Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#34
శ్రీ దత్తాత్రేయ స్వామి "ఆయు మహారాజ! నీకు త్వరలో వివాహం అవుతుంది. నీ ధర్మ పత్ని ఖగోళ శాస్త్ర నైపుణ్య సామర్థ్యంతో లోకానికి కాంతిని ఇస్తుంది. నీ వంశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెడుతుంది. శ్రీదత్తాత్రేయ వరప్రసాది గా నీ కుమారుడు కీర్తిప్రతిష్టలు పొందుతాడు. " అని ఆయు మహారాజును శ్రీ దత్తాత్రేయ స్వామి ఆశీర్వదించాడు. 



 స్వర్భానుని కుమార్తె ప్రభ. తండ్రి దగ్గర సమస్త విద్యలను అభ్యసించింది. అమరత్వం కోసం ఖగోళ మండలంలో తపస్సు చేసింది. ఖగోళం లోని సప్త మహర్షులు, తదితర నక్షత్ర గణ దేవతలు, మహర్షులు, బ్రహ్మర్షులు, నరయక్షనాగ కిన్నెరాదుల తేజస్సులన్నిటిని ప్రభ చూసింది. ఆయా దివ్య తేజస్సుల మాటు ఉన్న అమర తేజస్సు ను చూడటానికి ప్రభ ప్రయత్నించింది. ఖగోళ తపో పీఠం పై ప్రకాశించే ప్రభను, ఆమె పట్టుదలను చూచి ఖగోళ వాసులందరూ వేనోళ్ళ ప్రశంసించారు. 



 ప్రభ తనువు మహా తేజంతో వెలిగిపోసాగింది. అయితే తేజస్సు లో ప్రభకు అమరత్వ తేజం ఆవంత కూడా కనపడలేదు. తన తపో దీక్షలోని లోపాలు ఏమిటి? అని ప్రభ ఆలోచించింది. 
 ఆపై ప్రభ ఖగోళ పీఠం మొత్తాన్ని ఒకసారి పరిశీలించింది. అక్కడి విజ్ఞాన తేజాన్ని ఔపాసన పట్టింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నపుడు వచ్చే శబ్ద స్వరూపమే " ఓంకారం" అని గ్రహించింది. ఖగోళం లోని మహా తేజస్సుకు మనసార నమస్కరించింది. అటు పిమ్మట భూమి మీద తపస్సు చేయాలనుకుంది. ప్రతి ష్టాన పుర సమీపంలో ఉన్న తపో వనంలో తపస్సు చేయసాగింది. 



 ఒకనాడు ప్రభ తపస్సు చేసే ప్రాంతానికి వశిష్ట మహర్షి వచ్చాడు. తపస్సులో ఉన్న ప్రభను చూసాడు. తన దివ్య దృష్టితో వశిష్ట మహర్షి ప్రభ వృత్తాంతం మొత్తం తెలుసుకున్నాడు. 



 కొంత సమయం అనంతరం వశిష్ట మహర్షి ని చూసిన ప్రభ మహర్షికి సాష్టాంగ పడి నమస్కారం చేసింది. వశిష్ట మహర్షి ప్రభను ఆశీర్వదించాడు.



అంత " మ్మా ప్రభ, విప్రచిట్టి సింహికల కుమారుడైన నీ తండ్రి స్వర్భానుడు అమరత్వం కోసం తహతహలాడిన ఘనుడు. అయితే నీ తండ్రి స్వర్భానుడు అమరత్వం కోసం కనికరం లేని అన్వేషణ అధికంగా చేసాడు. తనకు తపో ఫలితం త్వరగా రావాలని సూర్యచంద్రులనే మింగాలని చూసాడు. కరుణ లేని అన్వేషణ కసాయి అన్వేషణ. అందుకే నీ తండ్రి స్వర్భానుడు ఇంతవరకు అనుకున్నది సాధించలేక పోయాడు. 
నువ్వు కూడా అమరత్వం కోసం ప్రయత్నం చేస్తున్నావు. మంచిది. అయితే నువ్వు నీ తండ్రిలా కాకుండా మంచి మార్గాన అమరత్వం కోసం ప్రయత్నించు. 



 ఊర్వశీ పురూరవుల పుత్రుడు ఆయు మహారాజు. తన తపోశక్తి తో శ్రీ దత్తాత్రేయ స్వామి ని ప్రసన్నం చేసకున్నాడు. శ్రీదత్త కరుణాకటాక్ష వీక్షణల నడుమ రాజ్యాన్ని బాగా పరిపాలిస్తున్నాడు. ఆయు మహారాజు కు ఇంకా వివాహం కాలేదు. అతనికి తగిన వధువువు నువ్వే అని నాకనిపిస్తుంది. 
 పుణ్య పురుషుడైన ఆయు మహారాజును నువ్వు వివాహం చేసుకుంటే నువ్వనుకున్న మార్గం సులభంగా సాధించే అవకాశం కూడా నిన్ను వరిస్తుంది " అని వశిష్ఠ మహర్షి ప్రభతో అన్నాడు. 



