Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#39
"అవును తండ్రి అవును. 99 యజ్ఞాలు నిర్విఘ్నంగా చేసాను. త్వరలో నూరవ యజ్ఞం కూడా చేస్తాను. " అన్నాడు నహుషుడు. 



"ప్రియంవద నీకు తోడుంటే నీవెన్ని యజ్ఞాలనైన చేయ గలవు నహుష చేయగలవు.. నూరు యజ్ఞాలు చేసిన వారికి దేవేంద్ర పదవిని అధిష్టించే సామర్థ్యం వస్తుంది. " నహుషునితో అన్నాడు ఆయువు. 



"దేవేంద్ర పదవి వస్తుందని యజ్ఞాలు చేయడం సరైన ఆలోచన కాదు తండ్రి సరైన ఆలోచన కాదు. " నహుషుడు తన తండ్రి ఆయువుతో అన్నాడు. 



"నిక్కము వక్కాణించితిరి నాథ. నిక్కము వక్కాణించితిరి. ప్రకృతి పరిరక్షణ నిమిత్తం రాజులు, మహారాజులు సామంత రాజులు యజ్ఞాల మీద ఆసక్తి ఉన్న మహాను భావులు విరివిరిగా యజ్ఞయాగాదులు భక్తి శ్రద్ధలతో చేస్తారనే సదుద్దేశంతో నూరు యజ్ఞాలు చేసినవారికి దేవేంద్ర పదవి వరిస్తుందని చెప్పారు. నియమబద్ధంగా చేసే యజ్ఞయాగాదుల వలన ప్రకృతి కాలుష్యం తొలగిపోతుంది. ప్రశాంత జీవనానికి ప్రకృతి పంచభూతాలు చక్కగ సహకరిస్తాయి. 



యజ్ఞయాగాదులు చేసేవారు అదే మనసులో ఉంచుకుని యజ్ఞయాగాదులు చేయాలి.. మనసులో ఏదో మరొకటి పెట్టుకుని యజ్ఞయాగాదులు చేయడం వలన మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. " అంటూ ప్రియంవద అందరికీ శివ ప్రసాదం అందిస్తూ నహుషుని సమీపించింది. 



"అమ్మా ప్రియంవద,, నీ ధర్మ సూక్ష్మానుసారపథం అనుసరించి, నా పుత్రుడు నహుషుడు 99 యజ్ఞాలు నిర్విఘ్నంగా పూర్తి చేసాడు. నూరవ యజ్ఞం ను కూడా నువ్వే నీ పతిదేవుని తో జరిపించి నహుషుని మహోన్నత ధర్మపత్ని గా దివిలో భువిలో శాశ్వత కీర్తిని ఆర్జించు. " అని కోడలైన ప్రియంవదతో ఆయువు అన్నాడు. 



"అమ్మా ప్రియంవద. నా పుత్రుడు నహుషునికి తల్లి పోలికలతో పాటు, తల్లి గుణగణాలు కూడా బాగానే వచ్చాయి. విషయాన్నే ప్రతిష్టాన పుర ప్రజలందరూ అనుకుంటారు. స్వర్భానుని కుమార్తెనైన నాలో అప్పుడప్పుడు రజో గుణం లేశ మాత్రం ఆవిర్భవిస్తుంది. మీ మామగారు ఆయువు సాంగత్యం వలన అది నాలో నా ఆధీనంలోనే ఉంటుంది. నా పుత్రుడైన నహుషునిలో కూడా రజోగుణం అప్పుడప్పుడు లేశ మాత్రం ఉద్భవిస్తుంది. దానివలన అహం వంటి దుర్గుణాలు కొన్ని ఆవరిస్తాయి. నహుషునిలో ఉన్న స్వల్ప రజోగుణాన్ని నువ్వే తుడిచిపెట్టేయాలి. " కోడలు ప్రియంవద తో అంది ప్రభ. 



"మీ అందరి ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు ఉన్నంత కాలం నేనేదైన సాధించగలను అత్తగారు. " అంటూ ప్రియంవద అత్తగారైన ప్రభకు నమస్కారం చేసింది. 



 నహుషుడు తన ప్రియపత్ని ప్రియంవద సలహాలను అనుక్షణం అనుసరించి తన అపారబాహుబల సంపన్నతతో నిర్భయునిగా ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తూ కాలం గడపసాగాడు. 



 ఒకనాడు చ్యవన మహర్షి తపస్సు చేసుకుంటున్న సరోవరానికి కొందరు జాలరులు వెళ్ళారు. జాలరులు చేపలకై సరస్సులో వల వేసారు. వలలో చ్యవన మహర్షి పడ్డాడు. జాలరులు ఏదో పెద్ద చేప పడిందని వల ను బయటకు లాగారు. వలలో ఉన్న చ్యవన మహర్షిని చూచి జాలరులు "తప్పు జరిగిపోయింది సామి. మమ్ము క్షమించండి" అని అంటూ చ్యవన మహర్షి కాళ్ళ మీద పడ్డారు. 



