09-12-2024, 02:27 PM
శంభల రాజ్యం – 8
సింహ దత్తుడి వృత్తాంతము
"విక్రమసింహుడి గురించి తెలుసుకోవాలనే తపన జజీరాలో రోజురోజుకీ పెరుగుతూ పోయింది. విక్రమసింహుడి పుట్టు పూర్వోత్తరాల గురించి విచారించే దాకా వెళ్ళిందది.
విక్రమసింహుడి పుట్టుక గురించి శంభలలో తెలిసింది ఇద్దరికే. ఒకటి నాకు. రెండు శంభల రాజుకు. జజీరాకు తానొక గొప్ప యోధుడిని అని ప్రపంచానికి తెలిసేలా చెయ్యాలనే తహతహ ఎక్కువ అవుతున్న రోజులవి. అందుకు కారణాలు లేకపోలేదు.
శంభలలో జరిగే ఎన్నో పోటీలలో జజీరా ఎప్పటికప్పుడు గెలుస్తూ వచ్చేవాడు. ఆ పోటీలలో విక్రమసింహుడి జాడ కూడా కనబడేది కాదు. ఎవరైనా విక్రమసింహుడి ప్రస్తావన తెస్తే మాత్రం జజీరా తట్టుకోలేకపోయేవాడు. విక్రమసింహుడి పరాక్రమం ఏంటో శంభల చూసింది. జజీరా ఇంకా చూడలేదు.
ఎంత గొప్ప యోధుడికైనా సరే అవతల ఉన్న వాడి సామర్థ్యం పైన చిన్న చూపు ఉండకూడదు. తానే గొప్ప అనే అహం భావం తగదు. ఒక్కసారి ఆ అహం ఆక్రమిస్తే మన చేత ఎంతటి పనినైనా చేయిస్తుంది. సరిగ్గా జజీరా విషయంలో జరిగింది ఇదే", అంటూ చెప్పటం ముగించాడు రుద్ర సముద్భవ.
అప్పుడే అక్కడొక విచిత్రం జరిగింది. అనిలుడి పై స్వారీ చేస్తూ వస్తోన్న విక్రమసింహుడు అంకిత, సంజయ్ ల కంటికి వేరే రూపంలో కనిపించాడు. అనిలుడు కూడా వృద్ధ అశ్వంలా మారిపోయాడు. అసలక్కడ ఏం జరుగుతోందో అంతుబట్టడం లేదు వాళ్లకు. కానీ కళ్ళ ముందే ఏదో చరిత్ర ఆవిష్కృతం అవుతోందని అర్థం అయ్యింది.
"అతనే సింహదత్తుడు. విక్రమసింహుడి తండ్రి", అన్నాడు రుద్రసముద్భవ.
"శంభలలోని ఈ ప్రాకారానికి విచ్చేసిన సింహళ ద్వీప రాజు. సింహళ అనగానే భూలోకంలోని రావణాసురుని లంక అనుకుని పొరబడతారేమో. అది కాదు. ఇందిరా పరిధి అనే గ్రహవాసి. మనది సౌర కుటుంబం. అలాంటి మరొక సౌర కుటుంబంలోని మరొక గ్రహం అది. మానవుల కంటే ఎన్నో వేల రెట్లు శక్తివంతులైన వారు నివసించే గ్రహం అది. అక్కడి నుండి శంభలకు ఎలా వచ్చాడో తెలీదు కానీ ఒక వృద్ధ అశ్వంపై మొట్టమొదటి సారి ప్రత్యక్షం అయ్యాడు. ఆ అశ్వం పైనే వచ్చాడేమోనని మా ఊహ. ఆ అశ్వాన్ని చూసిన అదృష్టవంతులలో నేనొకడ్ని. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అనిలుడ్ని శంభలకు బహుమతిగా ఇచ్చేసి తన దారిన తాను వెళ్లిపోయిన ధీశాలి సమర. అలాంటి సమర సింహ దత్తుడిని విడిచి వెళుతూ వెళుతూ కంట తడి పెట్టింది. అనిలుడ్ని ఇచ్చేటప్పుడు కూడా నవ్వుతూ ఉన్న సమర తన స్వామి సింహ దత్తుడిని విడిచిపెడుతున్నందుకు బాధపడింది.
సింహ దత్తుడి రాకతో శంభలకు పరాక్రమం పరిచయం అయింది. అంతవరకూ తెలియని యుద్ధ విద్యా మెళకువలెన్నో నేర్పాడు సింహ దత్తుడు. అతనిలో ఎన్నడూ లేశమాత్రమైన గర్వాన్ని నేను చూడలేదు. సింహ దత్తుడిని శంభలలోని విజయకుమారి అనే రాజపుత్రిక ఇష్టపడింది. విజయకుమారి శంభల రాజపుత్రిక. ఆమెకు వివాహం విధి లిఖితం కాదు. అందుకని శంభలలో అంజనము వేసి చూసారు. అప్పుడు అందులో అశ్వం పై వస్తున్న ఒక యోధుడి ఆకారంలో ఉన్న జ్వాల శంభల రాజులకూ, నాకూ ఆ రోజు కనిపించింది. సింహ దత్తుడి రాకను సూచిస్తూ మరెన్నో విషయాలు తెలిసాయి. సింహ దత్తుడి రాకతో విజయకుమారి జాతకం మారిపోయిందని జ్యోతిష్య శాస్త్రం తెలిసిన పండితుడు చెప్పాడు. అందుకే అందరి అంగీకారంతో సింహ దత్తుడితో విజయకుమారి వివాహం లాంఛనంగా జరిగింది.”
సింహ దత్తుడిలా కనిపిస్తోన్న విక్రమసింహుడిని, సమరలా అనిపిస్తోన్న అనిలుడిని చూస్తూ ఇదంతా వింటున్న అంకిత, సంజయ్ లకు ఇదంతా ఎలా సాధ్యం అన్న ప్రశ్న ఉదయించింది.
"మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే చేరాలి కదా. విక్రమసింహుడి పరాక్రమం నేర్చుకుంటే అబ్బిన విద్య కాదు. సింహ దత్తుడు పంచి ఇచ్చిన రక్తం. అనిలుడి స్వామి భక్తి అతని గొప్పతనం కాదు సమర నుండి వస్తోన్న పరంపర.
అందుకే వాళ్ళల్లో వీళ్ళు కనిపిస్తారు. అవి పోలికలు కావు. వారి బలమైన జీవితపు ముద్రలు", అంటూ
"ఎన్ని జన్మలెత్తినా పేరు, రూపం మారతాయేమో కానీ పరాక్రమం ఎక్కడికి పోతుంది?
విక్రమసింహుడు అన్నా...అభిజిత్ అన్నా అది సింహ దత్తుడి రక్తమే. సింహ దత్తుడి సంకల్పమే", అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు రుద్రసముద్భవ.

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