Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - ఆన్‌లైన్ బిర్యానీ
#31
ఆన్లైన్ బిర్యానీ
రచనతాత మోహనకృష్ణ
 



సుబ్బారావు కి చిన్నప్పటినుంచి దెయ్యాలంటే చాలా భయం. భయం తనతోపాటు అలానే పెరుగుతూ వచ్చింది. అందుకే, హారర్ సినిమాలంటే, చాలా దూరంగా ఉంటాడు. అలాంటి మనిషికి పెళ్ళయింది. తలంటు పోసుకుని జుట్టు ఆరబెట్టుకుంటున్న తన పెళ్ళాన్ని దగ్గరగా చూస్తే.. రోజు సుబ్బారావు కు గుండె దడే..! ఇద్దరు పిల్లలతో జీవితం హ్యాపీ గానే సాగిపోతుంది.



ఒక రోజు తన భార్య పుట్టింటి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడి భర్త దగ్గరకు వచ్చింది పెళ్ళాం..



"ఏమండీ! మా నాన్నకి ఒంట్లో బాగోలేదంట. నా గురించి కలవరిస్తున్నారు. నేను ఇప్పుడే బయల్దేరతానండి..ఇలా వెళ్లి, నాన్నను చూసి..అలా వచ్చేస్తాను. ఒక్క రోజు అడ్జస్ట్ చేసుకోండి. పిల్లల్ని మీరు చూసుకోలేరు..నాతో తీసుకెళ్తాను. ఇలాంటి పరిస్థితిలో 'నో' అని అనలేడు సుబ్బారావు. పెళ్ళయిన దగ్గర నుంచి ఎప్పుడూ పెళ్ళాన్ని విడచి ఒంటరిగా ఉన్నది లేదు.



మా ఆవిడ ఊరు ఉదయం వెళ్లి.. సాయంత్రానికి వస్తే బాగుండేది. ఇలా సాయంత్రం బయల్దేరితే..రాత్రంతా నేను ఒక్కడినే ఇంట్లో ఉండాలా..? తలుచుకుంటేనే చాలా భయం వేస్తోంది. అసలే మొన్న దెయ్యం కనిపించిందని రామారావు వీధిలో అందరికీ చెప్పాడు. పైగా, పండుగ టైం లో దొంగతనాలు ఎక్కువనీ... రాత్రి పూట జాగ్రతగా ఉండమని సెక్యూరిటీ ఆఫీసర్ల హెచ్చరిక ఉండనే ఉంది.



ఇదంతా మరచిపోయి..కాసేపు టీవీ చూద్దాం అనుకున్నాడు సుబ్బారావు. అదే టైం లో, టీవీ లో క్రైమ్ ప్రోగ్రాం వస్తోంది. అందులో..ఇంట్లో ఒక్కడే ఉన్న ఇంటి ఓనర్ పై దొంగలు దాడి చేసి..హత్య చేసి ఇల్లంతా దోచుకున్నారని చూపిస్తున్నారు. 'ఇదేదో నన్ను ఇబ్బంది పెట్టడానికే చెబుతునట్టు ఉంది' అని భయమేసి ఛానల్ మార్చేశాడు సుబ్బారావు. మరొక ఛానల్ లో..చనిపోయిన మనిషి దెయ్యంగా ఇంటికి వచ్చి తలుపు కొట్టాడని చూపిస్తున్నారు...అంతే..! భయమేసి టీవీ ఆపేసాడు.



నా పెళ్ళాం అర్జెంటు గా వెళ్లిపోయింది. వంట కుడా ఏమీ చెయ్యలేదు. వెళ్తూ..తన పెళ్ళాం ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకోమని చెప్పినట్టు గుర్తు వచ్చింది. ఏం చేస్తాం...? ఆకలి ఆగదు కదా..! అనుకున్నాడు సుబ్బారావు. ఫోన్ తీసి..ఆన్లైన్ యాప్ లో తనకి ఇష్టమైన బిర్యానీ ఆర్డర్ చేసాడు. అది కుడా ఫేమస్ హోటల్ నుంచి.. హోటల్ చాలా దూరంగా ఉండడం చేత, డెలివరీ టైం ఒక గంటకు పైగానే చూపించింది.



