Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - 9
#47
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 9



హరికృష్ణ కుటుంబంపై.. ద్వేషాన్ని పెంచుకొన్న ప్రజాపతి తల్లి రుక్మిణమ్మకు జరుపవలసిన రెండువారాల తర్వాతి కర్మ కార్యక్రమాన్ని తన ఇంట్లో జరిపితే హరికృష్ణ, శివరామకృష్ణలు వారి కుటుంబ సభ్యులు వస్తారని కార్యక్రమాలను కాశీలో జరుపాలని నిర్ణయించుకొన్నాడు. అదే ప్రకారం తన ప్రియురాలు నర్స్ నాగమణితో రెండురోజులు ముందుగా వారణాసికి చేరాడు.
వార్త విన్న హరికృష్ణ, లావణ్యలు ఆశ్చర్యపోయారు. పెద్దకర్మను కూడా గతించిన పండు ముత్తయిదువు రుక్మిణమ్మకు కొడుకు స్థానంలో నిలబడి, తన ఇల్లాలు లావణ్య ఇష్టానుసారంగా, హరికృష్ణ యధావిధిగా నిర్వహించాడు. సువర్ణదానం, గోదానం, భూదానం, వస్త్రదానం, నవధాన్యదానాదులను దంపతులు ఎంతో శ్రద్ధతో చేశారు.



ప్రణవి, దీప్తి, సీతాపతులు, హరికృష్ణ పిల్లలు కార్యక్రమాలను ఆశ్చర్యంతో తిలకించారు.
కాశీలో ప్రజాపతి జరిపించిన తంతు తనవారెవ్వరూ కారణంగా తన ఇంటికి రాకూడదని...
కానీ..హరికృష్ణ నిర్వహించిన కార్యక్రమం... మనసావాచా కర్మణా తన అత్తగారి ఆత్మకు శాంతి కలగాలని!....



మహా ఇల్లాలు... సుమంగళి రుక్మిణమ్మగారికి అల్లుడు... కొడుకు.. ఒకేసారి స్వస్థలంలో... కాశీలో ఖర్మకాండలను నిర్వహించారనే ఘనత తల్లికి దక్కింది.



జననమరణాలు జీవిత ధర్మం... సత్యం... పుట్టుట... గిట్టుట కొరకే కాల చక్రపరిభ్రమణంలో... ఆయా సమయాల్లో అవి జీవుల విషయంలో క్రమం తప్పకుండా జరిగిపోతుంటాయి. నూతన విజ్ఞానానికి అతీతం మానవ నిర్మాణం... దాన్ని ఆపే శక్తి ఇంకా నూతన విజ్ఞానానికి రాలేదు.
అప్పటికి రుక్మిణమ్మగారు గతించి ఆరుమాసాలు. గత ఆరుమాసాల్లో భార్యా వియోగంతో... కొరకరాని కొయ్యగా తయారైన కొడుకు ప్రజాపతి తత్వరీత్యా... ఎంతో మనోవ్యధకు లోనైనాడు కైలాసపతి.



ఆరుమాసాల కాలంలో ప్రజాపతి తండ్రితో మాట్లాడింది ఐదుసార్లుమాత్రమే!
అతను వూర్లో లేని రోజుల్లో కైలాసపతి కూతురు లావణ్య ఇంటికి వెళ్ళేవాడు. అక్కడ వున్న రెండు మూడు రోజులు హరికృష్ణ, లావణ్య, దివకర్, వాణి, ఈశ్వర్, శార్వరీల మధ్యన ఎంతో ఆనందంగా వుండేవాడు. కొడుకు రాబోతాడని తెలిసిన వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయేవాడు. అలా నడుచుకొనే దానికి కారణం... కైలాసపతి కొడుకు ప్రజాపతికి భయపడికాదు, అతని ముఖంచూచి మాట్లాడేదానికి ఇష్టంలేక.



కోడలు ప్రణవి మామగారిని ఎంతో అభిమానంతో చూచేది. మనవరాలు దీప్తి, మనవడు సీతాపతి చదువు రీత్యా చెన్నైలో వుంటున్న కారణంగా ఆవులు, గేదెలను చూచుకొంటూ గతాన్ని తలపోసుకొంటూ జీవితాన్ని భారంగా గడిపాడు కైలాసపతి.



వారంరోజులు రానని ప్రజాపతి ప్రణవికి చెప్పి చెన్నై వెళ్ళిపోయాడు. కైలాసపతి తన కూతురు ఇంటికి చేరాడు. ఐదురోజులు ఆనంద నిలయంలో అల్లుడు, కూతురు, మనమలు, మనవరాండ్ర మధ్యన ఎంతో ఆనందంగా గడిపాడు.



