Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 10
శంభల రాజ్యం – 9
జ్వాలా జిహ్వుడు - భైరవిల పూర్వజన్మ కథ
 
"సింహదత్తుడు శంభల రాజ్యంలోనే ఉన్నాడా స్వామి?" అడిగింది అంకిత విక్రమసింహుడిలో సింహదత్తుడిని చూసి ఆశ్చర్యపోతూ.
 
"సింహదత్తుడు విజయకుమారిని వివాహం చేసుకున్న తర్వాత శంభలకే పరిమితం అయిపోయాడు. విక్రమసింహుడు పుట్టిన కొద్ది కాలానికి సింహదత్తుడు తనకున్న శక్తులన్నీ విక్రమసింహుడికి ధారబోసి తన దేహం విడిచివెళ్లిపోయాడు", అనేసి అంతకంటే ఇక చెప్పటం ఇష్టం లేదేమో అన్నట్టు ఆగిపోయాడు రుద్రసముద్భవ.
 
"ఏమైంది స్వామి?" అడిగాడు సంజయ్.
 
"సింహదత్తుడిది మామూలు మరణం కాదు. పోరాడుతూ వీరమరణం పొందాడు", అన్నాడు బాధగా రుద్రసముద్భవ.
వీరగాథను చెప్పాలనిపించి ఇలా చెప్పటం మొదలు పెట్టాడు రుద్రసముద్భవ.
 
జ్వాలా జిహ్వుడు అనే ఒక ప్రమాదకరమైన వ్యాళి శంభలలోని అనల ప్రాకారంలో ఉండేవాడు.
భైరవి అనే ఒక భయంకరమైన గరుడపక్షి మేఖల అనే ప్రాకారంలో ఉండేది.
 
జ్వాలా జిహ్వుడు, భైరవి ఇద్దరికీ పరస్పర వైరం ఉంది. అది ఈనాటిది కాదు.
 
జ్వాలా జిహ్వుడు పూర్వ జన్మలో ఒక యువరాజు. భైరవి గతజన్మలో అదే రాజ్యంలో ఒక సేవకుని ఇంట్లోని అమ్మాయి. యువరాజు ఒకనాడు వేటకు తన రాజ్యం నుండి కొన్ని యోజనాల దూరంలో ఉన్న ఝర్ఝరీ అనే అడవికి వేటకు వెళ్ళాడు. అడవిలో వేటకు వచ్చిన ఎవ్వరైనా సరే ఝర్ఝరీ శబ్దానికి భయభ్రాంతులకు లోనయ్యి దృష్టి నిలపలేక వేటను అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఇది తెలిసే అక్కడికి వచ్చాడు యువరాజు. వేటకు వెళ్లే ముందు అక్కడున్న సింధు నదీ తీరంలో మంచి నీరు తాగటానికి తన గుర్రం పై నుండి కిందకు దిగాడు. మంచినీరు తాగుతున్నప్పుడే నీటిలో ఒక అందమైన యువతి ప్రతిబింబం కనిపించింది. యువరాజు అందాన్ని చూస్తూ మైమరచిపోయి అక్కడే నిలబడి ఉన్నది యువతి. మంచినీరు తాగటం అయిపోయాక తల పైకెత్తి యువతినే చూస్తూ ఉన్నాడు యువరాజు. ఇద్దరూ అలా కాసేపు ఒకరిని ఒకరు చూసుకున్నారు.
 
యువతి మొట్టమొదట ఎవరినైతే చూస్తుందో అతను ఆమె మోహానికి వశం ఐపోతాడని తన జాతకంలో ఉన్నది. మోహాగ్నిలో రగిలిపోతూ ఎన్నో తప్పులు చేస్తూ విచిత్రమైన జంతు జన్మను పొందుతాడని కూడా జ్యోతిష్యుడు హెచ్చరించాడు. అతను అలా జంతు జన్మను పొందిన వెంటనే యువతి కూడా పక్షిగా మారిపోతుందని సూచించాడు. అందుకే రోజు నుండి యువతిని ఎవ్వరి కంట పడకుండా కాపాడుకుంటూ ఒక ఇంట్లోనే నిర్బంధించి ఉంచారు. కానీ అన్ని రోజులూ ఒకలా ఉండవు కదా. సరిగ్గా యువరాజు వేటకు బయలుదేరిన రోజే యువతి సింధు నదీ తీరం దాకా వెళ్ళొస్తానని వాళ్ళ నాన్న గారిని అడగటం, యువరాజును చూడటం సంభవించాయి.
 
