03-01-2025, 09:30 AM
సీతాపతి వెంటనే జవాబు చెప్పలేకపోయాడు.
కొన్నిక్షణాల తర్వాత...
"అవును... నీవు అన్నమాట నిజమే!... కానీ కాలం... చాలా పవరైందిరో... మన సంకల్పం సరిగా వుండాలి... జరగవలసిన టైమ్కు అన్నీ సవ్యంగా జరుగుతాయి. నాకు ఆ నమ్మకం వుంది" చిరునవ్వుతో చెప్పాడు సీతాపతి.
ఇరువురూ శివాలయాన్ని సమీపించారు. లోనికి ప్రవేశించారు.
సీతాపతి... ప్రణవ్... కళ్ళు శార్వరిని వెదుకుతున్నాయి.
శార్వరి తన అమ్మా, నాన్న పేరున అర్చన చేయించి గుడిచుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించింది. ఆలయం నిండా జనం. శివలింగానికి నమస్కరించి సీతాపతి కూడా ఆలయ ప్రదక్షిణ ప్రారంభించాడు. మూడు చుట్లు పూర్తయినాయి.
స్వామిని దర్శించి ప్రదక్షిణను ముగించిన వారు ప్రహారీగోడ ప్రక్కన కూర్చుని వున్నారు తమ కుటుంబ సభ్యులతో.
శార్వరి... ఓ ప్రక్కన కూర్చొని కళ్ళు మూసుకొంది.
నాల్గవ ప్రదక్షిణను చేస్తూ ఇరువురు మిత్రులూ... శార్వరిని వెదుకుతూ తిరిగారు. గోడ ప్రక్కన కూర్చుని వున్న శార్వరిని ప్రవీణ్ చూచాడు.
నవ్వుతూ "ఒరేయ్ బావా!.... అదుగో మా చెల్లి..." అన్నాడు.
తొట్రుపాటుతో సీతాపతి ప్రవీణ్ చెప్పినవైపు చూచాడు. అతనికళ్ళల్లో ఎంతో ఆనందం.
మెల్లగా వెళ్ళి కొంచెం దూరంగా శార్వరి ప్రక్కన కూర్చున్నాడు. అతను కళ్ళు మూసుకొన్నాడు.
ప్రవీణ్... ఇరువురినీ చూస్తూ నిలబడ్డాడు.
కొన్ని నిముషాల తర్వాత శార్వరి కళ్ళు తెరిచి లేచింది. ఎదురుగా నిలబడి వున్న ప్రవీణ్ను చూచింది.
"ప్రవీణ్!... నీవెప్పుడొచ్చావ్!"
"నేను ఒక్కడినే రాలేదు" నవ్వాడు.
"మరి నీతో ఎవరొచ్చారు?"
ప్రవీణ్ చూపుడు వ్రేలితో సీతాపతిని చూపించాడు. శార్వరి సీతాపతిని చూచింది. పెదవులపై చిరునవ్వు.
సీతాపతి కళ్ళు తెరిచాడు. శార్వరి ముఖంలోకి చూచి నవ్వాడు.
శార్వరి సిగ్గుతో చిరునవ్వుతో తల దించుకొంది.
"వైజాగ్ నుంచి నీకోసం... చూడాలని వచ్చాను. ఎలా వున్నావ్ బావా అని అడగవా!" చిరునవ్వుతో అడిగాడు సీతాపతి.
"కళ్ళముందే వున్నావుగా!" మెల్లగా చెప్పింది శార్వరి.
"హైదరాబాద్కు ఎప్పుడు వెళతావ్!"
"వారంరోజుల తర్వాత..."
"రోజూ మనం కలిసికోగలమా!..."
"వీలుకాదు..."
"ఫోన్లో మాట్లాడొచ్చా!..."
"కుదరదు..."
"అయితే రేపు నన్ను వైజాగ్ వెళ్ళిపొమ్మంటావా!..."
"అది నీ ఇష్టం!..."
"నీకేం సంబంధం లేదా!..."
"ప్రస్తుతానికి లేదు.."
"తర్వాత...."
