13-11-2024, 02:10 PM
"అదేమిటి తండ్రిగారు?" అని యయాతి మహారాజు ను మాధవి అడిగింది.
"విశ్వామిత్ర మహర్షి ప్రియ శిష్యుడు. అతని పేరు.. ఆ.. వశిష్ట మహర్షీ! వారి పేరేమిటి?" యయాతి మహారాజు వశిష్ట మహర్షి ముఖం చూస్తూ వశిష్ట మహర్షి ని అడిగాడు.
"అసలు పేరు గాలవుడు. అతనిని మరో రెండు మూడు పేర్లతో పిలుస్తారు రాజ. అవి నాకూ సరిగా గుర్తులేదు. గాలవుని మిత్రుని పేరు సుపర్ణ. " యయాతి మహారాజు తో అన్నాడు వశిష్ట మహర్షి.
"ఆ.. ఆ గాలవుడు. నా దగ్గరకు వచ్చాడు. విశ్వామిత్ర మహర్షి గురుదక్షిణ గా గాలవుని 800 గుర్రాలను అడిగాడట. " మాధవి ముఖం చూస్తూ అన్నాడు యయాతి మహారాజు.
"800 గుర్రాలను ఏర్పాటు చేయడం మీకు పెద్ద సమస్య కాదు గదా తండ్రి. ఆ.. గాలవునికి 800 గుర్రాలు ఇచ్చి పంపండి. " తండ్రి తో అంది మాధవి.
"గాలవుని విశ్వామిత్ర మహర్షి అడిగింది మామూలు గుర్రాలు కాదమ్మా. చంద్ర కిరణాలవలే ప్రకాశించే తెల్లని గుర్రాలు. వాటికి తప్పని సరిగా ఒక చెవి నలుపుగా ఉండాలట. అలాంటి గుర్రాలు 800 కాదుగదా ఒకటి కూడా మన దగ్గర లేవు. " మాధవితో వశిష్ట మహర్షి అన్నాడు.
"ఒక చెవి నల్లగా ఉండి చంద్ర కిరణాల వలే తెల్లగా ప్రకాశించే గుర్రాలు విశ్వామిత్ర మహర్షి కి 800 కావాలా?
వాటిని ఆయన ఏం చేసుకుంటాడట? రాజైన విశ్వామి త్ర మహర్షి గోమాత కారణంగా రాజ్యాన్ని విసర్జించి ఋషిగా, మహర్షి గా, బ్రహ్మర్షి గా మహోన్నత స్థాయిన నిలిచారు.
పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చని ప్రపంచానికి గాయత్రి మంత్రాన్ని అందించారు. అలాంటి మహర్షి ఒక చెవి నల్లగా ఉండి చంద్ర కిరణాల వలే తెల్లగా ప్రకాశించే గుర్రాలు 800 అడుగుతున్నాడంటే అందులో ఏదో అంతరార్థం ఉంది.
విశ్వామిత్ర మహర్షి అడిగిన గుర్రాలు సహజంగా వయసు పెరిగే కొద్దీ తేలికగా మారతాయి.
వాటిని ఎక్కువగా పుత్రకామేష్టి యాగం లో ఉపయోగి స్తారు. అయితే విజ్ఞాన శాస్త్ర వికాస ఫలితంగా సంతానో త్పత్తి కి పుత్రకామేష్టి యాగం ను మించిన సశాస్త్రీయ మార్గాలు అనేకం వచ్చాయి. అదిసరే మీరు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు?" యయాతి మహారాజు ను వశిష్ట మహర్షి ని అడిగింది మాధవి.
"మాధవి విశ్వామిత్ర మహర్షి అడిగిన గుర్రాలు ఇక్ష్వాకు రాజు హర్యశ్వుడు దగ్గర కొన్ని ఉన్నట్లు నాకు తెలిసింది. అయితే అతని వద్ద అలాంటి గుర్రాలు ఎన్ని ఉన్నాయో నాకు కూడా తెలియదు. హర్యశ్వునికి ధర్మ గుణం తప్ప అన్నీ ఉన్నాయని అధిక శాతం మంది అనుకుంటూ ఉంటారు.
అలాంటి వారిని మెప్పించాలం టే నీలాంటి వారే సమర్థులని నా అభిప్రాయం. ఇదే విషయాన్ని గాలవునికి చెప్పాను. నువ్వు గాలవునితో వెళితే, అతని కోరిక తీరుతుంది అని నా అభిప్రాయం. " మాధవితో అన్నాడు యయాతి మహారాజు.
