Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#29
కౌసల్య
 

[Image: image-2024-12-23-131158391.png]
[font=var(--ricos-font-family,unset)] [/font]
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
[font=var(--ricos-font-family,unset)] [/font]
పుష్టి మహారాజు కుమార్తె కౌసల్య. అప్పటికి సమాజంలో ఉన్న చతుర్వేదాల తేజస్సు ను ఔపాసన పట్టిన విదుషీ మణి. కౌసల్య, వేదాలను పఠించడానికి, వాటిని పదుగురికి చెప్పడానికి మాత్రమే పరిమితం కాలేదు. వేద మూల తేజాలను ప్రయోగ శాలలో నిరూపించడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయోగాలు కొన్ని ఫలించాయి. మంచి ఫలితాలనిచ్చాయి. వికటించిన ప్రయోగాలు కొన్ని కాల గర్భంలో కలిసిపోయాయి. కౌసల్య ఫలించిన మంచి వేద ఫలితాలతో సాధ్యమైనంత మేర ప్రజాభివృద్ది చేసింది. 



 వేద సృష్టి కర్తలలో కొందరు కౌసల్యకు బాగా తెలిసిన వారు ఉన్నారు.. వారితో కౌసల్య వేద మంత్రోచ్ఛారణ మాటున ఉన్న వధూ పీఠాది గణితం గురించి చర్చించింది. ఆయా మంత్రాలలో ఉన్న భావాల గురించి చర్చించింది. 



"కాలాన్ని బట్టి భావం ఉపయోగ పడవచ్చు. ఉపయోగ పడకపోవచ్చు. వధూపీఠాది గణితం మాత్రం సర్వకాల సర్వావస్థలయందు ఉపయోగ పడుతుంది" అని అనుకుంది. తన తండ్రి పుష్టి మహారాజు గురించి కూడా వేదాలలో ప్రస్తావించడడం ఆమెకు మహదానందం కలిగించింది. నిజం చెప్పాలంటే అప్పటికి వేదాలకు ఇంకా పూర్తి స్వరూపం రాలేదు. 



 ఋగ్వేదం ఏడవ మండలంలో పది రాజుల యుద్దం లో పురువంశం, తుర్వశ వంశం, ద్రుహ్యు వంశం, అనువంశం వారు ఉన్నారు. వారంతా అన్నదమ్ములు మరియు వారి వారి సంతానమే. అయినా పది దిక్కుల నుండి సైన్యమును నడిపి యుద్దం చేసారు. అప్పుడు పుష్టి మహారాజు వారందరిని శాంతింప చేసాడు. సాధ్యమైనంత వరకు అహింస మార్గానే సంచరించాలన్నాడు. అహింసను మించిన ఆయుధం మరొకటి లేదన్నాడు. 



ఒకనాడు పుష్టి మహారాజు కుమార్తె కౌసల్య తన తండ్రి పుష్టి మహారాజును, " జనకా.. ఋగ్వేదం ఏడవ మండలంలో దశరజ్ఞ సమరం గురించి కొంత మాత్రమే చెప్పడం జరిగింది. అప్పుడసలేం జరిగింది?" అని అడిగింది. 



 కౌసల్య మాటలను విన్న పుష్టి మహారాజు, " అమ్మా కౌసల్య! యయాతి మహారాజు మహా శౌర్యవంతుడు. మహా విజ్ఞానవంతుడు. అతడు తన కోరికల మీద వ్యామోహం చావక, తన ముసలి శరీరాన్ని స్వీకరించి, యువ శరీరాన్ని తనకివ్వమని తన కొడుకులను అడిగాడు. అందుకు అతని పెద్ద కుమారులు ఎవరూ సమ్మతించలేదు. చివరివాడు రావుిష్ట పుత్రుడు పురు సమ్మతించాడు. 



