Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#52
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 10



"ఎవరమ్మా మీరు...?" ఇంటి ముఖద్వారం తెరిచి అడిగాడు రామయోగి.



కొద్దిక్షణాల క్రిందట దీప్తి వారి ఇంటికి వెళ్ళి వరండాలోని కాలింగ్ బెల్ నొక్కింది.
"నా పేరు దీప్తి!... ప్రజాపతి గారి అమ్మాయిని!..."



"... నీవు దీప్తివా!..." ఆశ్చర్యంతో అడిగాడు రామయోగి.



"అవును అంకుల్... మీతో మాట్లాడాలని వచ్చాను."



"ఎంతగా మారిపోయావమ్మా... గడచిన ఐదేళ్ళలో... అమెరికాలో చదివావు కదా!..."



తలాడించింది చిరునవ్వుతో దీప్తి.



"కూర్చో అమ్మా!..."



కుర్చీలో కూర్చుంది దీప్తి.
రామయోగి ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు.
"అడుగమ్మా!.... నీవు ఏమి అడగదలిచావో!" చిరునవ్వుతో చెప్పాడు రామయోగి.



"నేను ఢిల్లీకి వెళ్ళాల్సిన పనివుంది. మీ అబ్బాయి కళ్యాణ్ అడ్రస్ చెప్పండి అంకుల్!"



"ఎందుకమ్మా!...."



"మా వదిన వాణిని చూడాలి. చూచి చాలాకాలం అయిందిగా అంకుల్!..."



"ప్రస్తుతంలో మీ రెండు కుటుంబాలకు బద్ధ విరోధం కదమ్మా!..."



"మీరు అన్నమాట బహుశా మా రెండు కుటుంబాల పెద్దలకు వర్తిస్తుందో ఏమో!.... కానీ నాకు మాత్రం అందరం ఆనందంగా కలిసి బ్రతకాలనే కోరిక. మా వదిన... అదే మీ కోడలు వాణి చాలా మంచిది అంకుల్. తనకు నేనంటే ఎంతో ఇష్టం. అందుకే ఒకసారి చూడాలనుకొంటున్నాను!" ఎంతో వందనంగా చెప్పింది దీప్తి.



"మీ నాన్నగారికి విషయం తెలుసా!..."



"వారు చెన్నై వెళ్ళి వున్నారు. రాగానే చెబుతాను..."



"వారు అంగీకరించకపోతే!..."



"మా నాన్న నా మాటను కాదనరు అంకుల్..."



"అలాగా!...."



"అవును!..."



"నీవు ఒక్కదానివే వెళుతున్నావా!... లేక మీ అత్తయ్యా వాళ్ళ ఇంటినుంచి నీతో ఎవరైనా వస్తున్నారా?..."



" ఇంటివారు ఎవరూ నాతో రావడం లేదు. ఢిల్లీలో నా స్నేహితురాలు వుంది. నేను ఢిల్లీ వెళ్లగానే వుండబోయేది ఆమె ఇంట్లోనే!..."



రామయోగి భార్య నిర్మల వరండాలోకి వచ్చింది దీప్తిని చూచి...
"ఎవరండీ అమ్మాయి?..." అడిగింది.



"మన ప్రజాపతిగారు కూతురు. అమెరికా నుంచి వచ్చింది" 
అన్నాడు రామయోగి.



"నీపేరు దీప్తి కదూ!..."



"అవును ఆంటీ!..."



"మీ అమ్మగారు బాగున్నారా!.... తనకు నాకు మంచి స్నేహం" నవ్వుతూ చెప్పింది నిర్మల.



"అలాగా!... బాగున్నారండి..."



"మీ అమ్మది చాలా మంచి మనస్సు అమ్మాయ్!..."



చిరునవ్వు నవ్వి రామయోగి ముఖంలోకి చూచింది నిర్మల.
చూపుల్లోని భావాన్ని గ్రహించిన రామయోగి కుర్చీ నుంచి లేచి...
"రెండు నిమిషాల్లో వస్తానమ్మా!..."



"మంచిది అంకుల్"



రామయోగి లోనికి వెళ్ళిపోయాడు.
"పెళ్ళి ఎప్పుడు చేసుకొంటావ్?" కుర్చీలో కూర్చుంటూ అడిగింది నిర్మల.



"మరో రెండేళ్ల తర్వాత"



"ఇప్పుడు నీ వయస్సెంత?"
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 9 - by k3vv3 - 10-01-2025, 09:38 PM



Users browsing this thread: 1 Guest(s)