 వశిష్ట మహర్షి మాటలను విన్న ప్రభ వశిష్ట మహ ర్షినే పెద్దరికం వహించి తనను ఆయు మహారాజుకు ఇచ్చి వివాహం చేయమంది. ప్రభ మాటలను విన్న వశిష్ట మహర్షి స్వర్భానుడు తోనూ ఊర్వశీపురూరవుల తోనూ ఆయు మహారాజు తోనూ మాట్లాడాడు. అందరూ వశిష్ట మహర్షి ఆలోచనను సమర్థించారు. 



 ప్రభ ఆయు మహారాజు వివాహం సురనర కిన్నెర యక్షరాక్షసాదుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. 
 ప్రభ తన భర్త ఆయు మహారాజు పద్దతులను అనుసరించి శ్రీ దత్తాత్రేయ స్వామిని సేవించసాగింది. 



శ్రీ దత్తాత్రేయ స్వామి సేవలో మైమరచిపోయింది. అలాగే తనకు తెలిసిన ఖగోళ విజ్ఞానం ను అభివృద్ధి చేయ సాగింది. 
 ఒకనాడు కాలనేమి అనువాడు తనకు పాలపుంతను కళ్ళార దగ్గర గా ఉండి చూడాలని ఉంది అని ఆయు మహారాజు తో అన్నాడు. ఆయు మహారాజు కాలనేమిని ప్రభకు పరిచయం చేసాడు. కాలనేమి మనసులోని కోరికను ఆయు మహారాజు తన ధర్మపత్ని ప్రభకు చెప్పాడు. అప్పుడు ప్రభ భర్త విన్నపమును అనుసరించి తన ఖగోళ శాస్త్ర విజ్ఞానం తో కాలనేమిని పాలపుంతకు పంపింది. 



కాలనేమి పాలపుంతను కళ్ళార చూసాడు. పాలపుంతలో ముదము మీర నడిచాడు. ప్రభ ఖగోళ విజ్ఞాన ప్రభను కళ్ళార చూసిన ఆయు మహా రాజు ఆమెను పలు విధాలుగా ప్రశంసించాడు. ప్రభ విజ్ఞానాభివృద్దికి కావలసిన ఏర్పాట్లన్నీ తానే దగ్గర ఉండి చేయించాడు. 



 తన విజ్ఞానం ను ప్రజలకు ఉపయోగపడేటట్లు చూడమని ఆయు మహారాజు ప్రభకు చెప్పాడు. ప్రభ అలాగేనని తన ఖగోళ శాస్త్ర విజ్ఞానం తో ఆయు మహా రాజు రాజ్యంలోని ప్రజలందరూ అతివృష్టితో అనావృష్టి తో ఇబ్బంది పడకుండా చేసింది. సకాలం లో వర్షాలు పడేరీతిలో యజ్ఞ యాగాదుల ద్వారా ఖగోళ సామర్థ్యాన్ని పెంచింది. 



 ప్రభ తన ఖగోళ శాస్త్ర విజ్ఞానం ను పదుగురికి ఉపయోగపడేటట్లు చేస్తూనే భర్త సహకారం తో దేవత లందరిని ప్రసన్నం చేసుకోవడానికి వివిధ రకాల పద్దతులలో యజ్ఞయాగాదులను చేయసాగింది. భర్త చెప్పిన ట్టుగా తమో రహిత, రజో రహిత తపమును ఆచరించింది. 



 ప్రభ తపస్సు కు మెచ్చిన సనకసనందాదులు ప్రభ ముందు ప్రత్యక్షమయ్యారు. నిత్య బాలురైన సన కసనందాదులను చూచిన ప్రభ వారిని భక్తితో సనకస నందాదుల దండకంతో స్తుతించింది. 






 సనకసనందాదులు ప్రభకు అనేక ఖగోళ రహస్యాలను చెబుతూ, "ప్రభ, భక్తితో కూడిన మహా విజ్ఞానం మనిషి మేథస్సు ను అమృత తుల్యం చేస్తుంది. మనిషిని మనీషిగ మలుస్తుంది. భక్తిలేని మహా విజ్ఞానం జగతికి పలు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. భూమిని భూ కక్ష్య నుండి తప్పించిన హిరణ్యాక్షుడు మహా విజ్ఞానే.. పాతాళం పాలైన భూమిని మరలా తన కక్ష్యలో ప్రవేశపెట్టిన వరాహ మూర్తి శ్రీమహావిష్ణువు మహా విజ్ఞానే. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - కౌసల్య - by k3vv3 - 29-12-2024, 06:40 PM



Users browsing this thread: 1 Guest(s)