ఆరవరోజు సోమవారం మనుమలు, మనవరాండ్రతో శివాలయానికి వెళ్ళాడు. ఆలయం చుట్టూ ఆరు ప్రదక్షిణాలు చేశాడు. గర్భగుడిలో ప్రవేశించి... సర్వేశ్వరునికి సాష్టాంగ నమస్కారం చేస్తూ... తండ్రి!... కడతేర్చు!... కడతేర్చు! అన్నాడు. వారి శిరం దైవసన్నిధిలో నేలను త్రాకింది. ప్రక్కనే ప్రక్కనే వున్న పిల్లలు... అదేపని చేశారు. రెండు నిముషాల తర్వాత పిల్లలు పైకి లేచారు. తాతయ్యా!... అని పిలిచారు. తాత నుండి జవాబు లేదు. పరమజ్ఞాని... దయార్థహృదయుడు... బంధుప్రియుడు... కైలాసపతి గారి శకం ముగిసిపోయింది. వారి ఆత్మ వినువీధిలో తిరుగుతున్న రుక్మిణమ్మ ఆత్మను ఆనందంగా చేరింది.
పనిమనిషి రంగమ్మ... ప్రజాపతి ఆఫీస్ గదిని వూడ్చి క్రింద పడి వున్న ఇన్ల్యాండ్ లెటర్ను చేతికి తీసుకొని హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్న ప్రణవి, దీప్తి, సీతాపతిలను సమీపించి "అమ్మా! జాబు అయ్యగారు టేబుల్ కింద వుందమ్మా!" ప్రణవికి అందించింది.



ఫ్రమ్ అడ్రస్ చూచి అది వాణి వ్రాసిన వుత్తరం అని గ్రహించి...
చింపుదామా వద్దా అని కొన్నిక్షణాలు ఆలోచనలో మునిగిపోయింది.
" రోజుల్లో ఎవరమ్మా ఉత్తరాలు వ్రాస్తున్నారు తలచుకొంటే... సెల్లో మాట్లాడుతున్నారుగా!" అంది దీప్తి.



" వుత్తరాన్ని వ్రాసింది వాణి దీపూ!"



"అలాగా!"



"అవును..."



"ఏం వ్రాసి వుంటుంది?"



"చింపి చూస్తేగా తెలిసేది!"



"వుత్తరం మీ నాన్నగారి పేరున వచ్చింది. చింపనా వద్దా అని ఆలోచిస్తున్నాను"



"వుత్తరం వ్రాసిన వాణి ఆయనకు ఎంత ముఖ్యమో మనకూ అంతేగా!... యిలా యివ్వు నేను విప్పి చదువుతాను" అంది దీప్తి.



ప్రణవి వుత్తరాన్ని దీప్తికి అందించింది.
వుత్తరాన్ని విప్పి దీప్తి చదవసాగింది.



"పూజ్యులు... గౌరవనీయులైన మామగారికి మీ వాణి నమస్కారములతో వ్రాయునది.
మామయ్యా!.... నేను గడచిన మూడు సంవత్సరాలుగా ఎన్నోసార్లు ఫోన్ చేశాను. మీరు నా కాల్ను కట్ చేసేవారు! నాకు ఎంతో బాధగా అనిపించేది. ఒక్కసారి కూడా నాతో మాట్లాడేదానికి మీకు సమయం లేకపోయిందా!... లేక మీపట్ల... నేను.. ఏమైనా తప్పుచేశానా!... నాకు తెలిసినంత వరకూ నేను తప్పూ మీ విషయంలో చేయలేదు. మీరు నాకు ఎంతో సహాయం చేశారు. నేను కోరుకున్న వ్యక్తితో నా వివాహాన్ని జరిపించారు. మీరు నాకు చేసిన మేలును నేను ఎన్నటికీ మరువలేదు.. మరువబోను..



అత్తయ్యా, సీతాపతి ఎలా వున్నారు. బాగున్నారని తలుస్తున్నా!... మా అమ్మా నాన్న ఈశ్వర్, శార్వరీలు బాగున్నారా మామయ్యా!... నేను వారి విషయంలో తప్పుచేసిన దాన్ని. వారు నను క్షమిస్తారనే ఆశ నాకు లేదు. మీరంతా నావారైనందున మీతో ఇరవై నాలుగు సంవత్సరాలు కలిసి మీలో ఒకదానిలా వుండి.. మీ అందరి ఆదరాభిమానాలను చూచిన నేను ఎన్నటికీ ఎవరినీ మరిచిపోలేను.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 8 - by k3vv3 - 03-01-2025, 09:26 AM



Users browsing this thread: 2 Guest(s)