యువరాజు రోజు రాత్రి యువతి ఇంట బస చేసాడు. అదొక సేవకుని ఇల్లు అనుకున్నాడు. కానీ ఇంట్లో కొన్ని గదులు మూసివెయ్యబడి ఉన్నాయి. యువతి నాన్నకు విషయం మొత్తం అర్థం అయిపోయింది. ఇప్పుడు యువరాజుకు నిజం చెప్పటం ఒక్కటే మార్గం అనుకున్నాడు. భోజనానికి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాడు. అంతలో యువరాజు ఒక గదిలోకి వెళ్ళాడు. అక్కడున్న వాద్యములని చూసాక అవి ఎలాంటి శబ్దాలు చేస్తాయన్న కుతూహలం పెరిగి ఒక చెయ్యి వేసాడు. విచిత్రంగా తాను రాజ్యంలో చిన్నప్పటి నుండి కథలు కథలుగా వింటూ వచ్చిన ఝర్ఝరీ శబ్దం ప్రతిధ్వనించింది. తన పూర్వీకులు ఎందరో ఝర్ఝరీ శబ్దం విని హడలిపోయి ప్రాణాలు వదిలారు. వారు ఏదో భయంకరమైన ప్రాణిని అక్కడ చూసారని చెప్పేవారు. అది అంతవరకూ చూడనిది, విననిది అంటూ భయం గొలిపే కథలు చెబుతూ వచ్చారు ఇన్నిరోజులూ. శబ్దాలు ఇక్కడి నుంచే వస్తున్నాయని తన పూర్వీకులు తెలుసుకోలేకపోయారని అమితంగా బాధపడి కంటతడి పెట్టాడా యువరాజు. తన తాతగారిని, నాన్నగారిని ఎందుకు కోల్పోయాడో ఇప్పుడర్థం అయింది. వెంటనే కళ్ళు ఎర్రబడ్డాయి. కానీ అక్కడ సమయంలో మాట్లాడటం భావ్యం కాదని మౌనం వహించాడు. రోజు రాత్రి యువతితో రతిలో పాల్గొన్నాడు. ప్రేమతో కాదు. రకమైన ప్రతీకార వాంఛలతో. ప్రతీకార జ్వాలలు యువతిని తాకాయి. తెల్లవారగానే యువరాజు మాయమైపోయాడు. యువతి నాన్నకు ఆందోళన మొదలైంది.
 
యువరాజు తన రాజ్యంలో కొంత మంది సైనికులను ఆజ్ఞాపించి గ్రామానికి పంపించి వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చెయ్యమన్నాడు. అక్కడి ఆడవారిపై కూడా అమానుషంగా ప్రవర్తించారు సైనికులు. ఇది యువరాజు ఊహించని పరిణామం. దాంతో యువతి కళ్ళ ఎదుటే ఒక గ్రామం మొత్తం దహించుకుపోయింది. వాళ్ళ నాన్న గారు యువతి కళ్ళల్లోకి నిరసనగా చూస్తూ ప్రాణాలు వదిలాడు. యువతి మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎటు వెళ్లిపోయిందో ఎవ్వరికీ తెలియలేదు.
 
యువరాజు రోజు నుండి పిచ్చివాడు అయిపోయాడు. యువతి గురించి కలలు కంటూ తనతో గడిపిన రాత్రినే మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకుంటూ మోహాగ్నిలో భస్మం అయిపోతూ పోతున్నాడు. కొన్ని రోజులకు యువరాజు కూడా ఎవ్వరికీ కనిపించకుండా మాయమైపోయాడు, అంటూ అమాంతం చెప్పటం ఆపేసాడు రుద్రసముద్భవ.
 
“అంటే యువరాజు, యువతి ఇద్దరూ...."అంటూ నీళ్లు నమిలారు అంకిత, సంజయ్ లు .
 
"అవును. మీరు ఊహించినది నిక్కమే. యువరాజు జ్వాలా జిహ్వుడు అయ్యాడు. యువతి భైరవిగా మారిపోయింది. ఒకరు అనలలో. మరొకరు మేఖలలో. అనంతమైన శక్తి సంపన్నులు. అతి భయంకరులు కూడా. అలాంటి ఇద్దరి నుండి శంభలను రక్షించిన బలశాలి సింహదత్తుడు. సింహ దత్తుడి రక్తమే విక్రమసింహుడు", అంటూ అనిలుడిపై నిరంతరంగా స్వారీ చేస్తూ అలసట అన్నది లేకుండా ఆలోచనలతో పరిగెడుతున్న విక్రమసింహుడిని  రుద్రసముద్భవ  వారికి చూపిస్తూ గర్వం నిండిన కళ్ళతో మాటలు చెప్పాడు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 8 - by k3vv3 - 17-12-2024, 01:17 PM



Users browsing this thread: 8 Guest(s)