02-12-2024, 01:38 PM
అదృష్టం అంటే నాదే
రచన: తాత మోహనకృష్ణ
సినిమా లో చూపించినట్టుగా స్టంట్స్ చెయ్యడమంటే చాలా ఇష్టం నాకు. ఈ మధ్య ఒక సినిమా చూసాను. హీరో బండి మీద స్పీడ్ గా వెళ్తూ...బైక్ హ్యాండిల్ వదిలేసి స్టంట్ చేస్తూ ఉంటాడు. అది చూసిన నాకు.. అలాగే చెయ్యాలని ఊపు వచ్చింది. మర్నాడు ట్రాఫిక్ లేని ప్లేస్ కు వెళ్ళి, నా సూపర్ బైక్ తో ఆ హీరో ను తల్చుకుని, స్టంట్ చేసాను. ముందు ఇసుక ఉండడం సరిగ్గా గమనించలేదు. ఒక పెద్ద శబ్దం..నేను కింద, బైక్ నా మీద. ఎవరో, దయ కలిగిన మనిషి అంబులెన్స్ కు కాల్ చేసాడు.
హాస్పిటల్ లో కళ్ళు తెరిచాను. అంతా బాగానే ఉంది..కానీ ఒక కాలు కదలట్లేదు. చాలా బాధ అనిపించింది. నా చుట్టూరా, నాలాంటి వాళ్ళు చాలా మంది బెడ్ మీద నొప్పి భరించలేక ఆర్తనాదాలు చేస్తున్నారు.
ఈలోపు డాక్టర్ రూప వస్తున్నారని ఎవరో అనుకుంటుండగా విన్నాను. పేరు బాగుంది. ఈలోపు కళ్ళు మూసుకుంటే, గతం గుర్తొచ్చింది.
*****
ఒరేయ్ బాబు! ఎందుకు రా అమ్మను రోజూ అరిపిస్తావు చెప్పు! బాగా చదువుకున్నావు..మంచి ఉద్యోగం వెతుక్కోవొచ్చుగా!"
"ఎందుకు టెన్షన్ అమ్మా! ఇంజనీర్ చదువు అయ్యింది కదా...కాస్త లైఫ్ ని ఎంజాయ్ చెయ్యనీ.."
"మీ నాన్న ఉండి ఉంటే, నీకు నాలుగు చివాట్లు పెట్టి...రెండు తగిలించి చెప్పేవారు...నువ్వేమో నాతో ఇలా మాట్లాడతావు"
"నా జాతకం లో అదృష్టం రాసి పెట్టి ఉంది. ఏమో, ఏ మహారాణి యో నాకోసం వస్తుందేమో...ఎంతైనా కొంచం అందగాడినే కదా!..అంతా నీ పోలికే కదా! అమ్మా!"
"అందం విషయం లో నువ్వు చెప్పింది నిజమే అనుకో...నేను అందంగా ఉంటాననే మీ నాన్నగారు గోడ దూకి మరీ నన్ను ప్రేమించారు..నీ అదృష్టం అంటావా...నాకు తెలియదు.."
"ఏమో...నాన్న గోడ దూకినట్టు...ఏ అమ్మాయైనా..నా మనసులోకి దూకుతుందేమో!..దెబ్బకి పెళ్ళి..లైఫ్ రెండూ సెటిల్ అయిపోతాయేమో!"
"భలే కలలు కంటున్నావు..మీ నాన్న కొన్న ఈ ఇల్లు..ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఉన్నాయి కనుక.. మనం ఇప్పటికి ఇలా బతికేస్తున్నాము"
"నో టెన్షన్...కష్టాలు అన్నీ తీరిపోతాయి...చూస్తూ ఉండు!" అన్నాడు వంశీ
*****
"హలో వంశీ గారు..అని అందమైన గొంతు నన్ను పిలిచినట్టు అనిపించి, కళ్ళు తెలిచాను"
ఎదురుగా స్టెతస్కోప్ వేసుకుని...ఒక అందమైన అమ్మాయి..తెల్ల కోట్ మీద 'రూప' అని పేరు కుట్టి ఉంది. రూప అంటే, తెల్లబడ్డ జుట్టు తో ఎవరో సీనియర్ డాక్టర్ అనుకున్నాను..ఇప్పుడే కాలేజీ నుంచి డాక్టర్ కోట్ వేసుకుని వచ్చినట్టుగా ఉంది ఈ అమ్మాయి..చూడగానే నచ్చేసింది..
"ఇతనికి ఎక్స్ –రే రాస్తున్నాను...అర్జెంటు గా తీయించండి"... అని ఆర్డర్ వేసింది డాక్టర్ రూప.
ఆమె గురించి ఆలోచిస్తూనే ఉన్నాను...వీల్ చైర్ లో నన్ను తీసుకుని వెళ్లి ఎక్స్ –రే తీయించారు.
నా వీల్ చైర్ తోస్తున్న బాయ్ తో కొంచం నవ్వుతూ మాటలు కలిపాను..చేతిలో ఒక వంద పెట్టి...టీ తాగమని చెప్పాను. పనిలో పని..డాక్టర్ గురించి అడిగాను..ఎలా చుస్తారని?
"డాక్టర్ రూప బాగా చూస్తారు...ఆవిడ రివ్యూస్ చూసారా? సూపర్ గా ఉంటాయి...ఉదయం నుంచి రాత్రి వరకు హాస్పిటల్ లోనే ఉంటారు. ఎప్పుడూ బిజీయే..మంచి హస్తవాసి గల డాక్టర్..."
నేను లెక్కలు వెయ్యడం మొదలుపెట్టాను..ఒక్క రోజు సంపాదనే చాలా ఎక్కువ...నా అదృష్టం ఈ 'రూప'లో వచ్చిందేమో! అయినా.. ఈ రూప నా రూపం చూసి ప్రేమిస్తుందా? నా వెర్రి గాని…
ఎక్స్ –రే రిపోర్ట్ వచ్చింది. నన్ను డాక్టర్ ని కలవమన్నారు...మా అమ్మకు చెబితే కంగారు పడుతుందని ఇంకా చెప్పలేదు. డాక్టర్ ని కలవడానికి నన్ను లోపలికి తీసుకుని వెళ్లారు...
"మీకు కాలు విరిగింది...ఆపరేషన్ చేసి కట్టు కడతాము..."
"ఓకే డాక్టర్...మీరే చేస్తారు కదా!"
"అవును నేనే చేస్తాను!"

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