లోపు అలా వరండా లోకి వెళ్లి చూసాడు. చల్లటి గాలి వేస్తోంది. గాలికి కదులుతున్న కొబ్బరి ఆకుల నీడ గోడ పై పడి..ముందుకు వెనక్కు కదులుతుంది. అసలే భయానికి కేర్ అఫ్ అడ్రస్ అయిన మన సుబ్బారావు...దానిని చూసి భయపడి వెంటనే తలుపు వేసేసాడు. సోఫా లో కూర్చొని..ఫుడ్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నాడు.



లోపు మెల్లగా వాన మొదలైంది. చిన్న చినుకు గా మొదలైనది కాస్త పెద్దది అయ్యింది. అలా వాన లో సిటీ అంతా తడిసి ముద్దవుతున్నాది. ఈలోపు న్యూస్ కోసం టీవీ పెట్టాడు సుబ్బారావు. బ్రేకింగ్ న్యూస్ లో సిటీ అంతా జలమయం..ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరిక చేసారని న్యూస్. ఆకలి వేస్తున్న సుబ్బారావు, నా బిర్యానీ ఎప్పుడు వస్తుందో అని తన యాప్ ఓపెన్ చేసి.. ట్రాకింగ్ చూసాడు. 'హమ్మయ్యా! నా ఆర్డర్ క్యాన్సిల్ చెయ్యలేదు...దారిలో ఉంది..'..



ఇలా అనుకున్నాడో లేదో... కరెంటు కాస్తా పోయింది. ఒకేసారి ఇల్లంతా చీకటిమయం. ఫోన్ లో టార్చ్ వెయ్యడానికి కుస్తీ పడ్డాడు. మొత్తానికి వెలిగింది.. అంతా నిశ్శబ్దంగా ఉంది. సడన్ గా కిచెన్ లో ఏదో చప్పుడు.. సుబ్బారావు గుండె జారింది..దొంగా? అని కంగారు పడుతూ..మెల్లగా వెళ్లి చూసాడు. పెరటి తలుపు తీసి ఉంది..మొదట్లో దొంగ అని భయపడ్డాడు..తర్వాత 'మియావ్' అని వినిపించడం తో...ఊపిరి పీల్చుకున్నాడు సుబ్బారావు.



చాలాసేపు తర్వాత..కరెంటు వచ్చింది. అప్పుడే.. కాలింగ్ బెల్ మోగింది. బిర్యానీ వచ్చిందేమోనని ఆనందంలో తలుపు తీసాడు. ఎదురుగా ఒక మనిషి ఫుడ్ పార్సెల్ పట్టుకుని పూర్తిగా తడిసిపోయి ఉన్నాడు.



"సర్! పూర్తిగా తడిసిపోయాను..ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి ఇంకా వర్షం తగ్గలేదు. నాకు ఆకలి వేస్తోంది. నేను మీతో పాటు డిన్నర్ ఇక్కడే చేయవచ్చా?" అడిగాడు వచ్చిన డెలివరీ బాయ్



"ఒంటరిగా ఉండలేక...తోడు దొరికిందన్న ఆనందంలో...లోపలికి రమ్మన్నాడు సుబ్బారావు"



లోపలికి వచ్చిన తర్వాత ఇద్దరు డిన్నర్ చేస్తున్నారు..డెలివరీ బాయ్ తన ఇంట్లోంచి తెచ్చుకున్న బాక్స్ ఓపెన్ చేసి తినడం మొదలుపెట్టాడు.. సుబ్బారావు పార్సెల్ లో బిర్యానీ తింటున్నాడు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - ఆఖరి ఆకలి - by k3vv3 - 02-01-2025, 03:06 PM



Users browsing this thread: 3 Guest(s)