13-11-2024, 02:13 PM
[font=var(--ricos-font-family,unset)] [/font]
మాధవి పూరునితో " మన తండ్రి యయాతి మహా రాజు భౌతిక సుఖాన్వేషణకు ఇచ్చిన ప్రాధాన్యతను మరి దేనికీ ఇవ్వలేదు. తన సుఖం కోసం నీ శరీరాన్ని కూడా వాడుకున్నాడు. భౌతిక సుఖాన్వేషణ తప్పు కాదు. కానీ తన భౌతిక సుఖాన్వేషణ కోసం పరులను పలు రకాల ఆచారాల అనుబంధాల పేరుతో లొంగ తీసుకోవడం అమానుషం. నీ భార్య విజ్ఞాన బలం తో నువ్వు హైమావతి కుమారుడైన ప్రసేనజిత్తుని మనుమడు మాంధాత ను జయించ గలిగావు. "
అని అంది.
మాధవి మాటలను విన్న కౌసల్య, " మాధవి, గతం గతః. భగవంతుని చేతిలో మామగారు యయాతి మహారాజు గారు అలా మలచబడ్డారు. అంతే. ఇప్పుడు అందరం హాయిగా ఉన్నాం. అది చాలు" అని అంది.
మాధవి అభ్యర్థనను అనుసరించి కౌసల్య మునులతో యజ్ఞం చేయించింది. మాధవి తనువును జింక తనువుగ మలిచింది.
మాధవి తన వదిన కౌసల్య కు తన సోదరుడు పూరునికి, మునులకు నమస్కరించింది. జింక తనువుతో విష్ణు సేవన వనాలలో ఆశ్రమ సంచారిణిగా జీవిస్తు విధాత ప్రసాదించిన ఆయుష్షు ను చక్కగా అనుభవించసాగింది. చెంగు చెంగున ఎగురుతూ ఆశ్ర మాలను పావనం చేసే లేడి అయిన యోగిని మాధవిని చూసిన మహర్షులందరూ రెండు చేతులు జోడించి నమస్కరించసాగారు. కొందరు మునులు లేడి అయిన యోగిని మాధవి చుట్టూ ప్రదర్శనలు చేయసాగారు.
శుభం భూయాత్

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