Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#31
మహర్షుల మాటలను విన్న కౌసల్య" మహర్షులారా! మీ మాటలు సమంజసంగా లేవు. మీ మాటలు, మీ ఆలోచనలు నిజం కాదు. శూద్ర తపం వలన వర్షాలు పడవనడం మీ తపోజ్ఞాన అవివేకం. నేను కులమత వర్గ విచక్షణారహితంగా మీ మీ కృశించిన శరీర సామర్థ్యాలను పెంచాను. మీరు పెరిగిన మీ శరీర సామర్థ్యాలను చూసుకుని అహంకారం ప్రదర్శిస్తున్నారు.. అహంకారంతోనే మీరు మనసు తప్పి, వచస్సు తప్పి, యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్నారు. 



దానివలన వాతావరణ కాలుష్యం పెరిగిపోయింది. దానితో సంవత్సరం నుండి సకాలంలో వర్షాలు పడటం లేదు. శూద్రుని తపస్సు వలననే ఇంకా ప్రకృతి లో పచ్చదనం తగ్గలేదు. కొంత కాలం పాటు మీరంతా యజ్ఞ యాగాదులను ఆపివేయండి. " అని మహర్షు లతో అంది. 



 పూరు మహారాజు కౌసల్య చెప్పినట్లు చెయ్యమని మహర్షులను ఆదేశించాడు. కౌసల్య తపో శక్తి గల వెయ్యి మంది శూద్రులతో యజ్ఞ యాగాదులను చేయించింది. వెంటనే వర్షాలు పడినవి. అంతకు ముందు ఎన్నడూ పండని రీతిలో పంటలు పది సంవత్సరాలకు సరిపడ పండాయి. మహర్షులు తమ తప్పులను తెలుసుకుని శూద్ర తపశ్శీలుర దగ్గర శిష్యరికం చేసారు. 



 "మహర్షులారా! కదిలే కాల తీరులో మానవ సంచారం గమనించి మాట్లాడండి. కాలం కులమత వర్గాలకు అతీతంగా సాగిపోతుంది. ఇప్పటివరకు వేద మంత్రాలను చెప్పినవారిలో, రాజ్యాలను పరిపాలించిన వారిలో, సర్వ కులాలవారూ ఉన్నారు. ఇది గమనించకుండా మీరు చెప్పే మాటలు కాల గమనం ముందు నిలబడవు. అది గుర్తు ఉంచుకోండి" అని మహర్షులతో కౌసల్య అంది. 



 పూరుడు తన భార్య కౌసల్య తో అనేక యజ్ఞయాగ శాలలను సందర్శించాడు. అక్కడి మునులందరిని కౌసల్య పూరులు తగిన విధంగా సత్కరించారు. 



 కౌసల్య పూరులు యాగవనం ను సందర్శిస్తున్నప్పు వారికి అక్కడ మాధవి కనపడింది. యోగిని అయిన సోదరి మాధవిని పూరుడు తగిన విధంగా సత్కరించాడు. మాధవి అభ్యర్థనను అనుసరించి కౌసల్య మునులతో యజ్ఞం చేయించి, మాధవి తనువును జింక తనువుగా మలచింది. 



మాధవి మునులకు, కౌసల్య పూరులకు నమస్కరించి జింక తనువుతో వనంలోకి వెళ్ళిపోయిం ది. కౌసల్యపూరుల సంతానం జనమేజయుడు, ఈశ్వరుడు, రౌద్రశ్వుడు మొదలైనవారు. 
 పూరుడు కౌసల్య చెప్పినట్లు ఇంద్ర దైవత యాగాదులను చేసి ఒకరోజు లో ప్రపంచం మొత్తాన్ని జయించాడు. తన రాజ్యంలోని వారందరికి గోదానం చేసాడు. 



 కౌసల్య రాజ్యంలోని వారందరి చేత గోపూజ చేయించింది. ఇంద్రపూజ చేయించింది. జల పూజ చేయించింది. కౌసల్య జల పూజకు మెచ్చిన సరస్వతీ నది జల దేవత రూపంలో కౌసల్య పూరులను ఆశీర్వదించింది. 



 కౌసల్య పూరులు తమ సంతానాన్ని చక్కగా పెంచారు. పూర వంశం పౌరులై వర్థిల్లారు. అటుపిమ్మట మహా సమర్థుడైన జనమేజయ రాజుని ప్రతిష్టాన పురానికి రాజును చేసారు. 

 కురుక్షేత్ర యుద్ద సమయంలో కౌరవులను అర్జునుడు చీల్చి చెండాడే దృశ్యాన్ని పూరు మహారాజు ఇంద్రునితో కలిసి ఆకాశంనుండి సందర్శించాడు.
 
 
శుభం భూయాత్ 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - అనంత - by k3vv3 - 23-12-2024, 01:35 PM



Users browsing this thread: 1 Guest(s)