19-12-2024, 02:29 PM
'పందిట్లో పెళ్లవుతున్నది'
రచన: విజయా సుందర్
"పిల్ల చాలా బాగున్నది కదరా" తల్లి మాటకి రాజీవ
ముక్తసరిగా, "ఆ.. బాగున్నదమ్మా"అన్నాడు. కొడుకు ఇంత ముక్తసరిగా మాట్లాడటం ఎరగని శాంత విస్తుపోయింది!
తల్లి తాము చూసి వచ్చిన అమ్మాయి గురించి తన అభిప్రాయం చెప్పమంటే రాజీవ్, " అమ్మా! ఆ అమ్మాయి చాలా అందంగా ఉన్నది. కానీ.. మర్యాద అనే మాటకు అర్థం తెలియని దానిలా విసురుగా కూర్చుని, ‘మిస్టర్ రాజీవ్! నాకు ఇప్పుడ్డప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. అదీ ఇలా సంతలో పశువులా, ఓ ఎక్జిబిట్ లా అసలే ఇష్టం లేదు. మా నాన్న చాదస్తంతో.. ఎనీవే నేను ఆయన కూతుర్నే. నాకు మీ సంబంధం ఏ రకంగానూ నచ్చలేదని చెప్పేస్తాను’ అని వెళ్ళిపోయింది.
“అమ్మా! ఇదా పద్ధతి ? అసలు నాకు ఏమి మాట్లాడటానికి ఇష్టమనిపించట్లేదు. నిష్కర్షగా చెప్పెయ్యండి వద్దని" అని రాజీవ్ విసురుగా లేచి వెళ్ళిపోయాడు.
ఆ మాటలు విన్న శాంత, భర్త రామనాథం నిస్పృహతో నిట్టూర్చారు!
కాఫీ అడగడానికి వచ్చిన రాజీవ్, ఇంకా ఆలోచిస్తూ అక్కడే కూర్చున్న తల్లిదండ్రుల్ని చూసి ఆశ్చర్యపోయాడు.
"అదేమిటి నాన్నా అలా అయిపోయారు? ఆ అమ్మాయి మీ ప్రాణ స్నేహితుడి కూతురు.. ఆంతే కదా అంతమాత్రాన, నేను ఆ అమ్మాయిని కాదంటే ఇంతలా రియాక్ట్ అయ్యారేమిటీ?" అన్నాడు.
"రాజూ! కొన్ని విషయాలు నిలుచున్న పళంగా తేల్చి చెప్పలేము నాన్నా! ఆ అమ్మాయి తండ్రి నాకు స్నేహితుడు ఒక్కడే కాదురా.. నా ప్రాణదాత!"
"ప్రాణదాతా?"
శాంత రాజీవ్ భుజం మీద చెయ్యి వేసి అనునయంగా, "మీ నాన్న కి నువ్వు నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడు షుగర్ పెరిగి రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి! నా కిడ్నీ సూట్ కాలేదు. కొనడానికి ప్రయత్నం చేస్తే ఏవీ సూట్ కాలేదు.
అప్పుడు తన ప్రాణ స్నేహితుడు గంగాధరం, "అరేయ్ ఏంట్రా అలా కృంగిపోతున్నావు? నువ్వు డిప్రెస్ అయితే ఈ సంసారానికి దిక్కెవరు? నాకు రెండు కిడ్నీలున్నాయి కదరా.. నీకొకటిస్తాను.. అంతే సింపుల్" అంటూ ఏదో రెండు ఆపిల్స్ ఉంటే ఒకటి ఇస్తానన్నంత తేలిగ్గా అన్నాడు.
అన్నీ తానే నిర్ణయాలు తీసుకుని డాక్టర్ తో మాట్లాడి, తన కిడ్నీ మ్యాచ్ అయిందని తెలుసుకుని, అన్ని ఏర్పాట్లు చేసి, కిడ్నీ ట్రాన్సప్లాంట్ చేయించేశాడు.
తన కుటుంబం నుండి ఎంత వ్యతిరేకత వచ్చినా కేర్ చెయ్యలేదు. భార్య రెండేళ్లు పుట్టింట్లోనే ఉండి పోయింది. నాన్న తన వలన వాళ్లిద్దరూ విడిపోతున్నారని, ఆవిడ దగ్గరకు వెళ్లి, బతిమాలి, బామాలి పిల్లకోసమైనా తప్పదని ఇద్దర్నీ కలిపారు.
తిరిగి వచ్చిందన్న మాటే గానీ, భార్యాభర్తల మధ్య అగాధం ఏర్పడిపోయింది. నాన్న తన వలననే అని బాధపడితే గంగాధరం, " నీ మొహం నీ వల్లనేమీ కాదురా. నేను చదువుకునే రోజుల్లో వాళ్ళ ఇంట్లో వారాలు చేసుకున్నాను. వాళ్ళ నాన్న కష్టపడి పైకొచ్చే నన్ను మెచ్చి, ఆవిడ మెడలు వంచి మా పెళ్లి చేసాడుట. అది నాకు తెలియదు. అందుకని నేనెప్పటికీ ఆవిడకి రాంగ్ నెంబర్నే" అని ఓదార్చేవాడు. " తల్లి ముగించింది.
రామనాథం, "ఈ మధ్య వాడు కూతురి గురించి బాధపడ్డాడు. చిన్నప్పుడు తన దగ్గరే ఎంతో మాలిమిగా ఉండే పిల్ల, పెద్దది అవుతున్నప్పట్నుండి తల్లి ప్రభావం పడుతున్నదనీ, తొందరగా పెళ్లి చేసి పంపాలని ఉన్నదనీ, మనలాంటి మంచి ఇంట్లో అయితే బాగుంటుందని తన మనసు విప్పి చెప్పాడు. అందుకే మేము ఆశపడ్డాము ఇలా వాడి రుణం తీర్చుకోవచ్చునని.. కొడుకు మనసులో మెదిలే ఆలోచనలు పసికట్టినట్లు ఆయన, "అలాగని నీ ఇష్టానికి వ్యతిరేకంగా చెయ్యాలని కాదు.. అయినా ఆ అమ్మాయి తనకి ఇష్టం లేదని చెప్పేస్తానన్నది కదా. చూద్దాం ఏం జరుగుతుందో?" అన్నాడు.
***
రాజీవ్ ముఖకవళికలను బట్టి, తన కూతురి గురించి తెలిసిన గంగాధరం వాళ్ళు వెళ్ళగానే మిహిరను నిలదీసాడు.
"అవును నేను చెప్పాను అతను నాకు నచ్చలేదని" నిర్లక్ష్యంగా చెప్తున్న మిహిరని చురచురా చూస్తూ, "ఆ అబ్బాయికి ఏమి లోపమున్నదని నచ్చలేదో చెప్పమ్మా" లేని సహనం తెచ్చుకుని అడిగాడు.
"నాకు నచ్చలేదంతే. "
" అంటే కేవలం నేను చెప్పిన సంబంధమని, అంతేనా?". మిహిర తల్లి రాధ, "దానికి నచ్చలేదంటే వినరేమిటీ? మీకెందుకంత పట్టుదల?"
ఎన్నడూ రానంత కోపమొచ్చింది గంగాధరానికి, "నువ్వు నోర్ముయ్.. దాన్ని కూడా నీ లాగానే తయారు చేస్తున్నావు. పిల్లవాడు మేలిమి బంగారం. మిహీ బంగారు తల్లీ! నా మాట వినమ్మా.. నువ్వు చాలా సుఖఃపడతావు. "

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