Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - 6
#36
కైలాసపతి మద్రాసుకు బయలుదేరే ముందు ప్రజాపతిని రమ్మని పిలిచాడు. ప్రజాపతి నేను రాను మీరు వెళ్ళిరండి అన్నాడు. ఊర్మిళ ప్రసవించిన మూడునెలలకు లావణ్య మొగ శిశువుకు జన్మనిచ్చింది. వారు బిడ్డకు దినకర్ అనే పేరు పెట్టారు.



ఐదు సంవత్సరాలు కుటుంబాల మధ్యన ఎంతో ప్రశాంతంగా సాగిపోయాయి.
అప్పటికి లావణ్య ముగ్గురు బిడ్డల తల్లి. దినకర్, వాణి, ఈశ్వర్. విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగబోతున్నదనే విషయాన్ని విని.... విశాఖకు వెళ్ళి పరిసరాలను చూచి వచ్చిన శివరామకృష్ణ తన భార్యా బిడ్డలతో... వ్యాపారరీత్యా మద్రాస్ నుండి విశాఖపట్నం వెళ్ళిపోయాడు.
అప్పటికి వారికి నలుగురు సంతానం... చంద్రశేఖర్... రాఘవ... వైశాలి... శారద.



వారు వైజాగ్ వెళ్ళిన మరు సంవత్సరంలో చివరి ప్రసవంగా ఊర్మిళ విష్ణుకు జన్మనిచ్చింది. అతడు పుట్టుకతోనే గుడ్డివాడు.



ప్రజాపతికి తనకు ప్రణవి మూలంగా సంతానం కలుగనందుకు మరో వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చి తల్లిదండ్రులతో ప్రస్తావించాడు. కైలాసపతి, రుక్మిణమ్మలు అతని నిర్ణయాన్ని అంగీకరించలేదు.



కారణంగా ప్రజాపతి అడ్డదారుల్లో నడిచేవాడు. విషయాన్ని విన్న కైలాసపతి....



"సంతానప్రాప్తం అనేది దైవ నిర్ణయానుసారంగా జరిగేది. నా కోడలికి ఏం తక్కువరా! ఆమె వయస్సు ఎంత?... ఇకపై సంతానం కలుగబోదని నీవెలా నిర్ణయించగలవు. చెడు తిరుగుళ్ళు మాని ప్రణవితో సంసారం చెయ్యి. దైవాన్ని నమ్ము, ఆరాధించు. త్వరలో మీకు సంతానం కలుగుతుంది.
చెబుతున్న విషయాన్ని జాగ్రత్తగా విను. నీకు ఇద్దరు సంతానం కలిగే యోగం ఉంది. నా మాటను నమ్ము" అనునయంగా చెప్పాడు కైలాసపతి.



తన ప్రవర్తన... తండ్రి చెవికి సోకినందుకు తాత్కాలికంగా ప్రజాపతి తన అలవాట్లను మానుకొన్నాడు. ప్రణవి దరికి చేరాడు. దాదాపు తన వయస్సు వారే అయిన లావణ్యకు ముగ్గురు బిడ్డలు. ఊర్మిళకు నలుగురు సంతానం కలగడం, తనకు గర్భస్రావం తర్వాత మరో గర్భం రాకపోవడంతో... ఎక్కువ సమయం దైవ చింతనతో.... అత్తామామల సేవలతో కాలం గడిపేది ప్రణవి. ఆమె ఆవేదనను గమనించిన రుక్మిణమ్మ తల్లీ!... బాధపడకు. నీ పూజలు, వ్రతాలు, దీక్షలు తప్పక ఫలిస్తాయి అని ఎంతో ఆదరాభిమానాలతో చెప్పి ప్రణవిని ఓదార్చేది. ఆమె మొర దేవుడు ఆలకించాడు. ఊర్మిళకు ఐదవ గర్భం నిలబడిన మరుసటి నెలలో ప్రణవి గర్భం దాల్చింది. విష్ణు ఊర్మిళకు ఐదవ సంతతి. దీప్తి ప్రణవి మొదటి సంతతి. వారిరువురికి వయస్సులో తేడా మూడునెలలు. 



తొలిసారి తమ ఇంట ఆడబిడ్డ పుట్టినందుకు కైలాసపతి, రుక్మిణి, ప్రణవి, ప్రజాపతి ఎంతగానో సంతోషించారు. దీప్తి పుట్టిన పదిహేను నెలలకే ప్రణవి మగబిడ్డను ప్రసవించింది వాడి పేరే సీతాపతి.



