Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక కథలు - అనంత
#20
వరాంగి


[Image: image-2024-11-26-130020347.png]

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు



దృషద్వాత దేశమును దృషద్వాత మహారాజు పరి పాలిస్తున్నాడు. దృషద్వతి సరస్వతీ నదుల పుణ్య జల ప్రభావంతో దృషద్వాత దేశము నిరంతరం సస్యశ్యా మలంగా ఉండేది. పవిత్ర పర్వతాల నుండి ఉద్భవించిన దృషద్వతి నదిలో స్నానాలు ఆచరించే 60 వేలమంది వాలఖిల్యులకు తదితర దేవతలకు దృషద్వాత దేశమును సందర్శిస్తేనే, వారి మనసు ప్రశాంతంగా ఉండేది.. 



దృషద్వాత దేశములో సుగంధ వాసనలు ఇచ్చే దృషదులు అనేకం ఉండేవి. దృషదుల సువాసన సుర లోక సుగంధ సుమ వాసన లకన్నా మిన్నగా ఉండేది. సువాసనలను ఆస్వాదించడానికి దేవతలు దృషద్వాత దేశమునకు తప్పక వచ్చేవారు. కౌశిక దృషద్వతి సంగమాన స్నానాలు ఆచరించి మరీ దృషద్వాత దేశమునకు వచ్చేవారు. 



 దృషద్వాత దేశమునకు వచ్చిన సురులను, యక్షులను, కిన్నెరులను, కింపురుషులను తదితరులు అందరినీ దృషద్వాత మహారాజు తగిన విధంగా సత్కరించి పంపేవాడు. అలాంటి మహోన్నత దృషద్వాత మహారాజు కు వరాంగి అనే కుమార్తె కలదు. 



ఆమె బుడిబుడి అడుగులు వేసే సమయంలోనే దృషద్వతీ నది దగ్గర ఉన్న యజ్ఞ వేదికల చుట్టూ కిలకిల నవ్వులతో పరుగులు తీసేది. 



వరాంగి చిన్నతనమునుండి దృషద్వతి సరస్వతీ నదులను క్రమం తప్పకుండా పూజించేది. రెండు నదులలో దిగి గొంతు లోతు నీళ్ళలో ఉండి " ఓం విష్ణు దేవాయ, ఓం మహేశ్వరాయ, ఓం బ్రహ్మ దేవాయ నమో నమః" అంటూ త్రిమూర్తులను పూజించేది. దృషద్వతీ నది కి వచ్చిన 60 వేలమంది వాలఖిల్యులను పలురీతులలో స్తుతించేది. 



అలాగే భూమి మీద వంటి కాలి మీద నిలబడి త్రిమూర్తులను ధ్యానించేది. యాగాగ్నులలో నిలబడి త్రిమూర్తులను ధ్యానించేది. వాయు దేవుని వలయంలో నిలబడి త్రిమూర్తులను ధ్యానించేది. తన శరీరమును తేలిక చేసుకుని ఆకాశ వలయాన నిలబడి త్రిమూర్తులను ధ్యానించేది. వాలఖిల్యుల వరప్రసాదాన వరాంగి తనువుకు మహా శక్తి వచ్చిందని అందరూ అనుకునేవారు. 



 వరాంగి ధ్యానాన్ని గమనించిన పంచభూతాలు ఆమె శరీరానికి దేనినైనా తట్టుకునే సామర్థ్యం ను, 
ఆమె తన శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి అంటే అలా ఉంచుకునే శక్తిని ప్రసాదించారు. వరాంగి కొంత కాలం వాలఖిల్యులు లాగా బొటనవేలంత ప్రమాణంలో మారి త్రిమూర్తులను ధ్యానిస్తూ తపస్సు చేసింది. 



 ప్రతిష్టాన పురాన్ని రాజధాని గా చేసుకుని పరిపాలన చేసే ప్రాచీన్వంతునికి అశ్మకికి పుట్టిన సంయాతి యువరాజు సమస్త రాజోచిత విద్యలలో మహా నైపుణ్యం సంపాదించాడు. తల్లి అశ్మకి మాటలను అనుసరించి కొండకోనల సంరక్షణలో ప్రత్యేక శ్రద్దను ఉంచాడు. తన భక్తి శ్రద్ధలతో మహర్షుల బ్రహ్మర్షుల మన్ననలను పొందాడు. 



