Yesterday, 08:48 AM
“సరే పద, టిఫిన్ తిని వద్దాం” అని ఫలహారశాల దగ్గరికి వెళ్ళాడు.
టూర్ స్వామి, “అదేమిటి అప్పుడే స్నానం చేసి వచ్చేసారా, మిగిలిన వాళ్ళు వస్తున్నారా” అన్నాడు.
మేము వెళ్ళలేదు అండి. మీరు మరీ ఉదయం నాలుగు యింటికి నది స్నానం అంటే ఎలా? యిప్పుడు కూడా ఎలా వణికిపోతున్నామో చూడండి” అన్నాడు మోహనరావు.
“తీర్ధయాత్ర అంటే అంతే సార్, అయినా ఆరోగ్యం కూడా చూసుకోవాలి, కూర్చోండి. వాళ్ళు రాగానే పెసరట్టు ఉప్మా పెడ్తాము” అన్నాడు.
“ముందు కొద్దిగా వేడి కాఫీ ఇవ్వండి” అన్నాడు.
అరగంట గడిచేసరికి నదికి వెళ్లిన వాళ్ళు రావడం మొదలుపెట్టారు. కొంతమంది దగ్గుతో, కొంతమంది వణుకు తో వచ్చి టిఫిన్ కోసం కూర్చున్నారు.
తన పక్కన కూర్చున్న రమణ మాస్టర్ తో “సార్! నదిలో నీళ్లు చల్లగా ఉన్నాయా” అన్నాడు మోహనరావు.
“దిగే అప్పుడు ప్రాణం పోతున్నంత చలి, తరువాత సద్దుకుంది, మీరు రాకపోవడం మంచిది అయ్యింది. టీవీ లో చెప్పినంతగా యిక్కడ కి వచ్చి చూస్తే నదులు శుభ్రం గా వుండవు అండి. పాకుడు పట్టిన మెట్లు, మురికి నీరు, అయినా పుణ్యం అంటారుగా తప్పదు. అన్నట్టు మీ బావమరిది మెట్టు జారి నీళ్లలో పడ్డాడు. మొత్తానికి బయటికి లాగాము” అన్నాడు ఆయన.
‘అయ్యో ఎలావుందో’ అనుకుంటూ లేచిన మోహనరావుకి భార్య భుజం మీద చెయ్యి వేసి కుంటూ కుంటూ వస్తున్న బావమరిది ని చూసి, “లోపలికి అంతా దిగావా” అన్నాడు మోహనరావు.
“లేదు బావగారు, ముందు ధైర్యంగా స్నానం చేద్దాం అనుకున్నాను కాని నీళ్లు షాక్ కొట్టే అంత చల్లగా ఉండటం తో మెట్లదగ్గర కూర్చొని స్నానం చేద్దాం అనుకుని జారి పడ్డాను” అన్నాడు.
“పాపం కాలు వాచినట్టు గా కూడా వుంది. మీరైతే బయటకు వచ్చే వాళ్ళు కాదు అన్నయ్య గారు” అంటున్న ఆవిడ వంక అసహ్యం గా చూసి పెసరట్టు చేదు అనిపించి రూమ్ లోకి వచ్చేసాడు.
సాయంత్రం ఆ కాలుతో నడవడం కష్టం అని వీల్ చైర్ లో ఎక్కించి అయోధ్య బాలరాముడు ని చూసి వచ్చాము. యింకా సిమెంట్ పనిజరుగుతో ఉండటం తో ఒకటే దుమ్ము. లంగ్స్ లో కి వెళ్ళి అందరూ దగ్గులే దగ్గులు.
మర్నాటి ఉదయం మళ్ళీ కొంతమంది ధీరులు సరయు నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చారు. టిఫిన్ తిన్నతరువాత బస్సు కాశీకి బయలుదేరింది. బస్సు స్టార్ట్ చెయ్యగానే పది మంది వరసగా తుమ్ములు, కొంతమంది దగ్గులు. ఒక చాదస్తం ఆయన “బస్సు ఆపవయ్య బాబూ, తుమ్ము మంచిది కాదు” అన్నాడు. అయితే బస్సు డ్రైవర్ కి తెలుగు రాకపోవడంతో రయ్యి మని బస్సు ముందుకు పోనిచ్చాడు.
