05-11-2018, 05:21 AM
(This post was last modified: 05-11-2018, 05:43 AM by pastispresent.)
(13)
ఎంగేజ్మెంట్ రోజు:
ప్రియ వాళ్ళ ఊరికి నేను, అమ్మ నాన్న చెల్లి అందరం వెళ్ళాము. మేముంటున్న హోటల్ దగ్గరలో ఒక పెద్ద హోటల్ లో ఎంగేజ్మెంట్ కోసం ఏర్పాటు చేసారు. ఐతే తక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఒక చిన్న హల్ లో అన్ని ఏర్పాట్లు చేసారు కానీ చాలా ఖరీదుగా అన్నిటిని ఏర్పాటు చేశారు.
అక్కడున్న అన్నిటిని నేను మరచిపోయి నా దృష్టి అంత ప్రియ పైనే. ప్రియ చాల బాగా రెడీ అయ్యి వచ్చింది. అందరూ ఉన్నందుకో ఏమో మరి చాల సిగ్గుపడుతూ ఉంది. మధ్యలో అమ్మ ప్రియ కి చీర ఇచ్చింది. ప్రియ ఆ చిరాకు మార్చుకొని వచ్చింది. ఇంకా అందంగా ఆ చీరలో కనపడింది. చెయ్యవలసిన కార్యక్రమాలు చేసి చిరవరగా పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. పోయినసారి ఓ ముహూర్తం అనుకున్నారు, ఇప్పుడు ఆ ముహుర్తాన్ని పద్ధతి ప్రకారం పంతులు ఫైనల్ చేసారు.
తర్వాత ఉంగరాలు మార్చుకోవాలి. ఇద్దరం ఎదురెదురుగా నిల్చున్నాము. ప్రియ వాళ్ళ కసిన్స్ ఒక ఇద్దరు ఉన్నారు అక్కడే. ప్రియ ని టీస్ చేస్తున్నారు తను సిగ్గుపడిపోతుంది. నాకు రింగ్ ఇచ్చారు. ప్రియ తన చేయిని పైకి తీసుకొని నా ముందు పెట్టింది. నేను తన చేయి పట్టుకొని నెమ్మదిగా రింగ్ తొడిగాను. ఈ లోపల ఫోటోల కోసం కెమెరా వైపు చూసాము. అందువల్ల తన చేయి అలాగే పట్టుకొని ఉండిపోయాను. తను కూడా నా చేయి పట్టుకొని రింగ్ తొడిగింది. ఇద్దరం అలా ఒక్కసారి కళ్ళలోకి కళ్ళుపెట్టుకొని చూసుకున్నం. ప్రియను ఆలా తాకగానే ఒక మంచి అనుభూతి. తన లేత చేయిని పట్టుకొని అలా కొంచెం సేపు.... మరవలేక పోతున్నాను. ఈ క్షణంతో నాకు ప్రియ కు సగం పెళ్లి అయిపోయినట్లే.
ఇంక ఫంక్షన్ అయిపోయింది అనుకున్నాము, ప్రియ వాళ్ళ కసిన్స్ కేక్ తెచ్చారు. పక్కన ఒక చిన్న టేబుల్ వేసి, ఆ కేక్ మేము కోయటానికి రెడీ చేశారు. కేక్ పైన సంజయ్ అండ్ ప్రియ ఎంగేజ్మెంట్ అని రాసి ఒక రెండు హార్ట్ సింబల్స్ ఉన్నాయి. అయితే కాండిల్స్ వెలిగించి ఆర్పే బదులు, ఇద్దరినీ రెండు కాండిల్స్ వెలిగించామన్నారు. నేను ప్రియ కాండిల్స్ వెలిగించాము. అందరూ చప్పట్లు కొట్టారు.
ప్రియ చేయి పట్టుకొని కేక్ కొయ్యమన్నారు. నేను నెమ్మదిగా పియ చేయి పట్టుకొని ఇద్దరం కేక్ కోసాము. వెనకాల నా చెల్లి ప్రియ కసిన్స్ హడావిడి చేస్తున్నారు. నన్ను కేక్ తీసుకొని ప్రియకు పెట్టమన్నారు. ఆలా అందరి మందు ఉండటంతో డిస్కంఫోర్ట్ ఫీల్ అయ్యాను. నెమ్మదిగా ఒక కేక్ ముక్క తీసుకొని ప్రియ నోటిలో పెట్టాను. తను ఆలా కేక్ లోపలి తీసుకుంది. కెమెరా వైపు చూస్తే ఫోటోలు తీశారు. అలాగే ప్రియా కూడా తన చేత్తొ నాకు ఒక కేక్ ముక్క నోట్లో పెట్టింది. మధ్యలో వాళ్ళ కసిన్స్ బాగా టీస్ చెయ్యడంతో సిగ్గుపడి తల కొంచెం అటు వైపు తిప్పుకుంది కొంచెం సేపు నవ్వటానికి. అందరూ తన సిగ్గు చూసి నవ్వారు. అది అయ్యాక, ఫోటోల కోసం స్టేజి మీద ప్రియ నేను నిల్చున్నాము, చాల ఫొటోస్ తీశారు. అలాగే మా ఫామిలీ ప్రియా ఫామిలీ వాళ్ళందరూ వచ్చి ఫోటోలు దిగారు.
