Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - 6
#27
అందరూ హాల్లోకి ప్రవేశించారు. ఈశ్వర్ రెస్టు రూము వైపు వెళ్లాడు.
"బావా! ఊర్మిళా!... ముందు స్నానం చేయండి. ఎప్పుడు ఏం తిన్నారో ఏమో!.... భోజనం చేస్తూ మాట్లాడుకొందాం" అన్నాడు హరికృష్ణ.
"అలాగేరా!...." చెప్పాడు శివరామకృష్ణ.
"వదినా!.... నీకోడలు..." తన కూతురు శార్వరిని చూపి నవ్వుతూ చెప్పింది లావణ్య.
"నమస్తే అత్తయ్యా!" చిరునవ్వుతో చెప్పింది శార్వరి.
"ఇలారా!..." పిలిచింది ఊర్మిళ.
శార్వరి ఆమెను సమీపించింది.
"శారూ!... ఎంతగా ఎదిగిపోయావే.. ఏం చదువుతున్నావ్!"
"బి.ఎస్సీ ఫైనల్ ఇయర్"
"ఎక్కడ?"
"హైదరాబాద్లో"
"ఈశ్వర్ ఉద్యోగమూ అక్కడేగా!"
"అవును అత్తయ్యా!...."
రెస్టురూమ్కు వెళ్ళి హీటర్ ఆన్ చేసి ఈశ్వర్ హాల్లోకి వచ్చాడు.
"మామయ్యా!.... మీరు స్నానానికి రండి..."
"వెళ్ళరా... స్నానం చేసిరా!..." అన్నాడు హరికృష్ణ.
"అలాగేరా!..."
ఈశ్వర్ వెంట శివరామకృష్ణ రెస్టు రూమ్ వైపుకు నడిచాడు.
సోపు... టవల్ శివరామకృష్ణకు అందించి ఈశ్వర్ హాల్లోకి వచ్చాడు.
"అత్తయ్యా!.... మీరూ రండి. నీళ్ళు కాగాయి. స్నానం చేద్దురుగాని!...." చెప్పింది శార్వరి.
ఊర్మిళ... శార్వరి వెనకాల ఆమె గదిలోనికి వెళ్ళింది.
ఈశ్వర్... విష్ణు ప్రక్కన కూర్చున్నాడు.
"విష్ణూ! మామయ్యగారు రావడంతోనే... నీవూ స్నానం చేస్తావుగా!"
"అవును బావా!..." కొన్ని క్షణాల తర్వాత అడిగాడు విష్ణు.
"బావా!"
"ఏమిటి విష్ణు"
"మీరు ప్రాక్టీస్ ప్రారంభించారుగా!..."
"... రెండేళ్ళయింది. శార్వరి హైదరాబాదులో చదువుతుందిగా అందువల్ల అక్కడ సీనియర్ లాయర్గారి వద్ద ప్రస్తుతం పనిచేస్తున్నాను. మరో మూడునెలల్లో శార్వరి బి.ఎస్సీ పూర్తి అవుతుంది అప్పుడు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ ప్రారంభిస్తాను."
"శార్వరి బి.ఎస్సీ తర్వాత ఏం చేయాలనుకొంటూవుంది."
"ఎం.బి.బి.యస్ చేయాలని తన వుద్దేశ్యం..."
"ఓహో తనకు డాక్టర్ కావాలనే ఆశ అన్నమాట."
"అవును విష్ణు"
"బావా!... మీ అన్నయ్య నా పెదబావగారు... యు.ఎస్లో వున్నారుగా!... అక్కడికి పోవచ్చుగా!..."
"అమ్మానాన్నలకు ఇష్టం లేదు. వారికి ఇష్టంకాని పనిని నేనూ, శారూ... చేయము విష్ణు."
"అవును మామయ్యా, అత్తయ్యా చాలా మంచివారు. వారిని మీరు విషయంలో ఎప్పుడూ నొప్పించకండి..."
"విష్ణు! ఎంత గొప్పగా మాట్లాడుతున్నావురా!..."
"అంతా మీరు నా చిన్నప్పుడు నాకు ఇచ్చిన శిక్షణ. మరిచిపోలేదు, పాటించాను. నా గురువులు మీరే!..." నవ్వాడు విష్ణు.
శార్వరి హాల్లోకి వచ్చింది.
"అరుగో మామయ్యగారు వచ్చారు. అన్నా!.... విష్ణును త్వరగా స్నానం చేసి రమ్మను" అంది శార్వరి.
"ఏం నీవే వాడికి చెప్పవచ్చుగా!" నవ్వుతూ అన్నాడు ఈశ్వర్.
శార్వరి అన్నను సమీపించి తలను వంచి అతని చెవి దగ్గర వుంచి... "నీ కన్నా ఎత్తుగా ఎదిగాడు. అతనికి నేను ఏమని చెప్పాలి!..." అంది.
"చిన్నప్పుడు ఏమని పిలిచేదానివి!..."
"విష్ణు అని..."
"ఇప్పుడూ అలాగే పిలువు..." నవ్వాడు ఈశ్వర్.
"బావా! నా గురించి శార్వరి నీతో ఏదో చెబుతూ వుంది కదూ!..." అడిగాడు విష్ణు.
"అవునురా!..."
"ఏమడిగింది?"
శార్వరి తన చేతితో ఈశ్వర్ నోరు మూసింది.
కొన్ని క్షణాలు గడిచాయి.
"ఏం బావా!... ఏం మాట్లాడవు?" అడిగాడు విష్ణు.
"అమ్మ అన్నీ భోజనానికి సిద్ధం చేసింది. మీరు వెళ్ళి స్నానం చేస్తే అందరం కలిసి భోంచేయవచ్చు" అంది శార్వరి.
"అలాగా!.." అన్నాడు విష్ణు. క్షణం తర్వాత "శార్వరీ! బావ ఇక్కడ లేడా!...."
"ఆఁ ఇక్కడే వున్నారా!... పద స్నానం చేద్దువుగాని" శార్వరి చేతిని తన చేతితో ప్రక్కకు నెట్టి చెప్పాడు ఈశ్వర్.
విష్ణు లేచి నిలబడ్డాడు.
"శారూ!.... విష్ణును రెస్టురూమ్ దాకా తీసుకొని వెళ్ళు.. టవల్, సోప్ ఇచ్చిరా!" చెప్పాడు ఈశ్వర్.
విష్ణు నేలకు పూనిన కర్ర చివరను తన చేతిలోనికి తీసుకొంది. "జాగ్రత్తగా రండి" అంది శార్వరి.
విష్ణు ఆమెను అనుసరించాడు. ఇరువురూ ఈశ్వర్ రెస్టు రూమ్ను సమీపించారు.
చేతిలోని కర్రను వదలి శార్వరి రెస్టురూం తలుపును తెరిచింది. బకెట్లో వేడినీళ్ళు నింపింది. స్టీల్రాడ్ పై టవల్ను వుంచింది.
వాకిట నిలబడివున్న విష్ణును చూచింది. కళ్ళు లేవు... కానీ బాధ అతని ముఖంలో కనిపించలేదు. ప్రశాంతంగా చిరునవ్వుతో నిలబడి వున్నాడు.
"శార్వరీ!... ఇక నీవు వెళ్ళు... నేను చూచుకొంటాను."
"ఎలా?..."
"మనోనేత్రంతో....!" నవ్వాడు విష్ణు.
శార్వరి గదినుండి బయటికి వచ్చింది. కర్ర సాయంతో విష్ణు తడుతూ రెస్టురూంలోకి ప్రవేశించాడు.
"థ్యాంక్యూ శార్వరి!"
"నో...నో... నేనేం చేశానని!"
"గొప్పవారు ఇతరులకు చేసిన దాన్ని గుర్తుపెట్టుకోరు!"
"నేను మీరంటున్నంత గొప్పదాన్ని కాను. మీరు మా బంధువులు... మా ఇంటికి వచ్చారు. అన్నయ్య చెప్పాడు. వాడు చెప్పినట్లు చేశాను. అది నా ధర్మం. అంతే! మీరు నాకు ధన్యవాదాలు చెప్పవలసినంత విశేషమైన పనిని నేను ఏమీ చేయలేదు."
"ఓకే... ఓకే!.." నవ్వుతూ తలుపు మూసుకొన్నాడు విష్ణు.
తలుపు దగ్గరకు జరిగి... "బకెట్కు పైన గోడకున్న రాడ్పై టవల్ దానికింద... సోప్ కిట్లో సబ్బు వున్నాయి" చెప్పింది శార్వరి.
"చూచాను... అదే తాకి చూచాను" అన్నాడు విష్ణు.
శార్వరి తన అన్నయ్య దగ్గరకు వచ్చింది.
"పాపం అన్నయ్యా!..."
"ఏందిరా పాపం!..."
"విష్ణు విషయంలో!...."
ఈశ్వర్ నిట్టూర్చి... "వాడి విషయంలోనా!... అవును..."
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 4 - by k3vv3 - 21-11-2024, 01:06 PM



Users browsing this thread: 1 Guest(s)