Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 14(సమాప్తం))
సరిగ్గా అదే సమయంలో ధీరునిలా వారికెదురొచ్చి నిలబడ్డాడు సింహ దత్తుడు.
 
"మా ప్రేమకు ప్రతిరూపాలని నామరూపాలు లేకుండా చేసావే. అసలు నీకు మనసంటూ ఉందా?" అని అడిగాడు జ్వాలా జిహ్వుడు.
 
"మీ ప్రేమకు ప్రతిరూపం ప్రపంచానికి ఆటంకం కాకూడదు కదా", అన్నాడు సింహ దత్తుడు.
 
"అంజీరణులు ఎవ్వరికైనా హాని తలపెట్టాయా?" రోదిస్తూ అంది భైరవి.
 
"అవి చంపే దాకా చూస్తూ ఉండమంటారా?" అని ఎదురు ప్రశ్న వేసాడు సింహ దత్తుడు.
 
"వాటిని లయం చెయ్యటానికి నువ్వెవరు? శివుడివా?" కోపంగా అడిగాడు జ్వాలా జిహ్వుడు.
 
"లయం చేసే ప్రతి వాడు శివుడే. లయం లేనిదే సృష్టి లేదు. సృష్టి అంటూ ఉంటే లయం అవ్వక తప్పదు. అది ధర్మం", అని ఎలాంటి బెదురు లేకుండా చెప్పాడు సింహ దత్తుడు.
 
"ఏది లయం చెయ్యాలో శివుడికి తెలుసు. కాలానికి తెలుసు. అసలు నువ్వెవరు?" అంటూ కోపంగా అడిగింది భైరవి.
 
"సింహదత్తుడిని. సింహళ రాజ్యం ఉన్న నేలపైనే రాజ్యపరిపాలన చేసిన రాజును", అంటూ బదులిచ్చాడు.
 
"అది ఒకప్పుడు. ఇప్పుడు కాదు కదా", అన్నాడు జ్వాలా జిహ్వుడు.
 
"నిజమే. కానీ ఇప్పుడు శంభల రాజకుమారి విజయకుమారి నా సతీమణి. శంభలను, శంభల ప్రజలనూ కాపాడే బాధ్యత నాదే", అన్నాడు సింహ దత్తుడు.
 
"మాకు పుత్రశోకం కలిగించిన నిన్ను ఊరికే వదిలిపెట్టము. మేము చచ్చినా సరే నీకు పుత్రశోకం కలిగితీరుతుంది" అంటూ శపించారు జ్వాలా జిహ్వుడు, భైరవిలు.
 
సింహ దత్తుడి నోట మాటరాలేదు. తను ఇంతవరకూ పరాక్రమం చూపించాను అనుకుంటున్నాడు. కానీ అది ఇంతటి దుఃఖం తెచ్చిపెడుతుందని అనుకోలేదు.
 
జ్వాలా జిహ్వుడు, భైరవిలు కేవలం కామ సుఖాలను అనుభవించారనుకున్నాడు. కానీ ఇప్పుడు వారు తల్లిదండ్రుల స్థానంలో తనను ప్రశ్నిస్తున్నారు. వారి బాధలో నిజముంది. వారి భావనలో ఎంత నిజమున్నదో వారికే తెలియాలి. ఇలాంటి ధర్మ సందిగ్ధంలోనే సరిగ్గా తన పూర్వీకులు కూడా నెట్టివేయబడ్డారు.
 
అప్పుడు సింహదత్తుడు ఆకాశం వైపుకు చూస్తూ ఇలా అన్నాడు.
 
"రాజుగా ధర్మాన్ని పాటించిన నన్ను శివుడివా అని వీళ్ళు అడుగుతున్నారు. రాక్షస సంహారం చేసిన నన్ను పుత్రశోకం కలిగించావు అంటున్నారు. నాకు పుత్రశోకం కలిగితే మాత్రం నా కొడుకు నిన్నే చేరుకుంటాడు శివా. నిన్నే చేరుకుంటాడు. నిన్నే ప్రశ్నిస్తాడు. నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తాడు. నిన్ను నిలదీస్తాడు శివా. గుర్తుపెట్టుకో", అంటూ సింహ దత్తుడు వజ్రమణి అనే ఆయుధాన్ని తీసి జ్వాలా జిహ్వుడిపై సంగ్రామానికి బయలుదేరాడు.
 
నిరంతరాయంగా రెండు గంటలు జరిగిన యుద్ధంలో చివరికి జ్వాలా జిహ్వుడు, భైరవి ప్రాణాలు విడిచారు. సింహదత్తుడు శంభల కోసం వారితో తలపడుతూ తన ప్రాణత్యాగం చేసాడు. చరిత్రకెక్కాడు. విక్రమసింహుణ్ణి శంభలకిచ్చాడు.
 
వరుణప్రాకారంలో నిల్చున్న అభిజిత్ కళ్ళముందు ఇదంతా ఆవిష్కృతం అయింది.
 
కుండపోతగా అక్కడ వర్షం కురుస్తోంది.
 
అది వర్షం కాదు సింహదత్తుడి కన్నీరే అని తెలుస్తోంది అభిజిత్ రూపంలో ఉన్న విక్రమసింహుడికి. ఇదంతా తెలుసుకున్న అంకిత, సంజయ్ లకు విక్రమసింహుడి వేదన మొదటి సారి అర్థం అయినట్టు అనిపించింది. సింహదత్తుడి పరాక్రమం ఎల్లలు లేనిదిగా తోచింది.
 
రుద్రసముద్భవ మీసం మెలేసాడు. సింహాన్ని చూస్తేనే కాదు తలచుకున్నా సరే ధైర్యం కలుగుతుంది. ధైర్యం అతని చేత చేయించిన చేష్ట అది.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 12 - by k3vv3 - 06-01-2025, 10:00 AM



Users browsing this thread: