26-11-2024, 01:07 PM
శంభల రాజ్యం – 7
తురగ ప్రాకార చరిత్ర
తురగ ప్రాకారం చరిత్ర అంకిత, సంజయ్ ల కళ్ళ ఎదుటే ప్రారంభమయ్యింది.
శంభల రాజ్యంలో ఈ ప్రాకారం ఏర్పడక మునుపు 108 పర్వత శ్రేణులుండేవి. ఆ పర్వత శ్రేణులు ఒక్కొక్కటీ ఒక్కో శక్తి రూపానికి ప్రతీకగా శంభలలో చూసేవారు. ప్రతీ పర్వతమునందు ఒక చిద్గుహ ఉండేది. చిత్ అంటే తెలివి. చిదానందం అంటే జ్ఞానంలోనే ఆనందాన్ని పొందేవాడు అని అర్థం. చిద్గుహ అనగా జ్ఞానాన్ని ఇచ్చే క్షేత్రం లాంటిదన్నమాట. అంతవరకు శంభలలో ఆ 108 చిద్గుహలనూ సందర్శించినవారెవ్వరూ లేరు. అలా వెళ్ళటం కూడా శంభల రాజ్య నిబంధనలకు విరుద్ధం. ఒకే ఒక్క సందర్భంలో మాత్రమే శంభల రాజు అంగీకారంతో ఆ చిద్గుహలలో అడుగు పెట్టవచ్చు. అలాంటి సందర్భం రావటం కోసమే ఎదురుచూసేవాడు జజీరా.
జజీరా విక్రమసింహుడికి ప్రతీ విషయంలో సమవుజ్జీని అనుకుంటూ ఉండేవాడు.
శంభల రాజ్యంలోని యోధులలో జజీరాది ఒక విలక్షణమైన ఘట్టం. శంభల రాజ్యంలోనే పుట్టిన యోధుడు విక్రమసింహుడైతే ఐదు జన్మల తరువాత ఒక ద్వీపంలో పుట్టిన యోధుడు జజీరా. ఆ ద్వీపం పేరు శాంకరి. భూమిపై ఉన్న ఆ ద్వీపాన్ని జజీరా అని బాహ్య ప్రపంచంలో పిలుస్తారు. ఆ ద్వీపంపై ఎంతో మంది మనుషులు జన్మించినా ఎవ్వరికీ మాటలు రాలేదు. మామూలు మనుషులలానే అన్ని పనులూ చేస్తారు కానీ వారి కుటుంబాలలో జన్మించిన వారికి మాట్లాడే యోగాన్ని మాత్రం ఆ దేవుడు ఇవ్వలేదు. అలాంటి సమయంలో పుట్టినవాడే ఈ జజీరా. అతను జన్మించిన తరువాత అతనికి పేరు పెట్టేవాళ్ళు ఎవ్వరూ లేకపోవటంతో యవ్వన దశ వరకూ ఏ పేరూ లేకుండానే ఆ ద్వీపంలో బతికాడు అతను. ఇతని వల్లే ఆ ద్వీపం ఒకటుంది అన్న విషయం ప్రపంచానికి తెలిసొచ్చింది. ఒక అరబ్ ప్రయాణికుడు ఈ ద్వీపాన్ని కనుగొని జజీరా అనటంతో జజీరా నామధేయంగా స్థిరపడిపోయింది ఇతనికి. ఆ ద్వీపానికున్న శాంకరి అను పేరు పోయి ఇతగాడి వల్లే జజీరా అన్న కొత్త పేరొచ్చింది. ప్రపంచానికి ఈ ద్వీపం జజీరా గా ప్రసిద్ధికెక్కితే శాంకరిలోని వారికి మాత్రం ఇతడే జజీరా అయ్యాడు. శాంకరి ద్వీపంలో నివసించే ఈ జజీరా అమ్మ కోరిక మేరకు తన జీవితాన్ని తృణప్రాయంగా అర్పించి శంభల రాజ్యానికి యోధుడిగా వచ్చేసాడు.
జజీరా అలా శంభలకు యోధుడిగా వెళ్ళటం వలన ఆ శాంకరి ద్వీపంలోని తరువాతి తరం వాళ్లందరికీ మాటలొచ్చేస్తాయి. అలా వారికి శాప విమోచనం కలుగుతుంది. తరువాతి రోజుల్లో ప్రపంచానికి ఆ ద్వీపం పేరు శాంకరిగా వెలుగులోకొస్తుంది. జజీరా అన్న పేరు స్మృతిపథంలో నుండి కనుమరుగైపోతుంది.
శంభల రాజ్యంలోకి అడుగుపెట్టిన క్షణం నుండి జజీరా దృష్టి మొత్తం విక్రమసింహుడి పైనే. ఎందుకంటే శంభల రాజ్యంలో విక్రమసింహుడి గురించే ప్రతీ ఒక్కరూ మాట్లాడుకునేవారు.
విక్రమసింహుడికి అమ్మపైనున్న అమితమైన ప్రేమ, భక్తి గురించి చెప్పుకునేవాళ్ళు. విక్రమసింహుడితో ఏకాంతంగా గడపటానికి శంభల అందగత్తెలు అందరూ వెన్నెల ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవారు. విక్రమసింహుడి శౌర్యం కంటికి ఇంపుగా కనబడే వారి సొంపుగల సోయగాలని చూస్తూ జజీరా ఈర్ష్యపడేవాడు. విక్రమసింహుడికి తను ఎందులోనూ తక్కువ కాదన్న స్వాభిమానం తనని కుదురుగా ఉండనిచ్చేది కాదు. అలాంటి జజీరా వేసిన ఒక ఎత్తుగడ విక్రమసింహుడి జీవితాన్నే శాశ్వతంగా మార్చేసింది. తనకిష్టం ఉన్నా లేకపోయినా ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చింది.
ఇదంతా చూస్తూ విస్తుపోతున్న అంకిత, సంజయ్ లను రుద్రసముద్భవ ఒక ప్రశ్న వేసాడు.
"జజీరా ఎవరో తెలుసా?" అని అడిగాడు. ఎవరు ? అన్నట్టు సంశయంతో చూసారు వాళ్లిద్దరూ.
"ఇప్పుడు మీ భూలోకాన్ని వణికిస్తున్నాడే ఆ ఘోర కలి. వాడే. ఆ ఘోర కలిది ఇప్పుడు ఏడో జన్మ. వాడి అసలు రూపమే ఈ జజీరా", అన్నాడు ఆగ్రహజ్వాలలతో నిండిన కళ్ళతో చూస్తోన్న రుద్రసముద్భవ.

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