Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - 6
#26
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 5




"హలో!...." మ్రోగిన సెల్ఫోన్ చేతికి తీసుకొని అడిగాడు హరికృష్ణ.
"హలో... హరీ!.... నేనురా!.... శివ..."
"ఒరేయ్!... శివా!... నీవా!.... గొంతు మారిందేం!...."
"అవునురా... వయస్సు అవుతూ వుందిగా!...."
"వస్తానని జాబు వ్రాశావు... ఎప్పుడు వస్తావ్?"
"అరగంటలో మన వూరి స్టేషన్లో దిగుతా!.... నేను ఒక్కడినే రావడం లేదు. మీ చెల్లెలు, విష్ణు.... నాతో వస్తానని బయలుదేరారు."
"అలాగా!... చాలా సంతోషం రా!.... నేను స్టేషన్కి వస్తాను."
"సరే కట్ చేస్తున్నా!..."
"అలాగే!..."
వంటింట్లో నుంచి వచ్చిన లావణ్య.
"ఎవరండీ ఫోన్ చేసింది!" అడిగింది.
"మీ అన్నయ్య శివ... ఊర్మిళా, విష్ణు మరో అరగంటలో వస్తున్నారట..."
"అలాగా!..."
"అవును లావణ్యా! నేను స్టేషన్కు వెళ్ళి వారిని పిలుచుకొస్తాను... వాడు వూరికి వచ్చిఎనిమిదేళ్ళయిందిగా!..."
"అవును... నాకూ పని పూర్తయింది. నేనూ వస్తానండి స్టేషన్కు..."
"అలాగే!.... ఆఁ... పిల్లలేరి?..."
"శివాలయానికి వెళ్ళారు. యీ పాటికి తిరిగి వస్తూ వుంటారు."
వీధి తలుపు తెరిచిన శబ్దం విని అటువైపు చూచింది లావణ్య.
ఈశ్వర్, శార్వరీలు నవ్వుకొంటూ లోనికి వచ్చారు.
"ఈశ్వర్!.... మీ శివ మామయ్య, అత్తయ్యలు వస్తున్నారు" చెప్పింది లావణ్య.
"ఎప్పుడమ్మా?..."
"మరో అరగంటలో!..." చెప్పాడు హరికృష్ణ.
"నేను నాన్న స్టేషన్కు వెళ్ళి వాళ్ళను రిసీవ్ చేసికొని వస్తాం. మీరు ఇంట్లో వుండండి."
"అలాగే అమ్మా!...." అంది శార్వరి.
"నాన్నా!.... నేను వెళ్ళిరానా!" అడిగాడు ఈశ్వర్.
"వద్దు నాన్నా!.... నేను వెళితేనే మీ మామయ్య ఆనందిస్తాడు. ఎనిమిదేళ్ళ తర్వాత వస్తున్నారు" అనునయంగా చెప్పాడు హరికృష్ణ.
"వస్తున్నారు అంటే!" అడిగాడు ఈశ్వర్.
"మీ అత్తయ్య ఊర్మిళ, విష్ణు కూడా వస్తున్నారట. ఈశ్వర్!... అందువల్ల మేమిద్దరం స్టేషన్కు వెళ్ళి వారితో వస్తాం" చెప్పింది లావణ్య.
"అలాగే అమ్మా! వెళ్ళిరండి..."
"ఏమండి... ఇక మనం బయలుదేరుదామా!..."
" పద..."
భార్యాభర్తలు కార్లో కూర్చున్నారు. వరండా వరకూ వచ్చి ఈశ్వర్, శార్వరీలు టాటా చెప్పారు. హరికృష్ణ కారును స్టార్ట్ చేశాడు. కారు వీధిలో ప్రవేశిందింది.
"ఏమండీ!..."
"చెప్పు లావణ్యా!..."
"పాపం విష్ణు... వాడికి చూపు రాదు కదూ!..."
"రాదూ అని మనం నిర్ధారణగా ఎలా చెప్పగలం. దైవం తలచుకుంటే... కానిది... లేనిది... అనేవి వుంటాయా లావణ్యా!..."
"మీకు దైవం మీద చాలా నమ్మకం కదండీ!..."
"నీకు లేదా!...."
"రామ రామ ఎంతమాట!... లేదని ఎలా అనగలనండీ!..."
"అయితే... విష్ణుకు కళ్ళు రావాలి స్వామీ... వాడు మమ్మల్నందరినీ నీవు సృష్టించిన ప్రపంచంలోని అన్ని అందాలను చూచి ఆనందించాలని కోరుకో. వాడు గుర్తుకు వచ్చినప్పుడల్లా నేను సర్వేశ్వరుని అదే కోరుకుంటాను."
