21-11-2024, 12:59 PM
బర్త్డే విషెస్
రచన: తాత మోహనకృష్ణ
జానకి ఉదయం లేచిన వెంటనే, వాట్సాప్ చూడడం తనకి ఒక రొటీన్. ఈ వాట్సాప్ గ్రూప్స్ కి బొత్తిగా దూరంగా ఉంటుంది జానకి. ఏదైనా, డైరెక్ట్ గా మెసేజ్ చెయ్యడమే ఇష్టం. జానకి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నా..జయ, జయంతి ఊరిలోనే ఉంటారు. వాట్సాప్ లో విషెస్ పెట్టడం తప్పితే, ఫోన్ చేసి విష్ చేసుకోవడం తక్కువే.
జీవితం ఇలాగ సాగిపోతుంది. జయ పుట్టిన రోజు వచ్చింది. రెండు నెలల క్రితం తన పుట్టిన రోజు కు ఫోన్ చెయ్యలేదు జయ. కనీసం మెసేజ్ కుడా పెట్టలేదు. ఇప్పుడు దాని పుట్టిన రోజు కు విష్ చెయ్యకూడదని మొండిగా కూర్చుంది జానకి. ఈ లోపు, లోపల నుంచి భర్త రామ్ వచ్చాడు.
"ఏమిటి జానకి డియర్! అలా ఉన్నావు? ఏమైంది?"
"మా ఫ్రెండ్ కి బర్త్ డే విషెస్ పెట్టాలా వద్దా? అని ఆలోచిస్తున్నాను...నా బర్త్ డే కు అది నాకు విష్ చెయ్యలేదు!"
"పెట్టు జానకి...అప్పుడు తను ఎంత బిజీ గా ఉందో పాపం!"
"మీరు చెబుతున్నారు కాబట్టి...విషెస్ పెడుతున్నాను.."
భర్త చెప్పగా, జయ కు బర్త్ డే విషెస్ పెట్టింది జానకి...దానికి బదులుగా సమాధానం రాలేదు. అది అంతే!..రిప్లై చెయ్యదని నొచ్చుకుంది జానకి.
కొంతసేపటికి ..జానకి ఇంకో ఫ్రెండ్ జయంతి, జానకి ఇంటికి వచ్చింది..
"ఏమిటే జయంతి! ఇలా వచ్చావు చాలా రోజులకి? కాఫీ తెమ్మంటావా?"
"అదేమీ వద్దు గానీ...ముందు బయటకు వెళ్దాము పదా!"
జయంతి కార్ రివర్స్ చేసి..ఇద్దరూ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యారు. కొంత దూరం జర్నీ చేసిన తర్వాత...
"ఇదేమిటే! ఇక్కడకు తీసుకొస్తున్నావు? నాకు తెలుసు లే! జయ నాతో ఏమి చెప్పకుండా..నిన్ను తన బర్త్డే పార్టీ కి ఇన్వైట్ చేసింది కదూ! నేను దాని ఇంటికి రాను. అది నా బర్త్డే కు విష్ చెయ్యలేదు!"
"మాట్లాడకుండా నా తో రా జానకి!"
మాటల్లోనే, జయ ఇంటికి చేరుకున్నారు ఇద్దరూ. లోపలికి వెళ్ళగానే, గోడ మీద జయ ఫోటో ఉంది..దానికి దండ కుడా వేసి ఉంది..విషయం గ్రహించిన జానకి..చాలా బాధ పడింది...తను ప్రవర్తించిన తీరుకు సిగ్గు పడింది. ఈలోపు జయ తల్లి లోపల నుంచి వచ్చింది...
"ఈ రోజు జయ పుట్టిన రోజు..మా అమ్మాయి ఉండి ఉంటే…” అని కన్నీరు పెట్టుకుంది..
"ఊరుకోండి ఆంటీ! మన చేతిలో ఏమీ లేదు..అంతా విధి లీల, ఇదిగోండి...ఇన్సూరెన్స్ నుంచి వచ్చిన చెక్కు...!"
"నువ్వు చేసిన సహాయాన్ని మరచిపోలేను...జయంతి"
"పర్వాలేదు ఆంటీ...మీకు మటుకు ఎవరు ఉన్నారు చెప్పండి..!"
"మరిచాను..ఇదిగోండి జయ ఫోన్...రిపేర్ చేయించి తెచ్చాను.."
జానకి పరిస్థితి గమనించిన జయంతి...వెంటనే ఇద్దరూ, అక్కడ నుంచి బయల్దేరి, జయంతి ఇంటికి చేరుకున్నారు.
"ఏమే జానకి! ఏమిటే ఇది..నీకెందుకే అంత పంతం..జయ నీకు విష్ చెయ్యకపోతే..దూరం పెడతావా?..నేను నీకు విష్ చెయ్యలేదని నాతో కుడా నువ్వు పంతంగానే ఉన్నావు..నాకూ ఫోన్ చెయ్యడం మానేసావు. తర్వాత నేను నీకు చెప్పే పరిస్థితి లో లేను. అందుకే నీకు మా విషయాలు ఏమీ తెలియవు"
"చచ్చిన పాముని ఇంకా ఎందుకు చంపుతావు చెప్పు! ఇప్పటికే నేను చాలా బాధ పడుతున్నాను. అసలు జరిగినది ఏమిటో ఇప్పుడైనా చెబుతావా?...అసలు జయ ఎలా చనిపోయింది?"
"సరిగ్గా రెండు నెలల క్రితం..అంటే నీ పుట్టిన రోజు కు ముందు రోజు... జయ మార్కెట్ నుంచి వస్తున్నప్పుడు..దారిలో ఫోన్ చూసుకుంటూ ఎదురుగా వస్తున్నా లారీ ని గమనించలేదు. రెప్ప పాటులో ఘోరం జరిగిపోయింది. అప్పుడు పాడైన ఆ ఫోన్ ఇప్పుడు నేను రిపేర్ చేసి ఇంట్లో ఇచ్చాను. ఫోన్ లో లాస్ట్ మెసేజ్ చూస్తే అర్ధమైంది ..అది నీకు ఆ రోజు మెసేజ్ చేస్తూ...ఆక్సిడెంట్ కు గురైందని. ఈ లోపు, ఈ రోజు నువ్వు తనకు పెట్టిన బర్త్డే మెసేజ్ చూసి..నీ పరిస్థితి తెలిసి..నీ దగ్గరకు వచ్చాను.
బర్త్డే విషెస్ పెట్టకపోతే, ప్రేమ లేనట్టా?... ఫ్రెండ్షిప్ పోయినట్టా....?... చెప్పు జానకి!"
"ఐ యామ్ వెరీ సారీ.... జయంతి! నన్ను క్షమించు!"
*****

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