"దైవ నిర్ణయం... నేను హైదరాబాద్లో వుండేటప్పుడు అప్పుడప్పుడూ నీవు నాకు ఫోన్ చేసేవాడివి. నేను ఒంటరిగా వుంటే నీతో మాట్లాడేదాన్ని. అది కేవలం మనకున్న బంధుత్వరీత్యా!... నేటి మన రెండు కుటుంబాల మధ్యన వున్న సఖ్యత నీకు... నాకు బాగా తెలుసు. మా అమ్మనాన్నలు జరిగిన దానికి ఇప్పటికీ ఎంతగానో బాధపడుతున్నారు. మీ నాన్నగారు చేసిన చర్యకు నష్టపోయింది మేము. అవమానం పాలైనాము. నీ మనస్సున నాపట్ల వ్యామోహంతో కూడిన ఆశలను పెంచుకోకు. నీవు ఊహించినట్లు జరుగకపోవచ్చు. బంధుత్వాన్ని త్యజించాలనేది నా భావన కాదు. నా చర్యల వలన నా కుటుంబ సభ్యులు బాధపడకూడదనే నా అభిప్రాయం. మంచి మనస్సుతో అర్థం చేసికో.. బాగా చదువు... మంచి వ్యక్తిత్వాన్ని సంతరించుకో... జరుగబోయేది నా విషయంలో నా తల్లిదండ్రుల ఇష్టానుసారమే... నాకై నేను మా అక్కలా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోను. వెళుతున్నాను..." ఎంతో ఆవేశంతో చెప్పి శార్వరి వెళ్ళిపోయింది.
సీతాపతికి భ్రమ కమ్మినట్లయింది. నిశ్చేష్టుడై కొన్ని నిముషాలు నిలబడిపోయాడు. అతని వాలకాన్ని... చూచి ప్రవీణ్ కళ్లప్పగించాడు. కొన్నిక్షణాల తర్వాత...
"సీతూ.... శార్వరి వెళ్ళిపోయింది" మెల్లగా చెప్పాడు ప్రవీణ్.
"ప్రవీణ్!... శార్వరి మాటలు నీకు అర్థమైనాయా!..."
"అయినాయి బావా!..."
"ఏమర్థమయిందిరా!..."
"నిజం చెప్పనా!.... అబద్ధం చెప్పనా!..."
"నిజం చెప్పరా!...." కసరినట్లు అన్నాడు సీతాపతి.
"ప్రేమా... దోమా... అనే కబుర్లు నాకు చెప్పకు.. అలాంటి వాటిని నేను వినిపించుకోను. బుద్ధిగా చదువుకొని ప్రయోజకుడిగా తయారవ్వు..." అని హితోపదేశం చేసింది బావా నీకు" రెండు క్షణాలాగి "అవునూ నీకు చాలా బాధగా వుంది కదూ!..."
"లేదురా!.... నా కర్తవ్యం నాకు బాగా అర్థమయింది."
"అంటే?..."
"కొంతకాలానికి నీకే అర్థం అవుతుందిలే పద...." నిట్టుర్చి సీతాపతి ముందుకు నడిచాడు. ప్రవీణ్ అతన్ని అనుసరించాడు. వారికి మూడు వందల అడుగుల దూరంలో శార్వరి తన స్నేహితురాలు జ్యోతితో వెళుతూ వుంది.
సీతాపతి ఆమె వైపుకు పరుగెత్తాడు. రెండు నిముషాల్లో ఆమె ముందు నిలిచాడు. ప్రవీణ్ కూడా పరుగు ప్రారంభించాడు. శార్వరీ అతని ముఖంలో ఆశ్చర్యంతో చూచింది. ఆమె ముఖంలో అతని పట్ల అసహ్యత నిండుకుంది.
"ఒక ముఖ్యమైన మాట చెప్పాలని వచ్చాను. అలా చూడకు. తప్పుగా అనుకోకు"
"ఏమిటి?"
"వాణి వదిన మా నాన్నకు జాబు వ్రాసింది!..."
ఆశ్చర్యపోవడం శార్వరీ వంతు అయింది.
"ఎప్పుడు?"
"తొమ్మిది నెలల క్రింద!...."
"ఆఁ!..."
"అవును"
"ఏమని వ్రాసింది?..."
"పెండ్లి అయిన తర్వాత మనందరి క్షేమ సమాచారాలను తెలుసుకోవాలని మా నాన్నకు చాలాసార్లు ఫోన్ చేసిందట. కానీ ఆయన ఫోన్ ఎత్తలేదు. ఆ కారణంగా చాలా ఆవేదనతో ఉత్తరం వ్రాసింది."
"నీవు చెప్పింది నిజమేనా!..."
"ఎవరి విషయంలోనూ... ఎవరితోనూ నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను శార్వరీ!..." ప్రాధేయపూర్వకంగా చెప్పాడు సీతాపతి.
కొన్నిక్షణాలు అతని ముఖంలోకి చూచి నిట్టూర్చి...
"థాంక్యూ!..." ముందుకు వేగంగా నడిచింది శార్వరి.
జ్యోతి ఆమెను అనుసరించింది. ప్రవిణ్ సీతాపతిని సమీపించాడు.
"బావా!.... మా చెల్లెమ్మ మహా ఘాటు కదూ!..." నవ్వాడు ప్రవీణ్.
"ఆఁ..... ఆఁ.... ముందేం జరుగుతుందో చూద్దాం పద..." అన్నాడు సీతాపతి. ఇరువురు నడక ప్రారంభించారు.
====================================================================
ఇంకా వుంది..

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