Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - పందిట్లో పెళ్లవుతున్నది
#15
దేవకన్య
రచన: తాత మోహనకృష్ణ



అనగనగా... చాలా సంవత్సరాల కిందట.. ఒక పల్లెటూరు లో రానా అనే ఒక కుర్రాడు ఉండేవాడు. ఎంతో చలాకీ గా, సరదాగా...



అన్నిటికి మించి చాలా ధైర్యవంతుడు, అందగాడు. అతని ఫ్రెండ్స్ రాజా, శివ ఎప్పడూ రానా తోనే ఉండేవారు.



ఆ ఊరిలో కొండ పైన ఒక పాడుబడ్డ పెంకుటిల్లు ఉండేది. అందులో దెయ్యాలు తెరుగుతూ ఉంటాయని ప్రచారం ఉంది. అందుకే ఎవరూ.. అటుపక్క వెళ్ళేవారు కాదు.



రాత్రి పూట కొండ పై నుంచి విచిత్రమైన శబ్దాలు వస్తాయని అందరూ భయపడుతూ ఉంటారు. అమావాస్య రోజైతే... ఇంకా.. గజ్జెల శబ్దం వస్తుందని రాజా, శివ ఎప్పడూ రానా తో చెబుతూ ఉంటారు.



రానా తన ఫ్రెండ్స్ మాట ఎప్పుడు నమ్మేవాడు కాదు. దెయ్యాలు ఉన్నాయంటే అసలు నమ్మడు. ఒక రోజు ఫ్రెండ్స్ మధ్య దెయ్యాల గురించి చర్చ చాలా తారా స్థాయిలో జరిగింది.



"నీకు దెయ్యాలు ఎన్ని రకాలో తెలుసా రానా?" అడిగాడు శివ.



"అసలు దెయ్యాలే లేవంటే... మళ్లీ రకాలు ఏమిటి శివ?"



"అయితే ఒక పందెం వేసుకుందాం!"



"ఏమిటది?"



"నువ్వు అమావాస్య రోజు నాడు ఒక రాత్రంతా... ఆ కొండ మీద ఉండాలి... అలాగ గనుక నువ్వు చేస్తే.. ప్రాణాలతో తిరిగి వస్తే, నువ్వు ఒక పది రోజుల పాటు.. ఏ పని చెబితే ఆ పని మేము చేస్తాం.... " అన్నాడు శివ.



"ఒక రాత్రంతా అక్కడ ఉంటే... వాడు ప్రాణాలతో ఎలా తిరిగి వస్తాడు రా?" అన్నాడు రాజా.



"నువ్వు వెళ్ళకపోతే... పందెం ఓడిపోయినట్టే.. అప్పుడు నువ్వు.. మేము చెప్పినట్టు పది రోజులు చెయ్యాలి.. ఏమి అడిగితే అది తెచ్చి ఇవ్వాలి. ఇప్పుడు చెప్పు రానా!"



రానా.. ఈ దెయ్యాల సంగతేమిటో తేల్చుకోవాలని పందెం ఒప్పుకున్నాడు...



"రెండు రోజుల్లో అమావాస్య వస్తోంది... రెడీ గా ఉండు రానా... " అన్నారు రాజా, శివ



"అలాగే"



రానా అమావాస్య రోజు నాడు కొండపైకి బయల్దేరాడు. కింద నుంచి ఫ్రెండ్స్ చూస్తున్నారు. రానా... కొండపైన ఉన్న పెంకుటిల్లు దగ్గరకు చేరుకున్నాడు. అది పాడుబడ్డ పెంకుటిల్లు. లోపలికి వెళ్లి చూసాడు.. అక్కడ ఎవరూ లేరు. తనతో తీసుకుని వచ్చిన దీపం అక్కడ ఉంచి... పడుకోవాలనుకున్నాడు. అలసిపోవడం చేత తొందరగా నిద్రపట్టేసింది.



కొంత సేపటికి గజ్జెల శబ్దానికి మెలకువ వచ్చింది రానా కు. ఆ శబ్దం వైపుగా వెళ్ళాలని అనుకున్నాడు. అలా వెళ్ళుతుండగా... శబ్దం ఇంకా బిగ్గరగా వినిపిస్తుంది... ఒక పెద్ద చెట్టు దగ్గరకు వచ్చేసరికి.. ఆ శబ్దం ఆగిపోయింది. కొంచం ముందుకు వెళ్లి చూడాలనుకున్నాడు. ధైర్యం చేసి, చెట్టు దగ్గరకు వెళ్లి చూసాడు. ఒక వింత భయంకర ఆకారం... తెల్లటి బట్టలు ధరించి... అక్కడ గడ్డిలో నిద్రిస్తున్నది. చూస్తే, ఆ ఆకారం అమావాస్య చీకటిలో లో కూడా మెరిసిపోతుంది... రానా నమ్మలేకపోయాడు..



"అక్కడే ఆగిపోయావేంటి? ఇక్కడకు రా!” అని ఆ అందమైన గొంతు పిలిచింది... !



"ఎవరు మీరు... ?" అడిగాడు రానా.



"నేనంటే భయం లేదా?"



"ఎందుకు భయం?"



"మా ఫ్రెండ్స్ చెప్పారు.. ఇక్కడ దెయ్యాలు ఉంటాయని.. మీరు దేయ్యమేనా?"



"నేను దెయ్యాన్నే.. కానీ నీలాంటి ధైర్య, సాహసవంతులను ఏమీ చెయ్యను.. "



"నీకు ఇక్కడ ఏమిటి పని?" అడిగాడు రానా.