"మీ నమ్మకమే.... వాడికి శ్రీరామరక్ష కావాలి."
"నీవూ నాలా కోరితే... దేవుడు విష్ణును తప్పక కరుణిస్తాడు." చిరునవ్వుతో చెప్పాడు హరికృష్ణ.
"తప్పక నిత్యం కోరుకుంటానండి. వారు వైజాగ్ వెళ్ళిపోయి ఇరవై సంవత్సరాలు. అప్పటికి వాడి వయస్సు మూడేళ్ళు. అంటే విష్ణు వయస్సు ఇప్పుడు ఇరవై మూడు. శార్వ కన్నా మూడేళ్ళు పెద్దవాడు."
"అవును లెక్కల్లో నీవు జీనియస్ లావణ్యా!" నవ్వాడు హరికృష్ణ.
"మీరేగా నేర్పారు" చిరునవ్వుతో భర్త ముఖంలోకి చూచింది లావణ్య.
వారి కారు స్టేషన్ ఆవరణంలో ప్రవేశించింది. పార్కింగ్ స్థలంలో కారును ఆపి... రెండు ప్లాట్ఫాం టిక్కెట్లను కొన్నాడు హరికృష్ణ. ఇరువురూ స్టేషన్లో ప్రవేశించారు.
జమ్ముతావి ఎక్స్ ప్రెస్ ఐదుగంటలు ఆలస్యంగా వచ్చింది. అనౌన్స్ మెంటు విని హరికృష్ణ, లావణ్యలు ప్లాట్ఫాంను చేరారు. రైలు వచ్చి ఆగింది.
శివరామకృష్ణ, ఊర్మిళ, విష్ణు కంపార్టుమెంటు నుండి దిగారు. ముగ్గురిని చూడగానే హరికృష్ణ లావణ్యలు నవ్వుతూ వారిని సమీపించారు. శివరామకృష్ణ చిరునవ్వుతో హరికృష్ణను కౌగలించుకొన్నాడు. లావణ్య ఊర్మిళ చేతులు పట్టుకొని... "వదినా!.... బాగున్నావా!..." ప్రీతిగా అడిగింది.
"సంవత్సరం రోజులుగా నిన్ను చూడాలనుకొన్న నా ప్రయత్నం... ఈనాటికి ఫలించిందిరా!..." నవ్వుతూ చెప్పాడు శివరామకృష్ణ.
చేతికర్ర సాయంతో విష్ణు హరికృష్ణను సమీపించాడు. ఆరు అడుగుల ఎత్తు... తెల్లని దేహచ్ఛాయ, గుండ్రటి ముఖం, ఒత్తైన జుట్టు అన్నీ ఎంతో గొప్పగా వున్నా దృష్టిలేని కారణంగా విష్ణు ఎవరినీ దేనినీ చూడలేని పరిస్థితి.
"మామయ్యా!.... అత్తయ్యా!.... బాగున్నారా!..." నవ్వుతూ అడిగాడు విష్ణు.
విష్ణు భుజంపై చెయ్యివేసి "మేమంతా బాగున్నాము. నీవూ వీళ్లతో రావడం నాకు ఎంతో సంతోషంరా!..." నవ్వుతూ చెప్పాడు హరికృష్ణ.
"సరే... ఇక పదండి... వదినా!... అన్నయ్యా!.... ఇంటికి వెళ్ళి అన్ని విషయాలూ భోంచేస్తూ మాట్లాడుకొందాం" అంది లావణ్య.
"విష్ణు చేతిని పట్టుకొని... విష్ణు జాగ్రత్తగా నడు" అంది.
ఐదుగురూ స్టేషన్ బయటికి వచ్చారు. కార్లో కూర్చున్నారు. పదిహేను నిముషాల్లో హరికృష్ణ కారును పోర్టికోలో ఆపాడు. అందరూ దిగారు.
వారి రాకకోసం... ఎదురు చూస్తున్న ఈశ్వర్, శార్వరీలు వారిని సమీపించారు. ఒకరినొకరు అభిమానపూర్వక పలకరింపులతో నవ్వుకొన్నారు.
ఈశ్వర్, విష్ణును సమీపించి అతని చేతిని తన చేతిలోనికి తీసుకొని... "విష్ణూ!"
"ఎవరూ?..."
"నేనురా... ఈశ్వర్ని..."
"... బావా... మీరా!... గొంతు విని చాలాకాలం అయిందిగా! వెంటనే గుర్తుపట్టలేకపోయాను బావా!... సారీ!..."
"రా లోనికి వెళదాం..."
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 4 - by k3vv3 - 21-11-2024, 01:05 PM



Users browsing this thread: 2 Guest(s)