Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - శిఖండి
#35
అయితే ఒకరి జ్ఞానం మహికి కీడు చేస్తే, మరొకరి జ్ఞానం మహికి మేలు చేసింది. మహికి మేలు చేసే జ్ఞానమే మంచి జ్ఞానం. నువ్వు ఇప్పుడు మహా మంచిదైన విష్ణు జ్ఞానం వైపు పయనిస్తున్నావు. నీలో సురకళ దినదినాభివృద్ధి చెందుగాక!" అని ప్రభను ఆశీర్వదించారు. 



 సనకసనందాదుల ఆశీర్వాదాలను ప్రభ కడు వినయంగా స్వీకరించింది. 
 ప్రభ తన భర్త ఆయు మహారాజు దగ్గర ఉన్నప్పుడు ఒక్కొక్కసారి "ఖగోళ విజ్ఞాన విషయంలో నేనే గొప్ప "అని అనుకునేది. అప్పుడు ప్రభను కొంచెం రజో గుణం ఆవరించేది. రజో గుణమే ఆమెలో కొంచెం అహంను పెంచేది. అప్పుడు ప్రభ భర్త ఆయు మహారాజు చెప్పే శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్రను విని తనలోని రజో గుణాన్ని, అహాన్ని తొలగించుకునేది. 



 రాక్షస గుణం గల తన తండ్రి స్వర్భానుని ప్రభావం వలనే తనను అప్పుడప్పుడు రజో గుణం తనని ఆవరిస్తుందన్న సత్యాన్ని ప్రభ గమనించింది. అందుకే ఆమె ముఖ్యమైన విషయాన్ని గురించి ఆలోచించే టప్పుడైన భర్త ఆయు మహారాజు అభిప్రాయ దిశగానే సంచరించేది. 



 ఆయు మహారాజు తన ధర్మపత్ని ప్రభ తన అభి ప్రాయాలనే గౌరవిస్తుందని తెలిసినప్పటికీ ప్రతి విషయాన్ని ధర్మపత్ని ప్రభతో చర్చించేవాడు. ధర్మపత్ని ప్రభ అభిప్రాయాలకు కూడా విలువ ఇచ్చేవాడు. 



 ఆయు మహారాజు సోదరులు అమావసు, ధిమన, విశ్వాయు, ధృదాయు, శృతాయులు తన వదినగారు ప్రభలో లేశ మాత్రంగా ఉన్న రజో గుణాన్ని గ్రహించారు. 



రజో గుణం తో ముందుకు కదలాలనుకున్న తమని తమ వదిన ప్రభ సమర్థిస్తుందనుకున్నారు. 



 అమావసాదులు ముని వనంలో కాలం చేసిన తన తండ్రి పురూరవుని మరణానికి మునులే కారణం గా భావించారు. ముని సంహారానికి సిద్దమయ్యారు. విషయాన్ని ప్రభ కు చెప్పారు. 



అప్పుడు ప్రభ పద్మా సనం మీద ఆసీనురాలయ్యింది. తన భర్త ఆయు మహా రాజు ను తనువు మీదకు తెచ్చుకుంది. అంత "మీ తండ్రిగారు నా మామగారు అయిన పురూరవుల వారి మరణానికి కొంతమంది మునులు కారణం అని మీరు అనుకుంటున్నారు. నిజానికి పురూరవులవారి మరణానికి మునులు కారణం కాదు. మీ తండ్రి గారు మునివాడన కాలం చేయడం వలన కొందరు అలా అనుకుంటు న్నారు. 



 మీ తండ్రిగారు కొంత బ్రాహ్మణ ధనాన్ని మునివాడ లోని భూగృహంలో దాచి పెట్టారని కూడా కొందరు అను కుంటారు. ధనాన్ని తీసుకురావడానికి మీ తండ్రి గారు మునివాడకు వెళ్ళారని, అక్కడ మీ తండ్రిగారి దగ్గర ఉన్న ధనాన్ని అపహరించడానికి మునులు మీ తండ్రిగారిని కిరాతకంగా క్షుద్ర విద్య లతో చంపారని మరి కొందరు అంటారు. 



నిజానికి అదంతా అబద్దం. మీ తండ్రిగారు వయసు మళ్ళిన పిదప మునివాడన కాలం గడపాలనుకున్నారు. అలా మునివాడకు వెళ్ళారు. అక్కడ అనారోగ్యం తో కాలం చేసారు. అంతే. " అని ప్రభ తన మరుదులకు నచ్చ చెప్పింది. 



 ప్రభ మాటలను విన్న అమావసాదులు మునివాడ లో ఉన్న మునులను చంపాలన్న ఆలోచనకు స్వస్తి పలికారు. ముని సంహారానికి తన సోదరులు వెళుతున్నారని తెలిసిన ఆయు మహారాజు తన సోదరులకు అవసరమైతే కత్తితో బుద్ది చెప్పాలని అమవసాదుల దగ్గరకు వచ్చాడు.
 
 ఆయు మహారాజు తన ధర్మపత్ని ప్రభ వలన తన సోదరులు మారిన విధానం కళ్ళార చూసి సోదరులను దగ్గరకు తీసుకున్నాడు. ధర్మపత్ని ని మనసారా అభినందించాడు. 



 ప్రభ ఆయు మహారాజులకు శ్రీ దత్తాత్రేయ స్వామి కరుణాకటాక్షాల వలన ఒక కుమారుడు కలిగాడు. పుణ్య దంపతులు తమ కుమారునికి నహుషుడు అని పేరు పెట్టారు. వారు నహుషుని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసారు. ప్రభ ఆయు మహారాజు కు నహుషునితో పాటు వృద్దరావు, గయుడు, అనేనుడు అనే పేర్లు గల పుత్రు లు కూడా కలిగారు. 



 ప్రభ భర్త సహాయసహకారాలతో దేవతలందరిని ప్రసన్నం చేసుకుంది. తన తపో శక్తిని, ఖగోళ విజ్ఞాన శక్తి ని ప్రజలకు ధారపోసింది. తను పొందాలనుకున్న అమరత్వం పొందింది. 



[font=var(--ricos-font-family,unset)]  [/font] శుభం భూయాత్ 
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - కౌసల్య - by k3vv3 - 29-12-2024, 06:42 PM



Users browsing this thread: