Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - 9
#40
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 8



మరుదినం కూడా ప్రజాపతి రానందున కార్యక్రమాలను హరికృష్ణనే పూర్తిచేశాడు. కోడలు ప్రణవి, కూతురు లావణ్య, అల్లుడైన హరికృష్ణలు, కైలాసపతి ప్రక్కనే వుండి వారిని ఓదార్చారు. సపర్యలు చేశారు. మూడవరోజు ఉదయం.. పదిన్నరకు ప్రజాపతి ఇంటికి చేరాడు. మార్గమధ్యంలోనే మాధవయ్య విషయాన్ని ప్రజాపతికి తెలియజేశాడు.



తాను లేని సమయంలో తల్లి గతించిందే అనే బాధ కన్నా.... హరికృష్ణ తన స్థానంలో వుండి అన్ని విధులు సక్రమంగా నెరవేర్చాడనే మాట.  ప్రజాపతికి ఎంతో బాధను కలిగించింది. కారణంగా హరికృష్ణ తన వారందరి దృష్టిలో... వూరి వారందరి హృదయాల్లో మంచిపేరును సంపాదించుకొన్నాడనే వ్యక్తిగత ద్వేషం... ప్రజాపతి హృదయాన నిండిపోయింది.



తండ్రి ప్రక్కన కూర్చొని వున్న లావణ్య... ప్రజాపతిని చూచి... లేచి దగ్గరకు వచ్చి అతని చేతులు పట్టుకొని....
"అన్నయ్యా!... అమ్మ... వెళ్ళిపోయింది" భోరున ఏడ్చింది.



కన్నీటితో ప్రణవి భర్త ముఖంలోకి క్షణంసేపు చూచి... చూపులలో వున్న నిర్లక్ష్య భావాన్ని గ్రహించి తలను ప్రక్కకు త్రిప్పుకొంది.



"ఆఁ... విన్నాను!" మెల్లగా చెప్పాడు ప్రజాపతి.



"ఎక్కడికి వెళ్ళావు అన్నయ్యా!..." అడిగింది లావణ్య.



లావణ్య... యీ ప్రశ్నకు ప్రజాపతి చూపుల్లో తీవ్రత... ముఖంలో ఆవేశం... మౌనంగా వుండిపోయాడు.
"వదిన అడిగిన మాట మీకు వినిపించలేదా అండీ!" సౌమ్యంగా అడిగింది ప్రణవి.



ఆమెవైపు తీక్షణంగా చూచాడు ప్రజాపతి.
అంతవరకూ వారి మధ్యన జరిగిన సంభాషణను హరికృష్ణ, కైలాసపతులు వింటున్నారు.
"బావా!... ఎక్కడికి వెళ్ళావు?" అడిగాడు హరికృష్ణ మెల్లగా.



" విషయం నీకు అనవసరం... పని ముగిసిందిగా యింకా ఇక్కడ ఎందుకు వున్నారు మీ ఇంటికి పోకుండా!..." ఆవేశంగా ముఖం చిట్లించి అన్నాడు ప్రజాపతి.



హరికృష్ణ... బదులు పలుకలేకపోయాడు. భార్య లావణ్య ముఖంలోకి దీనంగా చూచాడు.
"ఏమిట్రా నీవు అన్నది....!" లేచి నిలబడి అడిగాడు కైలాసపతి ఆశ్చర్యంతో.



"నాన్నా!.... మీరు కూర్చోండి. వూరుకోండి. అన్నయ్య ప్రయాణ బడలికతో వున్నట్లున్నాడు.
రెండవది పోయింది మా అమ్మ కదా నాన్నా!... బాధా మనస్సున వుంటుందిగా!... ఇకపోతే మేము ఇక్కడ ఎందుకు వున్నామని అడిగాడు... ఏదో ఆవేశంలో ఒకటి అనబోయి మరో రీతిగా అన్నాడేమో!... అన్నయ్యా!... నీవు గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకో!... ప్రణవీ!... అన్నయ్యకు ఏం కావాలో చూడు. అతని వెంట వెళ్ళు!..." సౌమ్యంగా చెప్పింది లావణ్య.



"ఏమిటే... ఏదో మేము నీ ఇంట్లో వున్నట్లు మమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నావ్!..." అన్నాడు ప్రజాపతి.



"ఇది నీ ఇల్లే కాదు అన్నయ్యా!.... నా ఇల్లు కూడా!..."



"ఇది నీ ఇల్లు ఎలా అవుతుందే!..." వ్యంగ్యంగా అన్నాడు ప్రజాపతి.



