Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక కథలు - అనంత
#21
 అటు పిమ్మట వరాంగి సంయాతి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహ మహోత్సవం నకు అనేకమంది రాజులు మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, కొండ జాతి వారు సురులు నరులు నానావిధ కింపురుషాది జాతులవారు హాజరయ్యారు. విందు వినోదాలతో అందరూ సందడి సందడిగా గడిపారు. 



వరాంగి తన భర్త సంయాతి మనసును పరిపూర్ణంగా తెలుసుకుంది. భర్తలోని యతిత్వానికి ఉన్న శక్తిని, పరాక్రమానికి ఉన్న శక్తిని సుపథాన అంచనా వేసింది. భర్త నిమిత్తం తమ నివాస మందిరానికి కూతవేటు దూరంలోనే చక్కని ఆశ్రమం నిర్మింపచేసింది ఆశ్రమంలో గరుడ గజ తురగ ఖడ్గ త్రిభుజ చతురస్రాది వివిధ ఆకారాలలో యజ్ఞ వేదికల ను నిర్మింపచేసింది. 



ఋషులు, మహర్షులు, రాజర్షులు బ్రహ్మర్షులు అక్కడ అనునిత్యం ఏదో ఒక యజ్ఞం చేసుకునే అవకాశాలు కల్పించింది. యాగశాలల నడుమ సాధు జంతువులు యథేచ్ఛగా తిరిగే ఏర్పాట్లు చేయించింది. 



 వరాంగి ఖాళీ సమయంలో సాధు జంతువు లయిన జింకలు, కుందేళ్ళ వెనుక పరుగులు తీసేది. సంయాతి మహారాజు ధర్మపత్ని ఆటపాటలను చూసి మురిసిపోయేవాడు. 



 సంయాతి మహారాజు తన దగ్గరకు ధర్మం కోసం వచ్చిన వారిని వరాంగి ముందు నిలబెట్టేవాడు. వరాంగి ధర్మం కోసం వచ్చిన వారిని ముందు యథేచ్ఛగా మాట్లాడనిచ్చేది. వారి మాటలను అనుసరించి తీర్పు చెప్పేది. తీర్పు చెప్పడం కొంచం కష్టం అనుకున్నప్పుడు పంచభూతాల సహాయం తీసుకునేది. ఆపై పంచభూతాల సాక్ష్యం తో ధర్మం చెప్పేది. 



దానితో ప్రజలు అధర్మం చేయడానికి భయపడేవారు. అబద్దాలు చెప్పాలంటే గజగజ వణికిపోయేవారు. ఎప్పుడన్నా పరుల మాయలో పడి అసత్యం చెబితే మహారాణి వరాంగి ముందు తమ ప్రాణాలు పోతాయనే అనుకునేవారు. 
 ఒకనాడు యమధర్మరాజు మారువేషంలో వరాంగి తీర్పు చెప్పే ప్రాంతానికి వచ్చాడు. యమధర్మ రాజును చిత్ర గుప్తుడు అనుసరించాడు. 



 వరాంగి న్యాయం కోసం వచ్చిన భార్య భర్తల మాటలను వింది. అనంతరం "మీలో ఎవరిది న్యాయ మార్గం?" అని వారినే అడిగింది. 



భర్త, "నాదే న్యాయం న్యాయం న్యాయం ముమ్మాటికీ న్యాయం నేను వేరు కాపురం పెట్టడం ముమ్మాటికీ న్యాయం " అని తనను తాను సమర్థించుకున్నాడు. 



భార్య "నాదే న్యాయం. ఇంత కాలం నేనింత న్యాయంగా ఉండటానికి నా భర్తే కారణం. అయితే నా భర్త ధన వ్యామోహం లో పడి నా అత్త మామలు మంచివారు కారని అబద్దాలు చెప్పమంటున్నాడు. " అని అంది.
 
 భార్యాభర్తల మాటలను విన్న వరాంగి కొద్ది సేపు ఆలోచించింది. అంత వరాంగి "మీలో ఎవరు నిజం చెబుతున్నారో పంచభూతాలే నిర్ణయిస్తాయి. "అని పంచభూతాలను ఆశ్రయించింది. 



తనని తాను అతిగా సమర్థించుకున్న భర్తని అగ్ని దేవుడు వెంటనే చుట్టు ముట్టాడు. వెంటనే అతగాడు తనదే తప్పని పెద్దగా అరిచాడు. తన తప్పుకు శిక్ష గా వెయ్యి మందికి అన్నదానం చేస్తాను. వెయ్యి మంది విద్యార్థులకు విద్యాదానం చేయిస్తాను. వెయ్యి మంది ముత్తైదువు లకు పసుపు కుంకుమలు దానం చేస్తాను. వందమంది వృద్దులకు సంవత్సరం పాటు అన్నదానాదులు చేస్తాను. ". అని అతగాడు పెద్దగా అరిచి చెప్పిన పిమ్మట అగ్ని దేవుడు శాంతించాడు. 



అలాగే మరో భార్యాభర్తల విషయంలో జల దేవత భార్యని శిక్షించింది. వరాంగికి పంచభూతాలు వశమైన తీరు చూసి యమ ధర్మరాజు మిక్కిలి సంతోషించాడు. 



 క్రిమి అనే అసుర రాజు సంయాతి మీద యుద్దం ప్రకటించాడు. అప్పుడు వరాంగి వాలఖిల్యులులాంటి లక్ష మంది సైనికులను క్రిమి మీదకు పంపింది. వారి చిత్ర విచిత్ర విన్యాస సమరం ముందు క్రిమి అసుర శక్తులన్నీ నశించాయి. క్రిమి యమపురికి చేరుకున్నాడు. సంయాతి మహారాజు ను విజయం వరించింది. 



సందర్భంగా సంయాతి మహారాజు తన ధర్మపత్ని వరాంగిని పలు రీతుల్లో సన్మానించాడు. కొంత కాలం తర్వాత వరాంగి పండంటి మగ శిశువు కు జన్మనిచ్చింది. శిశువుకు వశిష్టాది మహర్షులు అహంయాతి అని పేరు పెట్టారు. 



శుభం భూయాత్ 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - మాధవి - by k3vv3 - 26-11-2024, 01:04 PM



Users browsing this thread: 1 Guest(s)