23-12-2024, 01:32 PM
"అవును. మాధవి యయాతి మహారాజు కుమార్తే.. ఆమె ప్రస్తుతం వన సంచారిణిగ విష్ణు సేవన కాలం గడుపుతుందని విన్నాను. పూరుడు చాల మంచి మహారాజు. గంధర్వ కాంతలను పరాభవించబోయిన రావణబ్రహ్మకు ఎదురునిలిచాడు.
ఆ యుద్దంలో పూరుడు ఓడిపోయినప్పటికి గంధర్వ కాంతలను రక్షించాడు. అలాగే మాంధాత మహారాజు చేతిలో కూడా పూరుడు ఓడిపోయాడు. అయితే పుర రక్షణ చేయగలిగాడు. పూరుని మేథో సామర్థ్యం, సంకల్ప సామర్థ్యం మహోన్నతమైనవి. కాకపోతే తన తనువు కొంత కాలం తండ్రి దగ్గర ఉండటం వలన సమరంలో చిన్న చిన్న సమస్యలను కొన్ని సార్లు ఎదుర్కొనలేకపోతున్నాడు. ", కూతురితో అన్నాడు పుష్టి మహారాజు .
"అలాంటి మంచి మహారాజులకు మనకు చేతనయినంత సహాయం చేస్తే బాగుంటుంది తండ్రిగారు. " పుష్టి మహారాజు తో అంది కౌసల్య.
"చేయవలసిన అవకాశం వస్తే తప్పకుండా చేద్దాం పౌష్టి. " కూతురుతో అన్నాడు పుష్టి మహారాజు.
"పౌష్టి.. పుష్టి మహారాజు కుమార్తె పౌష్టి. పరోపకార విషయ చర్చలు వచ్చినప్పుడు తండ్రి గారు నన్ను కౌసల్య అని నా అసలు పేరుతో పిలవకుండా పౌష్టి అని పిలుస్తారు. ఏదేమైనా తండ్రిగారికి సాటి నా తండ్రిగారే. " అనుకుంది కౌసల్య.
కౌసల్య మునివాటికలకు వెళ్ళింది. అక్కడ అనేక మంది మునుల శరీరాలను పరిశీలించింది. తపస్సు చేసి చేసి క్షీణించిన మునుల శరీరాలను తన ఆకు పసరుల వైద్యం తో ఆయా తనువుల సామర్థ్యం పెంచింది. తమ తనువుకు పెరిగిన సామర్థ్యం చూసుకుని మునులు మురిసిపోయారు. కౌసల్యను పలు రీతుల్లో స్తుతించారు. నీ యిష్టం వచ్చిన వరాలను కోరుకోమన్నారు.
అప్పుడు "సకాలంలో వర్షాలు పడేందుకు యాగాలు చేయండి. ప్రజలు రోగాల బారిన పడకుండా యాగాలు చేయండి. గోసంపద దినదినాభివృద్ధి చెందాలని యాగాలు చేయండి. అమలిన విజ్ఞానం, ప్రజోపయోగ విజ్ఞానం ప్రజలకు పుష్కలంగా రావాలని యాగాలు చేయండి" అని కౌసల్య ప్రజల కోసం మునులను వరాలను అడిగింది..
పూరు మహారాజు పరిపాలనలో ప్రజలందరు సిరిసంపదలతో ఆనందంగా జీవించసాగారు. ప్రతిష్టాన పుర ప్రతిష్ట మరింత పెరిగింది. ప్రజలంతా పూరుని త్యాగ గుణాలను పలురీతుల్లో పొగడ సాగారు.
పూరుని శరీరం కొంత కాలం తన తండ్రి యయాతి మహారాజు దగ్గర ఉండటంతో పూరుని మంచి మనసును వేనోళ్ళ ప్రశంసించిన మహారాజులే అతని తనువును దృష్టిలో పెట్టుకొని అతనికి తమ కుమార్తెను ఇచ్చి పెళ్ళి చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.
ఇది తెలిసిన పుష్టి మహారాజు పూరు మహారాజు ను తన అల్లుని గా చేసుకోవాలనుకున్నాడు. అంత పుష్టి మహారాజు తన కూతురు కౌసల్య తో మాట్లాడాడు. పూరునితో మాట్లాడాడు. కౌసల్య పూరుల సమ్మతితో పుష్టి మహారాజు ఇద్దరి పెళ్ళి జరిపించాడు.
కౌసల్య తన భర్త పూరుని తనువులోని అణువణువును పరిశీలించింది. పూరుని అనేక ఆశ్రమాలు తిప్పింది. ఆయా ఆశ్రమాలలో ఉన్న దళాలతో భర్త శరీరానికి పుష్టిని పెంచింది. మునులతో వివిధ యాగాలు చేయించి భర్త శరీర తేజస్సును పెంచింది.
పూరుని శరీరం యజ్ఞయాగాదుల తేజస్సుతో నవ సామర్థ్యం పొందింది. శతకోటి కవచకుండలాల సామర్థ్యం పూరుని శరీరానికి వచ్చింది. అంత పూరుడు మాంధాత మీద యుద్దం ప్రకటించాడు. మాంధాత పూరునితో యుద్దానికి సిద్దం సిద్దం అన్నాడు. పూరుడు దశ దిక్కులనుండి వచ్చిన మాంధాత సైన్యాన్ని మట్టి కరిపించాడు. అతని వక్ష స్థలాన్ని తాకి కొండల్లాంటి గదలు పిండి పిండి అయ్యాయి. అతని పిడి గుద్దులకు శత్రువుల తలలు మొండెములలోనికి చొరబడ్డాయి. పూరుడు ఆ మహా సంగ్రామం లో మాంధాత మహారాజు ను ఓడించాడు.
యుద్దం లో ఓడిపోయిన మాంధాత మహారాజును పూరుడు తగిన విధంగా సత్కరించాడు. అనంతరం పూరుడు తన విజయ ఖడ్గాలలో ఒక విజయ ఖడ్గాన్ని మాంధాత మహారాజు కు బహుమతిగా ఇచ్చా డు. పూరుని మంచి మనసును గ్రహించిన మాంధాత మహారాజు పూరుని ముందు శిరస్సు వుంచాడు. మాంధాత మహారాజును సమరంలో ఓడించిన పూరుని పరాక్రమం గురించి సమస్త లోకాలు ముచ్చటించు కున్నాయి. తన ధర్మపత్ని కౌసల్య వలననే తనకంత పేరు వచ్చిందని పూరుడు సభా సాక్షి గా సమస్త లోకాలకు తెలియ చేసాడు.
ఒకసారి పూరుని రాజ్యంలో ఒక సంవత్సరం పాటు వర్షాలు కురవలేదు. పూరుడు, "ఇందుకు కారణం ఏమిటి?" అని మహర్షులను అడిగాడు.
కొందరు మహర్షులు "రావుిష్ట పుత్ర !పూరు మహారాజ!మీ రాజ్యం లో ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు. అందుకే వర్షాలు పడటం లేదు " అని అన్నారు.

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