Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - 6
#31
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 6



మిత్రులు... బంధువులు హరికృష్ణ, శివరామకృష్ణలు. శివరామకృష్ణగారి తల్లి హరికృష్ణగారి మేనత్త. పేరు శాంభవి. ఆమె బ్రతికి వున్నరోజుల్లో ఊరిజనం ఆమెను దేవతమ్మ అని పిలిచేవారు. కారణం... ఆమె తను... భర్త మహేశ్వర్... వారు తమ కుటుంబం మాత్రం బాగుండాలనే రకం కాదు. నా వూరు... నా వూరి జనం అంతా బాగుండాలని ఆశించేవారు. శాంభవి పేదలకు దానధర్మాలు చేసేది. ఎవరు ఏది అడిగినా లేదని ఆమె ఎన్నడూ తన జీవిత కాలంలో అనలేదు. అందుకే పేరు పెట్టారు వూరి జనం. ఆమె మేనమామ ప్రజాపతి తండ్రి కైలాసపతి. హరికృష్ణ తండ్రి నరసింహం, శివరామకృష్ణ తండ్రి మహేశ్వర్ బావమరుదులు.



మూడు కుటుంబాల ముందు తరం సభ్యులు... వూరిలో ఎంతో పేరు ప్రఖ్యాతులతో బ్రతికినవారు. సంపన్నులు.



శివరామకృష్ణ తండ్రి మహేశ్వర్. ప్రజాపతి తండ్రి కైలాసపతి. హరికృష్ణ తండ్రి నరసింహం. బంధుత్వాలకు అతీతంగా మంచి స్నేహితులు.



రోజుల్లో గూడూరు ప్రాంతంలో మైకా వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి. ప్రజాపతి తండ్రి కైలాసపతి వ్యాపారంలో ఎంతో సంపాదించాడు. అతన్ని చూచి శివరామకృష్ణ తండ్రి మహేశ్వర్ వున్న భూమిలో మైకా పడుతుందని తానూ కైలాసపతి వలే (అన్నగారు) లక్షలు సంపాదించాలనే ఆశతో కొంత భూమిని అమ్మి, వుంచుకొన్న భూమిలో అబ్రకం పడుతుందని సొరంగాలు త్రవ్వించాడు. అబ్రకం పడింది కానీ... క్వాలిటీ లేనిదైంది. విదేశీయులు... తరం తక్కువగా వున్న అబ్రకాన్ని కొనలేదు. దళారులు నూరు రూపాయలు విలువగల సరుకును పది పదిహేనుకు కొనేవారు.



మహేశ్వర్కు పంతం పెరిగి శివరామకృష్ణ (తనయుడు) అర్థాంగి శాంభవి చెప్పిన మాటలను వినక... మూర్ఖంగా అప్పులు చేసి మంచి అబ్రకాన్ని తన భూమిలో నుంచి తీయాలని గోతులు (ఎంతో లోతుగా) త్రవ్వించాడు. ఫలితం శూన్యం. మనశ్శాంతి నశించింది. మందుకు అలవాటు పడ్డాడు. వ్యాపారం పూర్తి నష్టానికి గురైంది. మనిషి అనారోగ్యం పాలైనాడు. భర్త రీతిగా తయారైనందుకు ఎంతో మంచిపేరున్న శాంభవి కూడా మనోవేదనతో మంచం పట్టింది. భర్త అంటే గౌరవం, ప్రేమ. ఎదిరించలేదు, విమర్శించలేదు. హృదయంలో భర్త విషయం ఎంతో ఆవేదన.



సమయంలో కుటుంబ గౌరవాన్ని వ్యక్తుల వ్యక్తిత్వాన్ని బాగా తెలిసిన కుటుంబం మద్రాస్ నుంచి ఎం. పాసై వచ్చిన శివరామకృష్ణకు పిల్లనిస్తామంటూ గూడూరుకు వచ్చారు. కుటుంబ పరిస్థితి సరిగాలేదని తెలిసీ వారు తమ బిడ్డను యిచ్చేదానికి ముందుకు వచ్చారంటే దానికి కారణం కాలేజీలో శివరామకృష్ణ... ఊర్మిళ కలిసి చదువుకొన్నారు. ప్రేమించుకొన్నారు, వివాహం చేసికోవాలని నిర్ణయించుకొన్నారు.



శివరామకృష్ణను ఊర్మిళ.... తన తల్లితండ్రులకు పరిచయం చేసిన రోజున.
"అవును అబ్బాయ్!.... పేరు... వూరు... కులం... గోత్రం అంతా బాగానే వుంది. ఆస్తిపాస్తులు ఏమాత్రమో చెప్పు!" అడిగాడు ఊర్మిళ తాత వెంకటరమణ.



అబ్రకం వ్యామోహంతో తన తండ్రి చేసిన నిర్వాకాన్ని... కలిగిన నష్టాన్ని గురించి వివరంగా చెప్పాడు శివరామకృష్ణ.



