Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - 9
#49
"అనరు.... అనబోరు!... నా మాట నమ్మమ్మా!.." నవ్వింది దీప్తి.



"మరి ఉత్తరాన్ని ఏం చేయాలే... మీ నాన్నగారికి చూపిస్తావా!..." అమాయకంగా అడిగింది ప్రణవి.
"నా దగ్గర భద్రంగా వుంచుకొంటాను. నీవు భయపడకు మాతా!..." నాటకీయంగా చెప్పింది దీప్తి.
ముగ్గురూ ఆనందంగా నవ్వుకొన్నారు.
సీతాపతి స్నేహితుడు ప్రవీణ్... హితుడు వచ్చాడని చూచేదానికి వచ్చాడు. వరండాలో కూర్చొని వున్న సీతాపతి క్షణం తర్వాత లేచి స్నేహితుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు. ఇరువురూ కూర్చున్నారు.



"ఏరా! ప్రవీణ్.... ఏమిటి విశేషాలు?..." అడిగాడు సీతాపతి.
"ఎందుకురా నవ్వుతున్నావ్?"



"అడగదలుచుకొన్నదేదో సూటిగా అడగవచ్చు కదరా!"
"అడిగినట్లే అనుకొని చెప్పు"



"శార్వరి వచ్చింది" చిరునవ్వుతో చెప్పాడు ప్రవీణ్.
"నీతో మాట్లాడిందా!"
"ఆఁ..."
"నన్ను గురించి అడిగిందా!"
"ఏమిటీ!..."
"నీ చెవులకు ఏమన్నా ప్రాబ్లమారా!" విసుగ్గా అడిగాడు సీతాపతి.



"ఇంతవరకూ అలాంటిదేమీ లేదు."
"అయితే నా ప్రశ్నకు జవాబు!.."



మళ్ళా నవ్వాడు ప్రవీణ్.
"ఏందిరా!... వెకిలి నవ్వు!..."
"అక్కా.... అమ్మా ఇంట్లో లేరా!..."



"మామిడితోటకు వెళ్లారు..."
"ఎందుకు?..."
"అక్క చూడాలంది."
"అవున్లే... ఐదేళ్ళ తర్వాత వచ్చిందిగా!..."
"మరి... నా ప్రశ్నకు జవాబు!..."
"శార్వరీ!..."
"ఏదైనా కబురు పంపిందా!..."



"తమరికి అంత సీన్ లేదు బావా!..."
"ఓసారి చూడాలిరా... మీ ఇల్లు వారి పక్క ఇల్లేగా... పోదామా!" ఆత్రంగా అడిగాడు సీతాపతి.
"పద..."



"ఎక్కడికి!..."
"శివాలయానికి..."



"అక్కడికి ఎందుకురా!..."
"నీవు చూడాలనే వారిని చూచేటందుకు... వారు అటు వెళ్ళారు. నేను ఇటు వచ్చాను."



"వా...వా... నిజంగా నీవు నా ప్రాణ స్నేహితుడివిరా!..." సింహద్వారం వైపు చూచి "రంగమ్మా!... నేను శివాలయం దాకా వెళ్ళిస్తాను. అమ్మ వస్తే చెప్పు..." కాస్త హెచ్చుస్థాయిలో చెప్పాడు సీతాపతి.



పరుగున హాల్లోకి వచ్చిన రంగమ్మను చూచి... "నేను చెప్పింది వినపడిందా!" అన్నాడు సీతాపతి.
"పడిందండే!..." నవ్వుతూ చెప్పింది రంగమ్మ.



మిత్రులిద్దరూ వీధిలో ప్రవేశించారు.
"ఒరేయ్ సీతూ!... నేనో మాట అడుగుతా నిజం చెప్పాలి!..."



"అడుగు..."
"నీవు వూరికి వస్తున్నట్లు శార్వరికి ఫోన్ చేశావా!"



"లేదు... తనే నాకు చేసింది..."
"అంటే మీ మధ్యన...."



"సెల్ఫోన్ సంభాషణ సాగుతూ వుంది..."
"అంటే!..."



"శార్వరి నాకు కాబోయే భార్యరా!... నీకు చెల్లెలు కదా!..." నవ్వాడు సీతాపతి.
"ఈడుజోడు బాగుంది. వావివరసలూ బాగున్నాయ్!.... మరి రెండు కుటుంబాల మధ్యనా!!!"
"సంబంధ బాంధవ్యాలు లేవు... అదేగా నీవనాలనుకొన్నది!"



"శార్వరి ఎవరు?"
"మీ అత్తయ్య కూతురు"



"నేనెలా వున్నాను?"
"ఆఁ..."



"చెప్పరా!... నేను ఎలా వున్నాను?..."
"హీరోలా వున్నావు..."



నవ్వాడు సీతాపతి.
"ఒరేయ్!.... నిజం చెబుతున్నా!... శార్వరికి నేనంటే ఇష్టం... నాకు శార్వరి అంటే ఎంతో ఇష్టం..."
"మీ ఇద్దరి మధ్యన మీ నాన్న వున్నారుగా! విలన్!... ప్రస్తుతంలో నిప్పులో ఉప్పేసినట్లుగా వుంది కదరా మీ రెండు కుటుంబాల మధ్యన... మీ పెళ్ళికి మీ నాన్న ఒప్పుకుంటాడా!..."
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 8 - by k3vv3 - 03-01-2025, 09:29 AM



Users browsing this thread: 1 Guest(s)