"నాకు శాపం చేత ఇక్కడకు వచ్చి ఉంటున్నాను... గతం లో నీ లాగ వచ్చిన కొంతమంది... నన్ను చూడగానే... గుండె ఆగి చచ్చారు.. నేను నీలాంటి ధైర్యవంతుని కోసమే చూస్తున్నాను".



"ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నావు?"



"సుమారు ఆరు సంవత్సరాలు అయింది.. !"



"నాతో దెయ్యానికి ఏమిటి పని?"



"నాకు ఈ వింత దెయ్యం రూపం రాత్రి మాత్రమే ఉంటుంది... ఉదయం కాగానే... నా అందం చూడడానికి నీ రెండు కళ్ళు చాలవు.. "



"ఇంత అందగత్తెకు ఏమిటో ఆ శాపం?" ఆశ్చర్యంగా అడిగాడు రానా..



"నేను ఒక దేవకన్య ను. ఎప్పుడు సరదాగా... దేవలోకం లో ఆడుతూ... పాడుతూ ఉండేదానిని... అలాంటి.. నేను నా స్నిహితులతో... ఈ కొండ మీదకు... విహారానికి వచ్చాను. తిరిగి మా లోకానికి వెళ్ళడానికి నా మెడలో ఉన్న శక్తివంతమైన మాల ను పోగొట్టుకున్నాను. అది లేనిదే, నేను నా లోకానికి వెళ్ళలేను. మళ్లీ, నేను నా లోకానికి వెళ్ళాలంటే... ఒక ధైర్యవంతుడు, సాహసవంతుడు, నన్ను ప్రేమించి, పెళ్ళి చేసుకున్నాకే... ఈ శాపము పోయి... నేను మళ్లీ మా లోకానికి వెళ్ళగలను. ఎంతో మంది.. ఇక్కడకు వచ్చారు గానీ... ఎవరు అంతటి యోగ్యులు కారు..



నిన్నుమొదటి చూపులోనే వలచాను అందగాడా!.. నేనంటే నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమయితే నన్ను పెళ్ళి చేసుకుంటేనే, నాకు శాపం తీరిపోతుంది..”



"ఓ దేవి! చాలా అలసట గా ఉంది... రేపు ఉదయము మాట్లాడుతాను"



"అలాగే మానవా!"



రానా రాత్రంతా... దెయ్యం చెప్పిన దాని గురించి చాలా ఆలోచించాడు. ఒక నిర్ణయానికి వచ్చాడు.



సూర్యోదయం కాగానే... దెయ్యం రూపం పోయి, ఒక అందమైన దేవకన్య గా మారిపోయింది ఆ దెయ్యం.



"ఏమి అందం! రంభా.. ఉర్వశులే చూసి అసూయ పడేలాగా ఉంది నీ అందం దేవి.. ! నీలాంటి దేవకన్య నన్ను వలచినదంటే, అంతకన్నా అదృష్టం ఏముంది నాకు?... నువ్వు అంటే నాకూ చాలా ఇష్టం దేవీ! నీకు నచ్చితే, ఇప్పుడే.. ఇక్కడే వివాహం చేసుకుంటాను... "



"నాకు సమ్మతమే మానవా!"



"అలాగే దేవి"



రానా ఆ దేవకన్య ను పెళ్ళి చేసుకున్నాడు. అక్కడే రెండు రోజులు సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత దేవకన్య... రానా తో..



"నాకు శాపము పోయినది... నేను ఇంక మా లోకానికి వెళ్తాను... మా తండ్రిగారికి చెప్పి, తర్వాత నిన్ను మా లోకానికి తీసుకుని వెళ్తాను" అంది.



"అలాగే.. దేవి!"



ఆ దేవకన్య అక్కడ నుంచి వెళ్లిపోయింది.



రానా ఇంక కిందకు రాడు... చనిపోయడనుకున్నారు ఫ్రెండ్స్... ఇద్దరూ, బాధ పడుతూ కూర్చున్నారు...



"వెళ్లొద్దు రా ! అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను... విన్నాడా? ఇప్పుడు ఎంత ఘోరం జరిగిపోయింది... !"



"ఊరుకో రా! అయినా పోయిన వాళ్ళు తిరిగి వస్తారా చెప్పు?.."



"వచ్చాను.. చూడండి!” అని ఎదురుగా నిల్చున్నాడు రానా..



"దెయ్యం! దెయ్యం!" అని దూరంగా పారిపోయారు ఇద్దరూ..



"దెయ్యం ఉందని నన్ను కొండపైకి పంపించి... ఇప్పుడు నన్నే దయ్యం అంటారా?"



"ఒరేయ్! మనవాడు బతికే ఉన్నాడు.. "



"బతికే ఉన్నాను రా!" అన్నాడు రానా.. గట్టిగా అరుస్తూ... !



"దెయ్యం కనిపించిందా... ?"



"దెయ్యం చాలా అందంగా ఉన్నది. మీరు నాతో పందెం వెయ్యకపోతే, అంతటి అందాన్ని చూడగలిగేవాడిని కాదు. పెళ్ళి కూడా చేసుకున్నాను.. !" అన్నాడు రానా.



"దెయ్యం తో పెళ్ళా?"



జరిగినదంతా.. తన స్నేహితులతో చెప్పాడు రానా.



********
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - చీకటి నుండి వెలుగుకు - by k3vv3 - 10-11-2024, 01:41 PM



Users browsing this thread: 1 Guest(s)