Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#35
మిత్రులు... శివరామకృష్ణ తల్లి శాంభవీ మరణాన్ని గురించి తర్వాత మూడునెలల లోపే గతించిన తండ్రి మహేశ్వర్ను గురించి మాట్లాడుకొన్నారు. వారిరువురి జీవితాల్లో... మంచీ చెడూ ఉన్నాయి. అవి మనకు మన భావి జీవితాన్ని గడిపేటందుకు మార్గదర్శకాలవుతాయి. మనుషులు పోయారు. చరిత్ర మాత్రం మిగిలింది అనుకొన్నారు.



ఒక ఆగంతకుడు పరుగున వచ్చి... రుక్మిణమ్మగారు పడిపోయారు అనే వార్తను వారికిచెప్పి వెళ్ళిపోయాడు.



నలుగురూ కైలాసపతి ఇంటికి పరుగుతీశారు. వూరిలో శాంభవి తర్వాత రుక్మిణమ్మకు అంతే మంచిపేరు వుంది. వాకిట నిలబడి వున్న ప్రజాపతి వీరిని చూచి ముఖం చిట్లించి వేరే దిశకు తిరిగాడు.



ప్రణవి.... వారి సాదరంగా లోనికి ఆహ్వానించింది. స్థానిక వైద్యుడు రుక్మిణమ్మగారికి కాలు విరిగిందని తేల్చి చెప్పాడు. మాట కైలాసపతికి సమ్మెటదెబ్బలా తగిలింది. ఎంతో ఆవేదనకు గురి అయ్యారు.



శివరామకృష్ణ, హరికృష్ణ వారిని ఓదార్చారు.



"చీమకు కూడా కీడు చేయని రుక్మిణికి శిక్ష ఏమిటిరా!..." ఆవేదనతో కన్నీరు కార్చాడు కైలాసపతి.
"నాయనా!.... శివా.... హరీ!... నాకు అనిపిస్తూ వుంది. సమయం ఆసన్నమయింది. కాలు విరగడం అనేది ఒక మిష. వాడు... ప్రజాపతి మా కడుపున చెడబుట్టాడు. లావణ్యను తన మిత్రుడు పరంజ్యోతికి ఇచ్చి పెళ్ళిచేయలేదని వాడికి మామీద కక్ష, ద్వేషం. ఎక్కడ హరికృష్ణ!... ఎక్కడ పరంజ్యోతి!... రౌడీ వెధవ. వీడూ అదే... ప్రజాపతి అలాంటివాడే, కాబట్టి మా నిర్ణయం వాడికి నచ్చలేదు. లావణ్యకు హరికృష్ణకు దేవుడు వ్రాసిపెట్టాడు. వారి వివాహం జరిగింది. పడ్డ తర్వాత శివా... మీ పెదనాన్న... ఒరేయ్ హరి... మీ మామయ్యగారు... తల్లడిల్లిపోయారు. ప్రజాపతి వచ్చి చూచి మెట్లమీద జాగ్రత్తగా దిగాలని తెలియదా!... ఎక్కడో చూస్తూ ఎవరితోనో మాట్లాడుతూ దిగితే యిలాగే అవుతుందని అన్నాడు నా నడతను ఆక్షేపించాడే కానీ... అమ్మా!.... పడ్డావు కదే... దెబ్బ తగిలింది కదే అని బాధతో కూడిన మంచిమాటను వాడు పలకలేకపోయాడు.



నేను వారూ... వాడిని, లావణ్యనూ ఒకేలాగ పెంచామురా!.... కానీ వాడి బయటి సహవాసం మంచిదికాని కారణంగా మానవత్వాన్ని వదలి... పెడసరంగా తయారైనాడు. మొక్కై వంగనిది మానై వంగుతుందా!... కష్టకాలంలో నాకు ఆనందాన్ని ఇచ్చే అంశం ఏమిటో తెలుసారా!... నా కోడలు నెల తప్పింది. శివరామకృష్ణా... నీ భార్యా నా పెద్దకోడలు ఊర్మిళ... హరికృష్ణ ఇల్లాలు... నా కూతురు లావణ్య గర్భవతులైనారు. మన వంశాలకు వారసులను ఇవ్వబోతున్నారు. పుట్టేది ఆడో... మగో.... వారిని చూడాలనే ఆశ తప్ప ఇక నాకు ఆశా లేదురా!..." ఎంతో దీనంగా బాధతో చెప్పింది రుక్మిణి.



