Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక కథలు - అనంత
#17
 గాలవుడు రమారమి సంవత్సర అనంతరం మాధవి దగ్గరకు వచ్చి, "నాకు కావలసిన గుర్రాలు కాశీరాజు దివోదాసు దగ్గర, భోజరాజు ఉశీనరుని దగ్గర రెండు వందలు రెండు వందల చొప్పున ఉన్నాయి " అని మాధవితో అన్నాడు. 



మాధవి హర్యశ్వుని దగ్గర సెలవు తీసుకుని కాశీరాజు దివోదాసు దగ్గర కు వెళ్ళింది. దివోదాసు దగ్గర ధనం తప్ప అన్నీ ఉన్నాయని గ్రహించింది. దివోదాసు తన ధనాన్నంత శివ భక్తు లకే వినియోగిస్తాడు అని తెలుసుకుంది. అంత తన విజ్ఞాన శాస్త్ర బలంతో దివో దాసు కు ఒక మగ శిశువును ఉత్పత్తి చేసి ఇచ్చింది. దివోదాసు శిశువుకు ప్రతర్థన అనే పేరు పెట్టాడు. ‌ 



అటు పిమ్మట భోజరాజు దగ్గర కు వెళ్ళింది. భోజరాజు లో కాముకత్వం తక్కువ అని గమనించింది. అతని శరీరానికి తగిన మందులను ఇచ్చింది. అంత తన విజ్ఞాన శాస్త్ర బలంతో ఒక మగ శిశువును ఉత్పత్తి చేసి ఇచ్చింది. భోజరాజు శిశువుకు శివి అని పేరు పెట్టాడు. 



 గాలవుడు మాధవిని, 600 గుర్రాలను విశ్వామిత్ర మహర్షి దగ్గరకు తీసుకొని వెళ్ళి జరిగిందంతా చెప్పా డు. మిగతా 200 గుర్రాల కోసం తనేం చేయాలని అడిగాడు. 



 విశ్వామిత్ర మహర్షి గుర్రాలన్నిటిని పరిశీలించాడు. మాధవి కొంత కాలం తన దగ్గర ఉంటుందని చెప్పి గాలవుని గురు దక్షిణ నుండి విముక్తి కలిగించాడు. 
"మాధవి, నీ విజ్ఞాన శాస్త్ర బలం గురించి విన్నాను. ముగ్గురు మహారాజులకు కలిగిన మగ సంతానం ను నేను కళ్ళార చూసి వచ్చాను.. పుత్రకామేష్టి యాగాదు పేరుతో జరిగే అశ్వ సంహారాదులను నిర్మూలించా లనే సదుద్దేశంతోనే నేను గాలవునితో పనంతా చేయించాను. " మాధవితో అన్నాడు విశ్వామిత్ర మహర్షి. 



 విశ్వామిత్ర మహర్షి మాటలను విన్న మాధవి "బ్రహ్మర్షోత్తమ! మీ సదుద్దేశం సదా ప్రశంసనీయం. అయితే లోకం లో కొందరు నా విజ్ఞాన శాస్త్ర బలాన్ని గమనించరు. నేను ముగ్గురు రాజులతో కాపురం చేసి సంతానాన్ని కన్నాను అంటారు.. విషయం కొందరు ఋషులకు, పండితులకు తెలిస్తే వారు నేను ఎవరితో ఎలా కాపురం చేసాను అని ఊహించి మరీ వ్రాస్తారు. వారి ఊహలకు అశాస్త్రీయ సంప్రదాయాలనూ, అశా స్త్రీయ ధర్మాలను కలగలుపుతారు.



 అయితే ఎవరికో భయపడి పదుగురికి ఉపయోగపడే వైద్య విజ్ఞానాన్ని కాలమరుగు చేయరాదని నేను ముందడుగు వేసాను. మీరు గాలవుని ఒక చెవి నలుపు చంద్ర కిరణాల వలే తెల్లగా ప్రకాశించే 800 గుర్రాలను అడిగినప్పుడే ఇందులో ఏదో దేవ రహస్యం ఉందని గమనించాను. " అంది మాధవి. 



