Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#32
"సర్..ఇంట్లో ఒక్కరే ఉన్నారా?" అడిగాడు డెలివరీ బాయ్
"అవును.."
"కొంచం మంచి నీళ్ళు ఇస్తారా సర్!.."



కిచెన్ లోకి వెళ్లి సుబ్బారావు గ్లాసు తో నీళ్ళు తెచ్చాడు. హాల్ లోకి వచ్చి చూస్తే.. డెలివరీ బాయ్ లేడు. మొత్తం అంతా చూసాడు. ఎక్కడా లేదు. 
ఇప్పటివరకు ఇక్కడే ఉన్న మనిషి సడన్ గా ఎక్కడకు వెళ్ళాడు? అని అనుకుంటుండగానే..భయానికి చెమటలు పట్టేసాయి సుబ్బారావు కు. సుబ్బారావు సోఫా మీద ఉన్న రిమోట్ పై అనుకోకుండా కూర్చున్నాడు...వెంటనే టీవీ ఆన్ అయ్యింది..



బ్రేకింగ్ న్యూస్...ఫుడ్ డెలివరీ బాయ్...వర్షం లో గల్లంతు..ఫుడ్ డెలివరీ కోసం వెళ్తుండగా ఘటన..అని అతని ఫోటో చూపించారు..



న్యూస్ చూసి సుబ్బారావు కు చెమటలు ఇంకా ఎక్కువ అయ్యాయి...చూపిస్తున్న వ్యక్తి గల్లంతైతే.. మరి ఇప్పటివరకు ఇక్కడ ఉన్నది ఎవరు...?అతనే ఇతను కదా! కొంపదీసి దెయ్యం అయి వచ్చాడా..? తలచుకుంటూ...గజ గజ వణికిపోయాడు సుబ్బారావు. ఇంక జన్మలో ఆన్లైన్ లో బిర్యానీ తెప్పించనని డిసైడ్ చేసుకుని.. టీవీ ని ఆపేసాడు.



ఈలోపు..సుబ్బారావు భార్య నుంచి ఫోన్ వచ్చింది..



"ఏమండీ! ఫుడ్ ఆర్డర్ వచ్చిందా? భోజనం చేసారా?" అని ప్రశ్నల వర్షం కురిపించింది 
"వచ్చింది...ఏదో చేసాను..."
"ఏం తిన్నారు...బిర్యానీ యే కదా ..!" అంది భార్య 
" మాట ఎత్తకు...నాకు ఒణుకు వస్తుంది..."
"మీకు ప్రతిదానికి భయమే...! ఇప్పుడు మా నాన్నకు బాగానే ఉంది. నేను రేపు ఉదయాన్నే వచ్చేస్తాను లెండి...కమ్మగా వండి పెడతాను.."



పెళ్ళాం మాటలతో కొంచం రిలీఫ్ వచ్చినా..మరో పక్క డెలివరీ బాయ్ విషయంలో.. భయం ఇంకా పోలేదు సుబ్బారావు కు..



టీవీ న్యూస్ లో...ఆన్లైన్ డెలివరీ బాయ్ తమ్ముడు.. తన అన్న డెలివరీ కోసం వెళ్లి చనిపోయాడని బాధపడుతున్నట్టు చూపిస్తున్నారు. "మేము ఇద్దరమూ ట్విన్స్..చూడడానికి ఒకేలాగ ఉంటాము. ఆన్లైన్ డెలివరీ చేస్తాము. నేను ఇప్పుడే ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత..ఫోన్ రావడంతో వెంటనే ఇక్కడకు వచ్చేసాను. రోజు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు మా అన్నయ్య..!" అని విలపిస్తున్నాడు..సుబ్బారావు కు బిర్యానీ డెలివరీ చేసిన బాయ్



విషయం తెలియక సుబ్బారావు..పాపం! రాత్రంతా భయపడుతూనే ఉన్నాడు..



*****
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - ఆఖరి ఆకలి - by k3vv3 - 02-01-2025, 03:10 PM



Users browsing this thread: 1 Guest(s)