19-12-2024, 02:32 PM
కూతురు మౌనంగా ఉండి ఏదో ఆలోచిస్తుంటే రామనాథం, ఆ అబ్బాయి గుణగణాలు ఇంకా వర్ణిస్తూ, "మీ అమ్మకి అంతస్థు సరిపోలేదుట.. అమ్మా నాకున్నదంతా నీదే కదా! ఇంకా ఎందుకు సంపద? అయినా వాళ్ళూ అంత లేని వాళ్లేమీ కాదు. ఆ అబ్బాయి మంచి కంపెనీలో ప్రాజెక్ట్ మానేజర్ పోస్ట్ లో ఉన్నాడు! మీ అమ్మ రాక్షసి!. ఇల్లరికం రావాలంటుంది. అమ్మా నీకు తెలియదు.. ఆ జీవితం నరకం.. నేను అనుభవించాను పెళ్లి అయిన పదేళ్లు. " ఇంకా ఏవో చెప్తూనే ఉన్నారు ఆయన.. మిహిరకి వాస్తవం అప్పుడు గుర్తొచ్చింది. ' అమ్మో గీచి గీచి ఖర్చు పెడతారని చెప్పింది అమ్మ. అయినా ఈ నాన్న తక్కువవాడా అమ్మ ఎన్ని చెప్పింది ఈయన గురించి? అసలు ఎవరన్నా తన శరీరంలో భాగం ఇచ్చేస్తారా? అదీ భార్య ఇష్టానికి వ్యతిరేకంగా.. ఊహు.. నాకు అమ్మని బాధ పెట్టిన వాళ్లంటే అసహ్యం. నా నిర్ణయం సరి అయినదే' అని తలపోసి, "నాన్నా! నువ్వు అమ్మని అంతలా ఆడిపోసుకోవటం నాకు నచ్చలేదు. నాకు వాళ్ళు నచ్చలేదని చెప్పేసెయ్యి వాళ్ళకి!" మిహిర మాటలు గంగాధరానికి ఆశనిపాతాలయ్యాయి!
ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నాడేమో, ఆఖరి అస్త్రం కూడా ఉపయోగించాడు. "మీ అమ్మ ఈ ఆస్తి తన తండ్రిది అనుకుంటున్నదేమో.. చాలా భ్రమలో ఉన్నదని చెప్పు. వాళ్ళ నాన్న మిగిల్చింది ఈ ఇల్లు మాత్రమే! ఈ ఆస్తంతా నా స్వార్జితం! నీ బాగు కోసమే ఈ సంబంధం చేసుకో మంటున్నాను. నువ్వు మొండికేస్తున్నావు. నేనూ మొండివాణ్ణే. ఈ ఆస్తిలో నీకు, మీ అమ్మకి ఎటువంటి హక్కు లేదని పత్రాలు తయారు చేయించేస్తాను. దీనికి తిరుగులేదు అంతే! ఇంకా ఏమిటి మీ అమ్మని బాధ పెట్టానంటున్నావు కదూ.. ఎవరు ఎవర్ని ఎలా బాధ పెట్టారో మీ అమ్మనే అడుగు. నా నోరు తెరిపించకు. మర్యాదగా నువ్వు ఈపెళ్ళికి ఒప్పుకోవడం ఒక్కటే నీకున్న ఛాయిస్!"
ఆ తల్లి కూతుళ్లు మ్రాన్పడిపోయారు.. ఎంత మాత్రమూ ఊహించని ఈ మలుపుకి!
అప్పుడే తన ఆలోచనల్ని అమలు చేయడం మొదలుపెట్టేసాడు గంగాధరం.. బీరువా తాళం చెవి తన దగ్గరే పెట్టుకున్నాడు. జాయింట్ అకౌంట్లు సింగిల్ ఆపరేషన్ చేసేసాడు.. హడలి పోయారు తల్లీ కూతుళ్లు!
**
గంగాధరం, రామనాథంతో తన బాధనంతా చెప్పుకున్నాడు.. ఆయన తన కొడుకుని ఈ పెళ్లికి సుముఖుణ్ణి చెయ్యాలని బ్రతిమాలాడు.. "మిహిర. చెడ్డది మాత్రం కాదురా రామం.. నాకు నమ్మకముంది రాజు దాన్ని దారిలో పెట్టగలడని" స్నేహితుడి కన్నీళ్లు రామనాథాన్ని ఆలోచింపచేసాయి.. 'తన కూతురే ఇలా ఉంటే.. ' అంతే, "పెళ్లికి ముహూర్తాలు పెట్టించరా" అన్నాడు.
