7 hours ago
ఆ కవి శ్రేష్ఠుడు సామాన్యమైనవాడు కాదు. అతనికి సింహళ చరిత్ర మొత్తం కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. ఎన్నో కావ్యాల రచన చేసినవాడు. అలాంటి అతని మాట సింహళకు వేదప్రమాణం. ఆయన వర్షం పడుతున్నా సరే తడుస్తూ ఎందుకొచ్చాడో వివరించాడిలా.
"నేను ఈ సమయంలో మీతో ఈ నిజాన్ని పంచుకోకపోతే అటు పిమ్మట మీకు ఇదే విషయాన్ని ఇలాగే చెప్పినా మీరు నమ్మే పరిస్థితిలో ఉండరు", అన్నాడు.
"అదేంటి స్వామి ?" అని ఆశ్చర్యపోతూ అడిగాడు మంత్రి.
"కాలం చేసే మాయ అది. కాలంలో కనుమరుగు ఐపోయినవాళ్లు ఎందరో. మనమెంత? మన ఉనికెంత? అందుకే ముహూర్తం చూసుకుని బయలుదేరాను. మార్గంలో ఎన్నో ఆటంకాలొచ్చాయి. ఎన్నో విషనాగులు కనిపించాయి. నాకు ఏ హానీ తలపెట్టలేదు. కానీ భయపెట్టాయి. అప్పుడు మొదటిసారి అర్థం అయింది. ఏ భయం లేకుండా బ్రతికే నాకు కూడా భయం కలుగుతోంది అంటే రాజ్యంలో మునుముందు ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నట్టు రూఢి అయ్యింది ఆ క్షణాన", అన్నాడా కవి.
మంత్రి కళ్ళల్లోని సంశయాన్ని గుర్తించి ఇలా వివరించాడు కవి
"ఒక రాజ్యంలో యోధుడు, కవి మాత్రమే ఏ భయం లేకుండా బ్రతుకుతారు. అలాంటి వారికి భయం కలుగుతోంది అంటే ఆ రాజ్యానికి అపాయమే కదా", అన్నాడు.
ఆ కవి శ్రేష్ఠుడికి పాదాభివందనం చేసుకుని మంత్రి ఆయనతో,
"సింహ దత్తుడు తిరిగొచ్చే లోపు మన కార్యాచరణను మీరే నిర్దేశించండి కవివర్యా!" అంటూ ప్రాధేయపడ్డాడు.
"ఈ వర్షంలో మన రాజ్య ప్రజలందరూ అంటే మనం అందరం బయటికొచ్చి మోకాళ్లపై నిలబడి తడవాల్సిందే. ఇదొక్కటే మార్గం. ఇది తప్ప మరో ఉపాయం కనిపించటం లేదు. సింహ దత్తుడి ఆనందం మన ఆనందం అయినప్పుడు ఆయన బాధ మన బాధ కాదా ?" అంటూ ఎదురు ప్రశ్న వెయ్యటంతో కవి చెప్పదలుచుకున్న విషయం సూటిగా దూసుకెళ్ళిపోయింది యోధుడి బాణంలా.
ఈ వృత్తాంతాన్ని మధ్యలో ఆపి
"అలా రెండేళ్లు ఒక రాజ్య ప్రజలందరూ మోకాళ్ళపై నిలబడి రాజు కన్నీటిలో తడిసిన నేల ఒకప్పటి ఈ సింహళ రాజ్యం....ఇప్పటి మన శంభలలోని వరుణ ప్రాకారం", అంటూ మాటరాని మౌనంలోకి వెళ్ళిపోయాడు రుద్రసముద్భవ.
విక్రమసింహుడి కన్నీటి బొట్టు సూటిగా ఒక బాణంలా అంకిత చెంపను తాకింది. తన వైపుగా దూసుకొస్తున్న ఆ కన్నీటి బిందువులో సింహళలోని ఒకానొక సన్నివేశం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఒక్క నిమిషం గగ్గుర్పాటుకు గురయింది అంకిత. సంజయ్ వైపు తిరిగి చూస్తే అక్కడ సంజయ్ లేడు.
మోకాళ్లపై నిలబడి ఆకాశం వైపు చూస్తూ, "ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ శంభల రాజ్యంలోకి అడుగుపెట్టే అర్హతను నాకిచ్చిన నా పూర్వీకులు ఎంత గొప్పవారో. వారికి నేను చెయ్యగలిగింది ఏమైనా ఉందా !" అంటూ బాధపడ్డాడు.
"ఆదిత్యోపాసన చేసే నీకు పితృదేవతల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి సంజయ్", అన్నాడు రుద్రసముద్భవ.
సంజయ్ ఆశ్చర్యపోతూ రుద్రసముద్భవకు ప్రణామం చేసాడు.

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