 యయాతి పురు శరీరంతో కొంత కాలం గడిపాడు. అలా తన కోరికలన్నిటినీ తీర్చుకున్నాడు. అటు పిమ్మ పురు శరీరాన్ని పురుకు ఇచ్చేసాడు. అలా జీవశరీరాలను మార్చగల విజ్ఞాన సామర్థ్యం యయాతి మహారాజు కు ఉంది. 



అయితే యయాతి మహారాజు తన విజ్ఞానాన్ని మంచి కంటే తన కామ కోర్కెలు తీర్చుకోవడానికే అధికంగా వినియోగించాడు. చేసిన పాపం చెబితే పోతుందని కొందరు అంటారు. అది అవకాశ వాదులు, కామవ్యామోహ చరితులు చెప్పేమాట. కాల చక్రం లోని ధర్మ సూక్ష్మం ముందు రాజైన పేదైన అందరూ ఒకటే. యయాతి మహారాజు ముసలితనంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. వారి వలన వారి కుమార్తె మాధవి బలిపశువు కావల్సి వచ్చింది. 



యయాతి మహారాజు పురుకు తన ప్రధాన రాజ్యం ప్రతిష్టాన పురానికి రాజును చేసాడు. తను జయించిన చిన్న చిన్న రాజ్యాలను మిగతా పుత్రులకు ఇచ్చాడు. 



తన తండ్రికి తన యువ శరీరాన్నే ఇచ్చేసి తండ్రి వృద్ద శరీరాన్ని స్వీకరించిన పురు మహారాజు ఎందరో మహానుభావులైన మహారాజుల కంటే గొప్పవాడని చెప్పవచ్చును. పురు మహారాజు పేరు మీద పూరు వంశం ఏర్పడింది. నాటినుండి పురు పూరుడు అయ్యాడు. పూర వంశమే పౌర వంశం. అయితే అతని సోదరులకు పూరుని మీద అసూయా ద్వేషాలు ఏర్పడి పూరుని రాజ్యం స్వంతం చేసుకోవాలని పూరుని మీద యుద్దం ప్రకటించారు. 



 కొంతకాలం తన తండ్రి యయాతి కి తన శరీరం ఇవ్వడం వలన పూరుని దేహంలో పరాక్రమ తేజం కొంత అలసత్వానికి గురయ్యింది. అయినా పూరుడు సోదరులతో సమరం చేసాడు. పది దిక్కుల నుండి వచ్చిన సైన్యాన్ని చాలా వరకు చీల్చి చెండాడాడు. సుధాస్ మహారాజు వంటివారిని మట్టి కరిపించారు.. అయితే అతని తనువులోని తేజస్సు కొంచెం కొంచెం క్షీణించ సాగింది. అది గమనించిన సుధాస్ మహారాజు పూరుని మీద పలు అస్త్రాలను ప్రదర్శించాడు. 



అప్పుడు నేను అస్త్రాలను బూడిద పాలు చేసాను. తర్వాత నేను సోదరుల నడుమ సమరం ఆపాను. తండ్రి కోసం తన తేజం కొంత కోల్పోయిన పూరుని మీరు రాజ్యం కోసం హింసించరాదన్నాను. కాదు కూడదు అని మీరు పూరుని హింసిస్తే నరకంలో వారు ఎలాంటి శిక్షలకు గురవుతా రన్నది వారికి వివరించాను. 



నా మాటల మీద ఉన్న గౌరవంతో ముందుగా యదు మహారాజు యుద్దాన్ని విరమించుకున్నాడు. యదు మహారాజును చూసి మిగతావారు కూడా యుద్దాన్ని విరమించుకున్నారు. " అని జరిగిన సంగతులన్నీ కుమార్తె కౌసల్య కు పుష్టి మహా రాజు చెప్పాడు. 



"ఆరు రోజులలో మహీమండలాన్నంత జయించిన యయాతి మహారాజు గారి కుమార్తె గదా మాధవి ?" తండ్రి పుష్టి మహారాజును అడిగింది కౌసల్య. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - అనంత - by k3vv3 - 23-12-2024, 01:31 PM



Users browsing this thread: 1 Guest(s)