***
రాజీవ్ తండ్రి మాటకి, ఋణవిముక్తికి, మీదు మిక్కిలి తనకి ఆ అమ్మాయిని చూడగానే కలిగిన గిలిగింత తలపులకి, ఆమెని తాను మార్చుకోగలనన్న ధైర్యానికి బద్ధుడై, పెళ్ళికొడుకు అయినాడు!
వేద మంత్రాలు, పెళ్లి జరిగేటప్పుడు ఆ సాన్నిహిత్యం మిహిర అంతరంగాన అతని మీద ప్రేమ కలిగిస్తున్న ప్రతిసారి, తల్లి వాళ్ళ గురించి చెప్పే హీనోక్తులు మనసును ఎదురు తిరిగేట్లు చేస్తున్నాయి. దాంతో ఆమె ప్రవర్తన నలుగురూ చెవులు కొరుక్కునేట్లు ఉన్నది.
తనదైన వ్యక్తిత్వంతో రాజీవ్, మిహిర ప్రవర్తనని అడుగడుగునా కమ్ముకుంటూ వస్తున్నాడు. శాంత, రామనాథంలు అన్నీ తెలిసిన వాళ్ళు కనక తమ ప్రేమతో మిహిరని శాంతపరుస్తున్నారు.
అత్తగారిల్లంటే ఎంత విముఖాత ఉన్నా, అక్కడ ఉన్న మూడు రోజులూ రామనాథం, శాంతల అన్యోన్యత మిహిరని అబ్బురపరచింది!
'ఆంటీ ఎందుకు అంకుల్ పిలవగానే 'జీ హుజూర్ 'అన్నట్ల వెళ్తుంది అనుకున్నానో లేదో అంకుల్ అందరి ఎదురుకుండానే ఆంటీ కాళ్ళకి నూనె రాస్తున్నారు! నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను!. ఇంత పెద్ద వాళ్లయినా, ఇద్దరూ కలిసి కూర్చుని, హాసప్రతిహాసాలతో, ఒకరికొకరు సాయ చేసుకుంటూ.. ఇలా ఉంటారా భార్యా భర్తలంటే.. " తన తల్లిదండ్రుల దగ్గర ఎన్నడూ చూడని ఈ సన్నివేశాలు మిహిర హృదయంలో ఓ సున్నిత కోణాన్ని తట్టి లేపాయి!
రాధ నిర్లక్ష్య వైఖరి తెలిసిన గంగాధరం, రాజీవ్ కోరినట్లు తమ ఇంట మూన్నిద్రలు లాంటి సాంప్రదాయాలని పక్కన పెట్టేసి, నూతన వధూవరులు హనీమూన్ కి వెళ్లడానికి ఒప్పుకున్నాడు. రాజీవ్ తన ఖర్చుతో, తన లైఫ్ స్టైల్ లో మాత్రమే భార్యతో ఊటీ, కోడైకెనాల్ వెళ్లడానికి డిసైడ్ అయ్యాడు!
***
ఎంతో సతాయించాలని, తన తండ్రి మీద పగ, భర్త మీద తీర్చుకోవాలని ఎన్నో ప్లాన్లు తల్లితో కలిసి వేసిన మిహిరకి, రాజీవ్ ప్రవర్తన అవకాశమే ఇవ్వలేదు.
సుందర ప్రదేశాలన్నీ ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా ఒక ప్రాణస్నేహితుడు లాగా తిప్పి చూపించాడు. ఒక్కటే మంచం మీద పడుకున్నా ఎటువంటి వికారమూ లేకుండానే ఉన్నాడు! మిహిర ఒకానొక చలిరాత్రి దగ్గరగా రాబోయినా, సున్నితంగా పక్కకి జరిగి లేచి వెళ్లి సోఫాలో పడుకున్నాడు. ఆ రోజు మొదలు ప్రతీ రాత్రీ అంతే! మిహిర అహానికి అది పెద్ద దెబ్బ! ఉక్రోషంతో కసి, కోపంతో మిహిరని ఆందోళన, ఆవేదన, అనురాగం ముప్పిరిగొనగా రాజీవ్ స్థితప్రజ్ఞతతో, ఏమాత్రం కొరుకుడు పడకుండా నిలిచాడు!
రామనాథం రోజూ కొడుక్కి మెసేజ్ చేసి విషయాలు తెలుసుకుంటున్నాడు. శాంతకి భర్త ద్వారా తెలుస్తున్నాయి. ఒకరోజు శాంత రాజీవ్ కి, "మరీ ఓవర్ డోస్ ఇవ్వద్దు.. వికటించగలదు" అని. మెసేజ్ చేసింది.

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