రాత్రికి కాశీ చేరుకున్నారు. టూర్ స్వామి అనౌన్స్మెంట్: “ఈ రాత్రికి రెస్ట్ తీసుకోండి. తెల్లవారి జామున రెండు గంటలకు బయలుదేరి గంగా నది స్నానం తరువాత స్పర్శ దర్శనం ఉంటుంది. రాగలిగిన వాళ్ళు రండి, రాలేని వాళ్ళు వీలునిబట్టి గంగా స్నానం చేసుకుని విశ్వనాధుని దర్శనం చేసుకోండి” అని చెప్పి వెళ్ళిపోయాడు.
మోహనరావు కి అతని భార్య కు, మొత్తం యాత్రకు వచ్చిన యాత్రికులకు జలుబు, దగ్గులతో విలవిల అడిపోతున్నారు. రేపు యాత్రలో ఆఖరి రోజు. యింతవరకు గంగా స్నానం వాళ్ళకి చివరి అవకాశం, ఈ రోజు మణికర్ణిక స్నానం. ఈ స్నానం చేస్తే పాప విముక్తులు అవుతారు అంటూ పెద్ద హడావిడి చేసాడు టూర్ స్వామి.
“ఏమండీ, నా మాట విని ఈ ఒక్కరోజు గంగా స్నానం చెయ్యండి. మళ్ళీ కాశీ రాగలమో లేదో” అంటూ మోహనరావు ని బ్రతిమిలాడింది.
“సరేలే, గంగా స్నానం చెయ్యలేదు అంటే మా వాళ్ళు నవ్వుతారు, ఈ రోజు స్నానం చేసి దర్శనం కి వెళదాం, కార్తీకమాసం శివుడి దర్శనం మహా పాపనాశనం అంటారు” అన్నాడు.
“అన్నట్టే పన్నెండు గంటలకల్లా గంగానది ఒడ్డుకు చేరుకున్నారు స్వామి వారి యాత్రికులు. రెండు పడవలు మాట్లాడి అందరిని నది లో వున్న మణికర్ణిక ఘాట్ కి తీసుకుని వెళ్ళి స్నానం చెయ్యమన్నాడు స్వామి.
మోహనరావు నీళ్లలో కాలు పెట్టగానే గజేంద్రమోక్షం లో ఏనుగుని మొసలి పట్టుకున్నట్టుగా చల్లగా తగిలాయి నీళ్లు.
“యిదిగో రమణి, నేను ఈ చల్లని నీటిలో ములగలేను కాని నువ్వు స్నానం చేసి ఒక చెంబుడు నీళ్లు తీసుకుని రా, గట్టున కూర్చొని తల తడుపు కుంటాను” అన్నాడు.
“భలే వారు మాస్టరు, స్నానం కి భయపడితే ఎలా? చూడండి ముందు నేను దిగి మూడు మునకలు వేస్తాను, మీరు కూడా అంతే చెయ్యండి” అన్నాడు తిరుపతి నుంచి వచ్చిన యాత్రికుడు.
హుషారుగా నదిలోకి దిగి. మొదటి మునకకి చలి, రెండవ మునక నీళ్లు వేడిగా అయిపోయాయి అంతే యిప్పుడు మూడో మునక అని ములిగినవాడు బయటకు రాలేదు. దూరం నుంచి అతను చేతులు ఊపుతో “చచ్చానురో ములిగిపోతున్నాను లాగండి” అని అరిచాడు తిరుపతి యాత్రికుడు. పడవ వాళ్ళు దూకి నదిలో నుంచి బయటకు లాక్కుని వచ్చారు.
ఈ హడావుడి లో మోహనరావు నెత్తి మీద నాలుగు చెంబుల గంగా నీళ్లు పోసింది రమణి. చలికి అలవాటైనట్టుంది మెల్లగా రెండు మెట్లు దిగి రెండు మునకలు మునిగి బయటకు వచ్చి భార్య వంక గర్వాంగా చూసాడు.

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