస్కరించారు.



"ఆఁ... ఏందిరా!.... ఉదయాన్నే వచ్చారు!..." అడిగాడు ప్రజాపతి.
"అయ్యా!... మీరు మాకు సాయం చెయ్యాలి!" మెల్లగా చెప్పాడు సోమయ్య.



"ఏమిటది?"



"వీడు నా తమ్ముడు..."



"తెలుసు. మీకేం కావాలి?"



"ఈడి పిల్ల పెళ్ళీడుకొచ్చింది. పెండ్లి చేయాలనుకొంటున్నాము. తమరు..." ఆపేశాడు సోమయ్య.



"డబ్బు కావాలా!..."



"అవునయ్యా!...."



"ఎంత?..."



" యాభై వేలు..."



"యాభై వేలా!..."



"అవునయ్యా!.... మాత్రం కావాల!..."



"తిరిగి ఎప్పుడు ఇస్తావ్!..."



" రెండేళ్ళల్లో..." నసిగాడు సోమయ్య.



"వడ్డీరేటు ఎంతో తెలుసా!..."



"అయ్యా!..." ఆశ్చర్యంతో అన్నాడు సోమయ్య.



"మూడూ రూపాయలు... నూటికి నెలకు!..."



"తమరు మంచి మనస్సుతో సాయం చేయాలయ్యా!..." 
ప్రాధేయపూర్వకంగా అడిగాడు సోమయ్య.



"చేస్తాను... వడ్డీరేటు మాత్రం అంతే... ఇష్టం అయితే సాయంత్రం రండి ప్రామిసరీ నోటు వ్రాసి వుంచుతాను. సంతకం చేసి డబ్బు తీసుకొని వెళుదువు గాని!..."
సోమయ్య, చంద్రయ్యలు ఒకరి ముఖాలొకరు చూచుకొన్నారు. చంద్రయ్య తలాడించాడు.



"సరే అయ్యా!... సాయంత్రం ఐదుగంటలకు వస్తాం..."



"కాదు... ఏడుగంటలకు రండి!..."



చేతులు జోడించి వారిరువురూ గదినుండి బయటికి నడిచారు. దీప్తి తండ్రిగారి గదిలోకి ప్రవేశించింది.
"నాన్నా!..." 



లెడ్జర్ను చూస్తున్న ప్రజాపతి కూతురు పిలుపుకు తన ముఖంలోకి చూచాడు.



" లెక్కలు చూచుకొనేదానికి క్యాలిక్యులేటర్ కొనుక్కోవచ్చుగా!..."



ప్రజాపతి నవ్వు... "కష్టపడి నేర్చుకొన్న ఎక్కాలను మరచిపోతాం..." వెటకారంగా అన్నాడు.



దీప్తి... ఆశ్చర్యంతో ప్రజాపతి ముఖంలోకి చూచింది.
నాన్న ఇంత పిసినారా!... అనుకొంది.



"అవునూ!.... ఎం.బి.బి.యస్, ఎం.ఎస్ అయిపోయె!... ముందు ఏం చేయాలనుకొంటున్నావ్!"



"మన వూర్లోనే హాస్పిటల్ ప్రారంభించాలనుకొంటున్నాను..."



" గూడూరులోనా!..."



"ఏం పెట్టకూడరా!..."



"పెడితే... నీ చుట్టూ తిరగబోయేది ఈగలు... దోమలు" 
నవ్వాడు ప్రజాపతి. 



కొన్ని క్షణాల తర్వాత....
"చూడు తల్లీ!... నేను నీ ప్రాక్టీస్కు చెన్నైలో ఏర్పాట్లు చేస్తున్నాను."



"చెన్నైయ్యా!..." ఆశ్చర్యంతో అడిగింది దీప్తి.



"అవును..."



"నేను మన వూరిలోనే వుండి.... పేదలకు ఉచితంగా చికిత్సలు చేయాలనుకొంటున్నాను నాన్నా!.."



"ఏందీ!.... పేదలకు ఉచితంగా చికిత్సలా!...."



"అవును..."



"మరి నీమీద నేను పెట్టిన పెట్టుబడి సంగతి గురించి ఆలోచించావా!..."



"పెట్టుబడా!..." ఆశ్చర్యంతో అడిగింది దీప్తి.



"అవును... నీ డాక్టర్ చదువుకి... నీ అమెరికా యాత్రకు... ఐదేళ్ళు అక్కడ వున్నదానికి... లక్షలు ఖర్చుపెట్టాను. డబ్బు లేకుంటే ఇవన్నీ జరిగి వుండేవా... నీవే చెప్పు..."



"నన్ను కన్న తండ్రిగా అది నీ ధర్మం కదా నాన్నా!..."
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 9 - by k3vv3 - 10-01-2025, 09:41 PM



Users browsing this thread: 1 Guest(s)