సీతాపతి... పుట్టిన సంవత్సరం తర్వాత... లావణ్య నాల్గవ ప్రసవాన ఆడపిల్లను ప్రసవించింది. ఆమే శార్వరి.



రెండు సంవత్సరాల లోపలే ఆడ, మగ యిరువురు బిడ్డలు జన్మించినందుకు పెద్దవారు కైలాసపతి, రుక్మిణమ్మ, హరికృష్ణ, లావణ్యలు ఎంతగానో సంతోషించారు. వ్యాపారాభివృద్ధిలో మునిగిపోయిన శివరామకృష్ణ కైలాసపతికి శుభాకాంక్షలతో జవాబు వ్రాశాడే కాని... కార్యాలకు రాలేకపోయాడు.
తనని నిర్లక్ష్యం చేశాడని ప్రజాపతి శివరామకృష్ణ మీద పంతం పెంచుకొన్నాడు. అనివార్య కారణాల వలన రాలేకపోయి వుండవచ్చు. వుత్తరం వ్రాశాడుగా! అన్న హరికృష్ణ మాటలు ప్రజాపతి చెవులకు ఈటెలవలె సోకాయి.



చిన్నప్పటి నుంచీ చూస్తూనే వున్నాను. వీడు వాడి అభిమాని... అందుకే వాడిని సమర్థించి మాట్లాడుతున్నాడు. వీడికి నేనంటే గిట్టనట్లే. పైకి నటిస్తూ నవ్వుతూ నటిస్తాడు. నా చెల్లెలిని వీడికి కట్టబెట్టినందు వలన పెద్దవాళ్ళు బాధపడతారని వీడితో మాట్లాడవలసి వస్తూ వుంది. వాళ్ళు... అమ్మానాన్నలు, లేకుంటే... నాకు వీడితో మాట్లాడవలసిన అవసరం ఏముంది? అనుకొన్నాడు ప్రజాపతి.



పిల్లలు ఎదిగారు. స్కూళ్ళకు పోసాగారు. తరం పెద్దలుగా మిగిలిన కైలాసపతి, రుక్మిణమ్మలకు వయోభారం పెరిగింది. ఎంతో జ్ఞాని అయిన రుక్మిణమ్మ ఒకరోజు రాత్రి తన భర్తతో "ఏమండీ!... మనం వచ్చిన పనులన్నీ పూర్తయినాయి. నా ప్రస్తుతపు కోరిక ఏమిటో తెలుసా!"
"ఏమిటి రుక్మిణీ!..."



"మీ చేతుల్లో.... పైకి వెళ్ళిపోవాలనేది!..." విరక్తిగా నవ్వింది రుక్మిణమ్మ.



"అది నీ నిర్ణయం. కానీ సర్వేశ్వరుని నిర్ణయం ఎలా వుందో!.."



"నా కోర్కెను తండ్రి మన్నిస్తాడని నాకు నమ్మకం..."



"నీవు వెళ్ళిపోతే... నేనూ నీ వెనకాలే వస్తాను రుక్మిణీ!"



చిరునవ్వు... అందులో వైరాగ్యం... గోచరించాయి రుక్మిణమ్మకు. 
"నేను మీకో మాట చెప్పాలి!"



"చెప్పు..."



"మీ శరీరతత్వం సవ్యంగా వున్నప్పుడే ఆస్థిని ప్రజాపతికి, లావణ్యకు సమానంగా పంచి వీలునామా వ్రాసి రిజిస్టర్ చేయించి ఎవరి పత్రాలను వారికి ఇవ్వండి. మన తదనంతరం ప్రజాపతి అమ్మాయిని అల్లుణ్ణి గౌరవంగా చూచుకుంటాడనే నమ్మకం నాకు లేదు" విచారంగా చెప్పింది రుక్మిణమ్మ.
" ఏర్పాటన్నీ సవ్యంగా చేశాను" చిరునవ్వుతో చెప్పాడూ కైలాసపతి.



"అలాగా! మంచిపని చేశారు. రోజు నేను మీ మంచం మీదనే పడుకొంటానండి"



ప్రాధేయపూర్వకంగా అడిగింది రుక్మిణమ్మ.
"అమ్మాయిని పిలిపించనా!..."



" నిశిరాత్రిలో ఎందుకండీ!.... తెల్లవారి తనే వస్తుందిలే!....." వాలిపోతున్న కనురెప్పలను బలవంతంగా పైకి లేపి చెప్పింది రుక్మిణమ్మ.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 6 - by k3vv3 - 17-12-2024, 02:18 PM



Users browsing this thread: 1 Guest(s)