అందుకు చ్యవన మహర్షి "ఇందులో మీ తప్పేం లేదు నాయనలారా! మీరు వలలో పడిన చేపలను తీసుకెళ్ళి అమ్ముకున్నట్లే నన్నూ అమ్ముకోండి. సందేహించకండి" అని జాలరుల తో అన్నాడు. 



 జాలరులు చ్యవన మహర్షి మాటలను కాదనలేక చ్యవన మహర్షి ని నహుషుని దగ్గరకు తీసుకు వెళ్లి జరిగిందంతా చెప్పారు. 



 నిరంతరం జలంలో తపస్సు చేసే చ్యవన మహర్షి కి సమానంగ జాలర్లకు ఏమివ్వాలని నహుషుడు ఆలోచన లో పడ్డాడు. అప్పుడు ప్రియంవద చ్యవన మహర్షికి సమానంగా జాలర్లకు గోవులను ఇవ్వమని భర్తకు సలహా ఇచ్చింది. 



"గోవులను మేం ఏం చేసుకోవాలి మహారాణి?" అని జాలర్లు ప్రియంవదను అడిగారు. 



 "గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. దేవతల అనుగ్రహం దక్కడానికి సులువైన మార్గం గోపూజ. గోవును రక్షిస్తే గోవే మిమ్మల్ని రక్షిస్తుంది. సమస్త సమస్యలను దూరం చేసే దివ్య మాత గోమాత." అని చ్యవన మహర్షి జాలరులకు చెప్పాడు. 



 చ్యవన మహర్షి మాటలను విన్న జాలరులు నహుషుడు ఇచ్చిన గోవులను స్వీకరించారు. అప్పుడు చ్యవన మహర్షి జాలరులకు స్వర్గ లోక ప్రాప్తి లభిస్తుంది అని వారిని ఆశీర్వదించాడు. ఆపై నహుషునికి ఇంద్ర పదవి దక్కుతుంది అని నహుషుని ఆశీర్వదించాడు. 



 కొన్ని రోజుల అనంతరం వశిష్టాది మహర్షులందరు మంచి శుభ ముహుర్తాన్ని నిర్ణయించగా నహుషుడు ప్రియంవద కనుసన్నల్లో నూరవ యజ్ఞం ను పూర్తి చేసాడు. 



 అప్పుడు దేవేంద్రాది దేవతలు ప్రియంవదను నహుషుని ఆశీర్వదించారు. ఇంద్రుడు దేవేంద్ర పదవిని స్వీకరించమని నహుషుని కోరాడు. ఇంద్రుని మాటలను విన్న నహుషుడు మృదువుగా "నాకు దేవేంద్ర పదవికన్నా చంద్రవంశ రాజుగా పార్వతీపరమేశ్వరుల ప్రియ పుత్రిక ప్రియంవద భర్తగా ఉండటమే మహాయిష్టం. " అని దేవేంద్ర పదవిని వలదన్నాడు. 



 నహుషుని మాటలను విన్న దేవేంద్రుడు, తదితర దేవతలు ప్రియంవద నహుషులను మనఃపూర్వకంగా ఆశీర్వదిస్తూ వారి రాజ్యమును సస్యశ్యామలం చేసారు. 



 నహుషుని సోదరులైన వృద్దరావు, రజి, గయుడు, అనేనసులకు కావల్సినవన్నీ ప్రియంవద సమ కూర్చింది. వారు యజ్ఞయాగాదులతోనూ, కళాసంబంధ కార్యక్రమాలతోనూ కాలం గడపసాగారు. 
 ప్రియంవద నహుషులకు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, అయతి, ధ్రువుడు అనే ఆరుగురు మగ సంతానం కలిగారు. 



 ఒకసారి ఇంద్రుని మీదకు వృత్రాసురుడనే రాక్షసుడు దండయాత్ర చేసాడు. ఇంద్రుడు వృత్రాసుని మీద కు సమరానికి సిద్దమయ్యాడు. ఇంద్రుడు ఇంద్రలోక సింహాసనంను ఖాళీగా ఉంచరాదనుకున్నాడు. ఇంద్రునికి నహుషుడు గుర్తుకు వచ్చాడు. ఇంద్రుడు నహుషుని దగ్గరకు వెళ్ళాడు. నహుషునికి వృత్రాసురుని గురించి చెప్పాడు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - ప్రభ - by k3vv3 - 06-01-2025, 10:06 AM



Users browsing this thread: 1 Guest(s)