Yesterday, 08:50 AM
అందరు పొడి బట్టలు కట్టుకుని విశ్వనాధుని దర్శనం కోసం నుంచున్నారు. కోతులు అటు నుంచి యిటు, యిటు నుంచి అటు ఎగురుతో భక్తుల చేతిలోని ప్రసాదం బుట్టలు లాక్కుని పోతున్నాయి.
తన ముందు నుంచున్న పెద్దాయన తో “కార్తీకమాసం అయినా జనం ఎక్కువ లేరేమిటో” అన్నాడు మోహనరావు.
“కార్తీకమాసం కాశీలో వాళ్ళకి వెళ్ళిపోయిందిట, యిప్పుడు మార్గశిరమాసం” అన్నాడు.
“కొంపతీసావు. అయితే మేము కార్తీకమాసం స్నానం అనుకున్నాము, యింతోటీ దానికి యిక్కడికి వచ్చి ఫలితం లేకుండా పోతుందా” అన్నాడు బావమరిది తో.
“మాకు నిన్ననే తెలిసింది. టూర్ ఆపరేటర్ మనకి ఈ విషయం చెప్పలేదు. ఏమైనా కాశీ రావడమే గొప్ప పుణ్యం” అన్నాడు.
యింతలో ఒక కోతి ఎగిరి మోహనరావు మీదకు దూకి మోహనరావు చేతిలోని ప్రసాదం బుట్ట లాక్కుంది. బుట్ట గట్టిగ పట్టుకోవడం తో కోతి మోహనరావు చెయ్యి కొరికి పారిపోయింది. ఈలోపు విశ్వనాథుని దర్శనం కూడా చూసి చూడనట్టుగా అయిపొయింది.
బయటకు వచ్చి చూస్తే చేతి నుంచి రక్తం రావడం చూసి బయపడి మోహనరావు ని దగ్గరలో వున్న హాస్పిటల్ లో చూపించి ఇంజెక్షన్స్ ఇప్పించి రూమ్ కి తీసుకుని వచ్చాడు మోహనరావు బావమరిది.
రమణి కొడుకుకు ఫోన్ చేసి చెప్పింది మీ నాన్నకి జలుబు, దగ్గు, దానికి తోడు గుళ్లో కోతి కరిచింది అని.
“వద్దు అంటే వినకుండా బయలుదేరి వెళ్లారు. మీకు వయసు డబ్భై దాటింది అన్న సృహ కూడా లేకుండా పిల్లలు లాగా పరుగులు. యిప్పుడు నాకు చెప్పి ఉపయోగం ఏమిటి. ఫ్లైట్ టికెట్ పంపుతాను ఇమ్మీడియేట్ గా బయలుదేరి నా దగ్గరికి వచ్చేసేయండి. డాక్టర్ కి చూపిస్తాను. ఏమిటి.. నాన్న అలా పాడైపోయిన రేడియో సౌండ్ లా దగ్గుతున్నారు. ఏదో తెచ్చుకున్నాడు. కోతి కరవడం వల్ల అటు యిటు గెంతడం లేదుగా” అని అన్నాడు.
మొత్తానికి విమానం లో కొడుకు దగ్గరికి చేరుకున్నారు రమణి మోహనరావు లు. ఇంకేముంది ఎక్సరేలు బ్లాడ్ టెస్టులు మందులు రాసిచ్చి ప్రిస్క్రిప్షన్ మీద పెద్దగా రాసాడు "వృద్ధులు యాత్రకు అనర్హులు. తెగింపు ప్రమాదం” అని.
“కార్తీకమాసం స్నానం పుణ్యం దక్కలేదు. కోతి తో కరిపించుకుని వచ్చాము” అని కనిపించిన వాళ్లందరికీ చెప్తున్నాడు మోహనరావు. బహుశా కోతి కాటు వల్ల కాదు కదా, ఏమో..
శుభం

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