 ఒకనాడు వశిష్ట మహర్షి అశ్మకి ప్రాచీన్వంతులను కలిసి, "రాజ దంపతులార! మీ తనయుడు మరియు నా ప్రియ శిష్యుడు అయిన సంయాతి సమస్త యతి లక్షణాలతో సంయాతిగ విశిష్ట కీర్తిని ఆర్జిస్తున్నాడు. అంతేగాక కొండకోనల సంరక్షణ లో అతి, అంబల వంటి అసుర రాజులను ఓడించి ప్రజారక్షకుడుగ ప్రఖ్యాతిని ఆర్జించాడు. అలాంటి సంయాతి యువరాజు కు దృషద్వాత మహారాజు కుమార్తె శుభాంగి ని ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.
 
శుభాంగి సామాన్య మగువ కాదు. పంచభూతాలను తన అధీనంలో ఉంచుకున్న మహా మహిళ. అలాంటి మగువ సంయాతి ధర్మపత్ని అయితే అవని మీద అబద్దానికి పుట్టగతులు ఉండవు. అవని మీద అన్యాయం అవాక్కుగా మిగిలిపోతుంది. ఇక మహి పై అబద్దం బద్దకంలో పడి మరణిస్తుంది. " అని అన్నాడు. 



 వశిష్ట మహర్షి మాటలను విన్న రాజ దంపతులు మిక్కిలి సంతోషించారు. వశిష్ట మహర్షి నే పెళ్ళి పెద్దను చేసారు. రాజ దంపతుల విన్నపానుసారం వశిష్ట మహర్షి దృషద్వాత మహారాజు ను కలిసాడు. 



దృషద్వాత మహారాజు సంయాతిని అల్లుడు గా చేసుకోవడానికి మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా తన అంగీకారాన్ని తెలిపాడు. అయితే తన కుమార్తె వరాంగి అభిప్రాయం కూడా తెలుసుకోవాలన్నాడు. 



అంత దృషద్వాత మహారాజు తన కుమార్తె వరాంగి ప్రత్యేక మందిరానికి వెళ్ళాడు. సంయాతి గురించి చెప్పాడు. ముఖ్యంగా సంయాతి మాతృమూర్తి అశ్మకి కొండ కోనలను సంరక్షించే విధానం గురించి క్షుణ్ణంగా చెప్పాడు. అంతేగాక అశ్మకి తమకు దూరపు బంధువు కూడా అవుతుంది అని చెప్పాడు. 



 వరాంగి సంయాతి చిత్ర పటం చూసింది. అనంతరం తన అంగీకారాన్ని తెలిపింది. అలాగే సంయాతి కూడా వరాంగి చిత్ర పటం చూసి, వరాంగి గురించి పెద్దలు చెప్పిందంత విన్న పిదప తన అంగీకారం తెలిపాడు. 



 వశిష్ట మహర్షి ముందుగా మంచి శుభ ముహూర్తాన సంయాతికి పట్టాభిషేకం జరిపించాడు. సంయాతి పట్టాభిషేక మహోత్సవానికి దృషద్వాత మహారాజు తదితరులందరూ హాజరయ్యారు. వేడుకలకు వరాంగికూడ వచ్చింది. 



 వెయ్యి మంది అంగుష్టాకారులతో అవ్యక్తానంద నృత్యం చేయించింది. అగ్ని గుండాలలో, జల వలయాలలో, వాయు వలయాలలో, భూవలయాలలో, గగన వలయాలలో వివిధ వర్ణాల దేహధారులను ఉంచి నృత్యం చేయించింది. వరాంగి చేయించిన నృత్యాలు అందరిని ఆకర్షించాయి. 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - మాధవి - by k3vv3 - 26-11-2024, 01:01 PM



Users browsing this thread: 1 Guest(s)