"అమ్మా!.... నీకేం కాదమ్మా!.... భయపడకు బాధపడకు. నీవు నీ మనవళ్ళను, మనుమరాళ్ళను తప్పక చూస్తావు. మాట్లాడకుండా విశ్రాంతి తీసుకో అమ్మా!" తల్లి ప్రక్కన కూర్చొని ఆమె నుదిటిపై రేగిన తలవెంట్రుకలను సవరిస్తూ చెప్పింది లావణ్య. ఎప్పుడూ పార్వతీమాతలా నవ్వుతూ ఇంట్లో తిరుగుతూ కుటుంబ సభ్యుల అవసరాలను తీరుస్తూ... వీధిలో నడిచేటప్పుడు ఇరుగు పొరుగు వారి క్షేమ సమాచారాలను విచారిస్తూ... వారికి కావలసిన సాయం చేస్తూ మరో శాంభవిగా (శివరామకృష్ణ తల్లి) పేరు తెచ్చుకొన్న రుక్మిణమ్మ... కదలలేని స్థితిలో మంచం పట్టింది.



"పెదనాన్నా!... పెద్దమ్మను పుత్తూరు తీసుకుని వెళ్ళి కట్టు కట్టించుకొని వద్దాం. ఏమంటావు!..." అన్నాడు శివరామకృష్ణ.



"అవును మామయ్యా!.... శివ చెప్పింది మంచి సలహా వెళ్ళివద్దాం" అన్నాడు హరికృష్ణ.
"సరేరా!... మీ ఇష్టం వచ్చినట్లు చేయండి" అన్నాడు కైలాసపతి.



శివరామకృష్ణ... హరికృష్ణ... లావణ్యలు రుక్మిణమ్మను పుత్తూరుకు తీసుకొని వెళ్ళారు. కట్టు కట్టించారు. మూడువారాల తర్వాత రావాలని వారు చెప్పారు.



"అయ్యా!... వీరు మా అత్తయ్యగారు. వయస్సులో పెద్దవారు... అంత దూరాన్నుంచి మరోసారి ఇక్కడికి ఆమెను మేము తీసుకొని రావడం కష్టతరం. మీరు చెప్పిన సమయానికి మేము మీ వద్దకు వస్తాము. మాయందు దయ వుంచి మీరు మాతో మా వూరికి వచ్చి వారికి కట్టుకట్టండి. మీకు ఇవ్వవలసిన సొమ్మును మీకు చెల్లిస్తాము. ఇప్పుడు వచ్చేటప్పుడే వారు ఎంతగానో కష్టపడ్డారు. రక్తసంబంధం కదా!.... ఆమె బాధను మేము చూడలేకపోతున్నాము. మాయందు దయ వుంచి మా విన్నపాన్ని చిత్తగించండి" ఎంతో వినయంతో రామకృష్ణ చెప్పిన మాటలను వారు సమ్మతించారు. రుక్మిణి... లావణ్య... హరికృష్ణ... శివరామకృష్ణ వూరికి తిరిగి వచ్చారు.



అనుకొన్న మాట ప్రకారం హరికృష్ణ పుత్తూరు వెళ్ళి వైద్యులతో తిరిగి వచ్చారు. మూడునెలల్లో... మరో రెండు కట్లు వారు రుక్మిణీకి కట్టారు. ఆమె బాధ తీరి... మెల్లగా చేతికర్ర సాయంతో రుక్మిణమ్మ నడవసాగింది. ఆమె కాలు విరిగిన నాటినుండి ఆమెకు స్థిమితం కలిగే వరకూ... లావణ్య, ప్రణవి ఆమెకు ఎంతో సాయం ఒకరు మారితే ఒకరు ఆమె ప్రక్కనే వుండేవారు.



అత్తగారి సేవలో అతిగా శ్రమించిన కారణంగా ప్రణవికి మూడవనెల ప్రారంభంలో గర్భస్రావం జరిగింది. వార్త రుక్మిణమ్మను కృంగదీసింది. కైలాసపతి, హరికృష్ణ, లావణ్య, శివరామకృష్ణ, ఊర్మిళకు బాధపడ్డారు. తన వదిన ప్రణవికి లావణ్య అండగా నిలబడింది.



నెలరోజుల తర్వాత శివరామకృష్ణ, ఊర్మిళలు మద్రాస్కు వెళ్ళిపోయారు. వారు అక్కడికి చేరిన ఆరుమాసాలకు ఊర్మిళ కవల పిల్లలను కన్నది. ఆడ, మగ.



పిల్లలు నామకరణ మహోత్సవానికి కైలాసపతి, రుక్మిణమ్మ, హరికృష్ణ, లావణ్యలు మద్రాసుకు వెళ్ళారు. వారిని చూచి శివరామకృష్ణ, ఊర్మిళలు ఎంతగానో సంతోషించారు. బిడ్డలకు వారు వైశాలి, చంద్రశేఖర్ అని నామకరణం చేశారు. ఊర్మిళ తాతగారు వెంకటరమణ అందరి బంధువుల విషయంలో ఎంతో ఆదరాభిమానాలతో వర్తించారు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 6 - by k3vv3 - 17-12-2024, 02:17 PM



Users browsing this thread: 1 Guest(s)