మాధవి తన తండ్రి యయాతి మహారాజు చెప్పిన మాటల గురించి కొంత సేపు ఆలోచించింది. అటు పిమ్మట అరణపు దాసి అరవింద తో కలిసి గాలవునితో గాలవుని వెనుక నడిచింది.
గాలవుడు ఇక్ష్వాకు రాజు హర్యశ్వుని దగ్గరకు వెళ్ళాడు. తన గురు దక్షిణ గురించి చెప్పాడు. గాలవుని మాటలను విన్న హర్యశ్వుడు, "విశ్వామిత్ర ప్రియశిష్యా. గాలవ! నేను సంతాన హీనుడుని. సంతానం నిమిత్తం అనేక యజ్ఞయాగాదులు చేసాను. అయి నా సంతానం ప్రాప్తించలేదు.
చివరికి పుత్రకామేష్టి యాగం నిమిత్తం ఒక చెవి నలుపు తో చంద్ర కిరణాల వలే తెల్లగా ప్రకాశించే 200 గుర్రాలను సేకరించగలిగాను. పుత్రకామేష్టి యాగం లో అలాంటి గుర్రాలను ఉపయోగిస్తే తప్పక మగ సంతానం కలుగుతుంది అని పుత్రకామేష్టి యాగం చేయించే మహర్షులు అనేక మంది నాకు చెప్పారు. అందుకే ఆ గుర్రాలను సేకరించాను. " అని గాలవునితో అన్నాడు.
"విజ్ఞాన శాస్త్ర మార్గాన్ని అనుసరించి నీకు మగ సంతానం కలిగే మార్గం యయాతి మహారాజు కుమార్తె ఈ మాధవి చెబుతుంది. " అని హర్యశ్వునికి గాలవుడు మాధవిని చూపించాడు.
"యయాతి మహారాజు కుమార్తె మాధవి గురించి ఇంతకు ముందే నాకు చాలా విషయాలు తెలుసు. సంతానోత్పత్తి విషయాల్లో ఆమె యాగ మార్గాలనే కాక ఏవేవో విజ్ఞాన శాస్త్ర మార్గాలు అనుసరిస్తుంది అని నాకు చాలా మంది చెప్పారు. సంతానోత్పత్తి విషయంలో నాకు మాధవి సహకరిస్తుందంటే 200 గుర్రాలు ఇవ్వ డానికి నేను సిద్దమే " అని గాలవునితో హర్యశ్వుడు అన్నాడు.
హర్యశ్వుని మాటలకు మాధవి తన సమ్మతిని తెలపడంతో హర్యశ్వుడు గాలవునికి 200 గుర్రాలను ఇచ్చాడు. గాలవుడు మిగతా గుర్రాలను అన్వేషించే నిమిత్తం వెళుతూ మాధవిని హర్యశ్వుని దగ్గర ఉంచి వెళ్ళాడు.
మాధవి అరవింద లకు హర్యశ్వుడు ప్రత్యేక మందిరాన్ని ఏర్పాటు చేసాడు. మాధవి హర్యశ్వుని తో, " రాజా! తలిదండ్రుల మంచి గుణాలలో కొన్ని మంచి గుణాలు తమ బిడ్డలకు సంప్రాప్తిస్తాయి. నీకు మంచి మగ సంతానం కావాలంటే నువ్వు ముందుగ ధర్మ గుణాన్ని పెంపొందించుకోవాలి. అటుపిమ్మట నేను చెప్పిన విజ్ఞాన మూలికలను ఏర్పాటు చేయాలి. " అని అంది.
హర్యశ్వుడు మాధవి చెప్పినట్లు చేయడానికి సంసిద్దుడయ్యాడు. మాధవి చెప్పినట్లు నిరుపేదల అభివృద్ధి నిమిత్తం తనవంతు సహాయం అందించాడు. స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. యజ్ఞ యాగాదులతో పాటు విజ్ఞాన శాస్త్ర అభ్యాసాన్ని ప్రోత్సహించాడు. అందరూ యుగ ధర్మానికి అనుకూలంగా నడుచు కోవాలని ప్రజలకు నాటిక, నాటకం వంటి రకరకాల కళల ద్వారా తెలియచేసాడు.
సంవత్సరం తిరిగే సరికల్లా మాధవి తన విజ్ఞాన శాస్త్ర బలంతో ఒక మగ శిశువును ఉత్పత్తి చేసింది. హర్యశ్వుడు ఆ శిశువును చూసి మహదానందం పొందాడు.
అనంతరం హర్యశ్వుడు మహర్షులు, పండితుల సమక్షంలో శిశువుకు " వసుమనస్" అని నామధేయం చేసాడు.

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