"ఏమండీ!... ఏమిటండి మీ మాటలు!... మీరా వూర్లో లేరు. అన్నయ్య, వదినలు మాకోసం ఎంత కష్టపడ్డారో మీరు వూహించలేరు. వదిన చెప్పింది మీ మంచికి. అర్థం చేసుకోకుండా అసహ్యించుకోవడం.. న్యాయం కాదు!..." అనునయంగా చెప్పింది ప్రణవి.



వారి మధ్యన జరుగుతున్న సంభాషణనను... విరక్తితో కైలాసపతి... తాను నోరు విప్పితే... ప్రజాపతి నోరు ఎలా పారేసుకొంటాడో అనే సందేహంతో హరికృష్ణ మౌనంగా వుండిపోయారు.
"ఏమిటే నీవన్నది!... యదార్థం మాట్లాడటం న్యాయం కాదా!..."



"మీరు మాట్లాడేది యదార్థం కాదు..." కసిగా అంది ప్రణవి.



"ప్రణవీ!... నీవు వూరుకో! ఆవేశపడకు!" మెల్లగా చెప్పింది లావణ్య.



ప్రజాపతివైపుకు తిరిగి "అన్నయ్యా! తల్లి పోయిందనే బాధ నీకూ వుండడం సహజం. నీవు వూర్లోలేని కారణంగా... నీవు చేయవలసిన విధులను మావారు నీ స్థానంలో నిలబడి చేశారు. వారు పనిని చేసింది ఎవరిమెప్పునో ఆశించి కాదు. ఇంతమంది వుండి... ఎవడో కూలివాడి చేత ఖర్మకాండలు జరిపించడం మనందరికీ అవమానకరమౌతుందని... అమ్మమీద వారికి వున్న గౌరవాభిమానాల కారణంగా ఎంతో శ్రద్ధతో వారు కార్యాన్ని నిర్వహించారు. అమ్మను వారు తన తల్లిగా భావించారు. మా ఆలోచనలో ఎలాంటి కుట్ర లేదు. అమ్మ మీద అభిమానం... వెళ్ళిపోయిందనే బాధ తప్ప!... అర్థం అయిందా!... యిందాక తొలి పలుకుగా ఏమన్నావ్!... వచ్చిన పని అయిపోయిందిగా ఇంకా ఎందుకున్నారు!.... మీ ఇంటికి వెళ్ళిపోకుండా! అనే కదూ నీవు అన్నది!... నాన్నా!... నీ కొడుకు వచ్చాడు... ఇక మేము ఇక్కడ వుండవలసిన అవసరం మాకు లేదు." హరికృష్ణవైపు చూచి..."ఏమండీ!... ఇక మన ఇంటికి బయలుదేరండి" ఎంతో ఆవేశంతో చెప్పింది లావణ్య.



"అమ్మా!..... అమ్మా!... ఏమిటమ్మా నీవు మాట్లాడుతున్నావు?..." ఆవేదనతో చెప్పాడూ కైలాసపతి. 



"నాన్నా!... నేను ఏమీ తప్పుగా మాట్లాడలేదు నాన్నా!.... మీరు నేర్పిన మాటలే... మనిషికైనా... సాటివారి ముందు అవమానం జరిగితే వాదనకు దిగకుండా ప్రశాంతంగా అక్కడి నుండి వెళ్ళిపోవడం ఇరువురికీ మంచిదని... నేను ఇప్పుడు చేయబోతున్న పని అదే నాన్నా!...." ఎంతో సౌమ్యంగా మెల్లగా చెప్పింది లావణ్య.



హరికృష్ణ... "మామయ్యా!" వెళుతున్నట్లు తలాడించాడు.



"వదినా!.... అన్నయ్యా!... మీరు వారి మాటలను పట్టించుకోకండి.... వారి తత్వం ఇక్కడ వున్న అందరికీ తెలిసిందేగా!... మీరు ఇలా వెళ్ళిపోతే.... మామగారు మరీ బాధపడతారు వెళ్ళకండి!..." లావణ్యను సమీపించి ప్రణవి కన్నీటితో చెప్పింది.
"వదినా!.... వూరుకో... నా మాట విను" చిరునవ్వుతో చెప్పింది లావణ్య. నవ్వులో ఆనందం లేదు ఎంతో వేదన.
మేడమెట్లు ఎక్కుతూ ప్రజాపతి... "ప్రణవీ!... పైకిరా!..." తన గదిలోకి వెళ్ళిపోయాడు.
"పిలిచాడు... వెళ్ళు!" అంది లావణ్య.
కన్నీటితో ప్రణవి మిద్దె మెట్లు ఎక్కింది.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 6 - by k3vv3 - 24-12-2024, 05:29 PM



Users browsing this thread: 1 Guest(s)