Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - 6
#34
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 7



[font=var(--ricos-font-family,unset)] [/font]
మహేశ్వర్ మరణానంతరం... శివరామకృష్ణ, ఊర్మిళలు ఒంటరివారుగా మిగిలిపోయారు.
జగమే మంచిచెడ్డల కలయిక. కొందరు స్వార్థపరులు మహేశ్వర్ తమకు బాకీ అంటూ శివరామకృష్ణకు ఋణ వివరాలను వివరించారు. వారి మాటలను వేధింపులను భరించలేక... శివరామకృష్ణ మిగిలివున్న పొలాన్ని అమ్మి ఋణబాధల నుండి విముక్తి పొందాడు.
సమయంలో ఊర్మిళ గర్భవతి.



కుటుంబ స్థితి గమనించిన కైలాసపతి శివరామకృష్ణను తనవద్దకు పిలిపించుకొని తన నూనె ఫ్యాక్టరీలో పనిచేయవలసిందిగా చెప్పాడు.
"మీరు ఇప్పించిన ఉద్యోగం వుందికదా పెదనాన్నా! నా బ్రతుకు తెరువుకు అది చాలుగా!" అన్నాడు శివరామకృష్ణ.



"ఒరేయ్! నాకు ప్రజాపతి ఎంతో నీవూ అంతేరా!... దిగజారిన కుటుంబాన్ని నిలబెట్టాలనేది నా ప్రయత్నం. ఉద్యోగాన్ని వదలి ఫ్యాక్టరీలో భాగస్వామిగా చేరు. నా మాట విను" అనునయంగా చెప్పాడు కైలాసపతి.



"పెదనాన్నా! మీరు పెద్దమ్మా ఎంతో మంచివారు. మీకు బంధుత్వం, బాంధవ్యాల మీద ఎంతో గౌరవాభిమానాలు వున్నాయి. మీ మనస్సు చాలా మంచిది పెదనాన్నా!.... కానీ... నాకే... మన వూర్లో వుండాలని లేదు. మద్రాస్కు వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఊర్మిళ తాతగారూ అదేమాట చెప్పారు. ఊర్మిళకూ వెళ్ళాలని ఉంది" చెప్పాడు శివరామకృష్ణ.



"నీవు నా మాటను ఎందుకు కాదంటున్నావో నాకు తెలుసురా!.... ప్రజాపతి తత్త్వానికి, నీ తత్త్వానికి వున్న భేదమే కదరా కారణం!... నా ఆస్థిని నేను నా కష్టంతో సంపాదించాను. దానిమీద సర్వహక్కులు నాకే ఉన్నాయి. వాడు నిన్ను ఏమీ అనబోడు. నేనున్నానుగా!... నా మాట విను."
"పెదనాన్నా! నన్ను మన్నించండి. నేను మీ సలహాను పాటించలేను. నేను నిర్ణయానికి వచ్చాను పెదనాన్నా!"



"అలాగే!... సరే!... నీ ఇష్టప్రకారమే జరగనీ!... కానీ ఒక్కమాటను మాత్రం గుర్తుంచుకో, నా జీవితాంతం వరకూ నీకు ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సంకోచం లేకుండా నన్ను అడుగుతానని నాకు మాట ఇవ్వు."



"అలాగే పెదనాన్నా!..."



"చూడు శివా!.... నా కోడలు మామూలు మనిషి కాదు. ఆమెను జాగ్రత్తగా చూచుకో!... మన చర్యల వలన మన ఇంటి ఆడవారు కన్నీరు కార్చరాదు. మీ నాన్న విషయంలో తప్పే జరిగింది. మహాతల్లి మా వదిన వెళ్ళిపోయింది. ఇంటికి కారుచీకట్లు క్రమ్ముకొన్నాయి" విచారంగా చెప్పాడు కైలాసపతి.



"అమ్మా!.... ఊర్మిళా!... దీన్ని నీ దగ్గర వుంచమ్మా!" లక్ష రూపాయల నోట్ల కట్టలను ఊర్మిళకు అందించాడు కైలాసపతి.



ఊర్మిళ భర్త ముఖంలోకి చూచింది. చిరునవ్వుతో శివరామకృష్ణ తలాడించాడు.



"అమ్మా!... నిండు నూరేళ్ళు మీరిరువురూ ఇలాంటి కనుసన్నలతోనే... ఏకాభిప్రాయంతో... సంసారాన్ని సాగించి...మంచి బిడ్డలకు జన్మనిచ్చి అన్యోన్యంగా ఆనందంగా వర్దిల్లాలి తల్లీ!...." హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు కైలాసపతి.