"తిండికి గుడ్డకు కొరతలేదండీ!.... ఎం., బి.ఇడి ఫస్ట్ క్లాసులో పాసయ్యాను. నామీద నాకు నమ్మకం వుంది. నా చూపు నాకంటే పేదవారి వైపే వుంటుంది కాని... మాకంటే గొప్పవారిపైన వుండదు. అది మంచిది కాదని మా తాతయ్యగారు చెబుతుండేవారు. మీ అమ్మాయికి కొరతా లేకుండా చూచుకోగలను. ఇద్దరం వివాహం చేసికోవాలని నిర్ణయించుకొన్నాము. మీరు మంచి మనస్సుతో మా వివాహాన్ని జరిపించండి. నాకు మీరు ఒక్క రూపాయి కూడా కట్నంగా ఇవ్వవద్దు" ఎంతో వినయంగా ఆత్మవిశ్వాసంతో శివరామకృష్ణ చెప్పాడు. అతని మాటల తీరు వెంకట రమణకు నచ్చింది.
ఊర్మిళ తండ్రి నాలుగేళ్ళ క్రితం... లారీ యాక్సిడెంట్లో చనిపోయాడు. వెంకటరమణ... తనకు ముఖ్యులైన వారిని ఇరువురిని గూడూరుకు పంపించి శివరామకృష్ణ కుటుంబ వివరాలను సేకరించాడు. వ్యక్తులు మద్రాస్కు తిరిగి వెళ్ళి...



"అన్నా!.... కుటుంబం బ్రతికి చెడ్డవారే కానీ... చెడి బ్రతికిన వారు కాదన్నా. అబ్బాయ్... అమ్మా నాన్నలకు ఎంతో గొప్ప పేరుంది. వ్యాపారంలో నష్టపోయారు. అంతే ఎవరినీ మోసం చేయలేదు. అన్యాయం చేయలేదు. నీతి నిజాయితీ గల మంచి కుటుంబం అన్నా!" చెప్పారు వారు.



వారి విశ్వాసనీయమైన మాటలు విని... వెంకటరమణగారు భార్య బాలమ్మా సమేతంగా గూడూరుకు వచ్చి మహేశ్వర్, శాంభవీలను కలసి తాము వచ్చిన విషయాన్ని వివరించారు.



తల్లి శాంభవికి శివరామకృష్ణ అంతకుముందే తన నిర్ణయాన్ని ఊర్మిళను గురించి చెప్పి వున్నందున దంపతులు శివరామకృష్ణ వివాహాన్ని ఊర్మిళతో జరిపించే దానికి అంగీకరించారు. రెండు నెలల తర్వాత శివరామకృష్ణ... ఊర్మిళల వివాహం జరిగింది. వారి వివాహం జరిగిన మూడునెలల తర్వాత హరికృష్ణకు, లావణ్యకు కైలాసపతి వివాహాన్ని జరిపించారు.
వారి వివాహం జరిగిన సంవత్సరం తర్వాత ప్రజాపతికి, ప్రణవికి వివాహం జరిగింది.
కైలాసపతి... శివరామకృష్ణకు, ఊర్మిళకు తనకు వున్న పలుకుబడితో హైకాలేజ్లో టీచర్ల ఉద్యోగాలు ఇప్పించాడు.



కోడలు ఇంటికి వచ్చినా... మహేశ్వర్ తన త్రాగుడు అలవాటును మానలేదు. భర్త వైఖరిలో మార్పులేనందుకు శాంభవి ఎంతగానో కుమిలి కుమిలి ఏడ్చేది. మనోవ్యధతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. కోడలి ఆదరాభిమానాలు, కొడుకు ప్రేమానాలురాగాలు, భర్త విషయంలో ఆమె హృదయం నిండా నిండిపోయిన ఆవేదనను తొలగించలేకపోయింది.
ఒకరోజు రాత్రి... శయనించిన శాంభవి... శాశ్వతంగా నిద్రపోయింది.



ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఊర్మిళ అత్త శాంభవి గదికి వెళ్ళింది. సాధారణంగా శాంభవి అందరికన్నా ముందులేచి... స్నానం చేసి... ఆరున్నర లోపల దీపారాధన వెలిగించి దైవానికి పాల నివేదన చేసి... పాలతో కాఫీ తయారుచేసి అందరికీ అందించేది మహాతల్లి.
కదలకుండా వెల్లికిలా పడుకొని కళ్ళు మూసుకొని వున్న శాంభవిని చూచి ఊర్మిళ ఆశ్చర్యపోయింది. తల వైపుకు నడిచి చేతిని ఆమె నొసటిపై వుంచింది. చల్లని స్పర్శకు ఆశ్చర్యపోయింది. "అత్తయ్యా!...." పిలిచింది ఒకటికి రెండుసార్లు.



శాంభవి నుండి జవాబు లేదు.
వేళ్ళను నాసికారంధ్రాల ముందు వుంచింది. ఊర్మిళకు విషయం అర్థం అయింది.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 5 - by k3vv3 - 05-12-2024, 02:28 PM



Users browsing this thread: 1 Guest(s)