 'అలాంటి గుర్రాలు ముగ్గురు రాజుల దగ్గర 600 మాత్రమే గాలవునికి లభ్యమవుతాయి అని నాకు తెలుసు. " అన్నాడు విశ్వామిత్ర మహర్షి. 
"మిగతా 200 గుర్రాలకు బదులు మీకు సంతానం కావాలి. అంతే గదా?" చిరునవ్వుతో విశ్వామిత్ర మహర్షి ని అడిగింది మాధవి. 



"నీవు ప్రసాదించే సంతానం వలననే నాకు మోక్షం లభిస్తుందని అనుకుంటున్నాను. ఇక నీ విజ్ఞాన శాస్త్ర బలాన్ని నేను కళ్ళార చూడాలి. అందులో కొంతలో కొంత నేను అవగాహన చేసుకోవాలి. " అని మాధవితో అన్నాడు విశ్వామిత్ర మహర్షి. 



మాధవి తన విజ్ఞాన శాస్త్ర పథాన్ని ప్రయోగశాలలో విశ్వామిత్ర మహర్షి కి తెలియచేసింది. అప్పుడు విశ్వామిత్ర మహర్షి, "మాధవి, నీ సంతానోత్పత్తి ప్రక్రియ అద్భుతం. అమోఘం. నేడు పుత్రకామేష్టి యాగం చేయించేవారు కొందరు చంద్ర కిరణాల వలే తెల్లగా ప్రకాశిస్తూ, ఒక చెవి నల్లగా ఉండి, అన్ని శుభ లక్షణాలు ఉన్న బలిష్టమైన గుర్రం తల తెగనరుకుతున్నారు. ఆపై అనేక జుగుప్సాకరమైన పనులతో పుత్రకామేష్టి యాగం పూర్తి చేస్తున్నారు. ఇలా యాగం పేరుతో మంచి అశ్వాలను సంహరించే విధానం ఇకపై ఉండకూడదు. , " అంటూ పుత్రకామేష్టి యాగం లో అశ్వాలను హింసించే విధానాన్ని విశ్వామిత్ర మహర్షి మాధవికి చెప్పాడు. 



మాధవి తన విజ్ఞాన శాస్త్ర బలాన్ని ఉపయోగించి విశ్వామిత్ర మహర్షి కి ఒక మగ శిశువును ఉత్పత్తి చేసి ఇచ్చింది. విశ్వామిత్ర మహర్షి శిశువుకు అష్టకుడు అని పేరు పెట్టాడు. ఇక తనకు మోక్షం లభిస్తుందని సంతోషించాడు. 
 ఆపై విశ్వామిత్ర మహర్షి మాధవిని యయాతి మహారాజు కు అప్పగించాడు. యయాతి మహారాజు మాధవికి స్వయంవరాన్ని ఏర్పాటు చేసాడు. స్వయంవరానికి ఇక్ష్వాకు రాజు, కాశీరాజు, బోజ రాజులు కూడ వచ్చారు. 
 మాధవి తన స్వయంవరాన్ని తిరస్కరించింది. 



"కామం అంటే కేవలం లైంగికం కాదు. ఎలాంటి కోరికైన కోరికే. సృష్టి చేయాలన్న భగవంతుని కోరిక కోరికే. అలాగే విజ్ఞాన శాస్త్ర బలంతో సృష్టి చేయాలన్న నా కోరిక కోరికే. నా కోరిక నెరవేరింది. నేనిక అవివాహిత గా విష్ణు సేవన ఉండిపోతాను" అని మాధవి తన తండ్రి యయాతి మహారాజు తో అంది. 



అడవిలో ప్రయోగ శాలతో కూడిన పర్ణ శాలను ఏర్పాటు చేసుకుంది. అక్కడే జీవించసాగింది.
 
 ఒకసారి యయాతి మహారాజు కుమారుడు పూరుడు తన భార్య కౌసల్య తో కలిసి యాగ వనం వచ్చాడు. అక్కడ యోగిని అయిన తన సోదరి మాధవిని చూసాడు. మాధవిని పూరుడు తగిన విధంగా సత్కరించాడు. మాధవి అన్నా వదినల క్షేమసమాచారం అడిగింది. ముఖ్యంగా పూరుని శరీర తేజస్సు గురించి అడిగి తెలుసుకుంది. 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - మాధవి - by k3vv3 - 13-11-2024, 02:12 PM



Users browsing this thread: 3 Guest(s)