"ఎప్పుడురా మీ ప్రయాణం!..."



" ఇంటికి అమ్మేసి..."



"ఏమిటి!... ఇంటికి అమ్ముతావా!..."



"అన్నీ పోయాక... ఇది మాత్రం వుండి ఏం ప్రయోజనం పెదనాన్నా!" విరక్తిగా చెప్పాడు శివరామకృష్ణ.



"ఒరే!.... ఇది మీ అమ్మానాన్నల తీపిగురుతు. దీన్ని అమ్మకురా! రానున్న రోజుల్లో ఎవరికి ఎవరు ఏమౌతారో... బంధుత్వాలు, బాంధవ్యాలు, రక్తసంబంధాలు ఎలా పరిణమించబోతాయో!... ఎక్కడెక్కడో తిరిగినా... ఏం చేసినా... నీవు పుట్టిన గడ్డ (ఇల్లు) మీద కాలు మోపితే... క్షణంలో నీకు కలగబోయే అనుభూతి... ఆనందం వేరుగా వుంటుందిరా!.... దీన్ని నీవు అమ్మేదానికి వీల్లేదు. వుంచుకో!... నీకేమైనా డబ్బు అవసరం అయితే ఎంతకావాలో చెప్పు... నేను, నీ పెదతండ్రిగా ఇస్తానురా!..." అనునయంగా చెప్పాడు కైలాసపతి.



"పెదనాన్నా!.... మీ కోడలి చేతికి డబ్బు ఇచ్చారుగా!.... ఇక వద్దు. మీ మాట ప్రకారమే ఇంటికి అమ్మను. మీరు దీన్ని చూచుకోండి. సంతోషమా పెదనాన్నా!..."



"నా మాటను విన్నందుకు చాలా సంతోషంరా!.... వెళ్ళబోయే రోజు నన్ను మీ పెద్దమ్మను కలవండి..."



"అలాగే పెదనాన్నా!..."



నిట్టూర్చి... వారివురి ముఖాల్లోకి క్షణంసేపు చూచి కైలాసపతి వెళ్ళిపోయాడు.
హరికృష్ణ... లావణ్యలు వచ్చారు.
"ఐదు నిముషాల ముందు పెదనాన్న వెళ్ళిపోయారురా!..."



"దూరాన్నుంచి చూచామురా!...." చిరునవ్వుతో చెప్పాడు హరికృష్ణ.



లావణ్య, ఊర్మిళ దగ్గరకు వెళ్ళింది.



"వదినా!,.... ఎలా వున్నావ్!" ఉదరాన్ని చూచి చిరునవ్వుతో అడిగింది లావణ్య.



"నా సంగతి నీకు తెలిసిందేగా!... మరి నీ సంగతి?" అడిగింది ఊర్మిళ.



సిగ్గుతో తల దించుకొంది చిరునవ్వుతో లావణ్య.
"అంటే!..."



అవునన్నట్లు తలాడించింది లావణ్య.
"కంగ్రాచ్యులేషన్ లావణ్యా!..." నవ్వుతూ చెప్పింది ఊర్మిళ.



శివరామకృష్ణ తన నిర్ణయాన్ని కైలాసపతికి తనకు క్రిందటి గంటలో జరిగిన సంభాషణను హరికృష్ణకు వివరించాడు.



తొలుత.. హరికృష్ణ ప్రియ బంధువు దూరం అవుతున్నందుకు బాధపడ్డాడు. కానీ పరిస్థితుల రీత్యా వారిరువురూ ఊర్మిళ అమ్మగారింటికి మద్రాసు వెళ్ళడమే మంచిదని తోచింది హరికృష్ణకు.



"బావా!... నీ నిర్ణయాన్ని నేను... దైవ నిర్ణయంగా భావిస్తున్నాను. పూలు అమ్మిన చోట వూరకట్టెలు అమ్మలేంగా!... నీ ఇష్టప్రకారమే జరగనీ!... అంతా పైవాడు చూచుకొంటాడు. అక్కడ నీకు తప్పక మంచిజరుగుతుంది" చిరునవ్వుతో చెప్పాడూ హరికృష్ణ.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 6 - by k3vv3 - 17-12-2024, 02:16 PM



Users browsing this thread: 2 Guest(s)