తర్వాత ఇద్దరం ఒకచోట కూర్చొని తిన్నాము. కేవలం చూపులకు మాత్రమే ప్రియ నేను పరిమితమయ్యాము.
ఒక వారం తర్వాత:
ఎంగేజ్మెంట్ అయ్యాక ఆఫీస్ పనిలో బిజీ అయిపోయాను. అయితే అపార్ట్మెంట్ సెలెక్ట్ చేయాలి, ఇంటికోసం వస్తువులు కొనాలి, ఇంటికి గృహప్రవేశం చేయాలి. అలాగే కార్ కొనుక్కోవాలి.
ప్రియకు ఫోన్ చేశాను:
"హలో స్వీటీ"
"హాయ్ సంజు"
"ఎలా ఉన్నావ్ ??"
"నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావ్ ??"
"నేను ఒకే కానీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. మన ఎంగేజ్మెంట్ నిన్నే జరిగినట్లు ఉంది"
"నాకు అలాగే ఉంది"
"నువ్వు ఎంగేజ్మెంట్ లో చాల అందంగా ఉన్నావ్"
"థాంక్స్ సంజు..... నువ్వు కూడా చాల బాగా కనిపించవు...నీ డ్రెస్ చాల బాగుంది"
"థాంక్స్ స్వీటీ..... నువ్వు సెలెక్ట్ చేసిందే గా ఆ రోజు"
"నేను సెలెక్ట్ చేశానా ??"
"అవును. thumbs up ఇచ్చావ్ గా వాట్సాప్ లో"
"hmmm"
"కేక్ చాలా బాగుంది కదా"
"యా అవును నేనింకా కేక్ అలాగే ఫ్రిడ్జ్ లో ఉంచాను. అయిపోతుందని"
"కేక్ ఇంకా తినలేదా ??"
"తింటున్నాను రోజు కొంచెం కొంచెం"
"నేను నెక్స్ట్ రోజే అయిపోగొట్టాను"
ప్రియ నవ్వింది ఫోన్లో
"అవును ప్రియ, ఎంగేజ్మెంట్ చాలా సిగ్గుపడిపోయావు.... నాకు అర్థంకాలేదు"
"ఎం చేయాలి సంజు. నా వెనకాలే నా కసిన్స్ టీజ చేస్తూ ఉన్నారు"
"నేను మాట్లాడేది అప్పుడు విష్యం కాదు. జనరల్ గా"
"అలా ఎం లేదే"
"నేను బాగా గమనించాను, మోహంలో చాలా సిగ్గు నవ్వు"
"మరి ఉండదా.....పెళ్లవుతున్న ఆడపిల్లని నేను"
"అదేలే....కానీ చాలా క్యూట్ గా కనిపించావు"
"సంజు......ఇది చాలు నన్ను పొగిడింది"
"పొగడటం కాదు నిజం చెప్తున్నాను స్వీటీ"
"ఇప్పటికి నేను అందంగా క్యూట్ గా ఉన్నాను అని ఇంతకముందు కూడా చెప్పావ్"
"ఎంగేమెంట్లో ఇంకా ఎక్కువ అందంగా క్యూట్ గా కనపడ్డావ్"
"పో సంజు...."
"ఏంటి ??"
"ఎం లేదు....."
"ఎందుకు నవ్వుతున్నావ్??"
"నేనా ?? లేదే"
"నిన్ను చూడకపోయినా, ఫోన్లో నీ నవ్వు వినిపిస్తుంది. అంత సిగ్గా ??"
"నేను సీరియస్ గా నే ఉన్నానే"
"సరే ఒక వీడియో కాల్ చేయి.... ఇప్పుడే తేలుద్దాం నువ్వు సీరియస్ గా ఉన్నావా లేక నవ్వుతున్నావా అని"
"అబ్బా ఆ సాకుతో వీడియో కాల్ చేద్దామనా ??"
"హే అవును కదా..... మనం వీడియో కాల్ లో ఎందుకు మాట్లాడ కూడదు ?? వీడియో కాల్ చేస్తాను అగు"
"సంజు నో ఏమి అక్కర్లేదు"
"అదిగో మల్ల నీ గొంతులో నవ్వు"
"సంజు ఇక చాలు....నేను ఫోన్ పెట్టేస్తున్నాను"
"ఆగు ఆగు.....వద్దు"
"చెప్పు మరి"
"నాకు బాగా అర్థమైంయింది నువ్వు ఎందుకు వీడియో కాల్ వద్దంటున్నావో..... అది పక్కన పెడితే.... మనకి ఐమాక్స్ థియేటర్ లో రెండు టికెట్స్ సండే కి బుక్ చేశాను సినిమా కి"
"సంజు......"
"ఏంటి స్వీటీ??"
"ఇది చెప్పటానికేనా కాల్ చేసావ్ ??"
"కాదు ఇంకా ఉంది"
"ఏంటి ??"
"నీకు అపార్ట్మెంట్స్ చూపించాలి. నీకు నచ్చిందా లేదా నాకు చెప్పాలి"
"ఓ అదొకటి ఉంది కదా....."
"అవును"
"ఎప్పుడు చూడాలి అపార్ట్మెంట్స్ ??"
"సండే నే.... మార్నింగ్ అపార్ట్మెంట్స్ చూద్దాం, తర్వాత లంచ్ కి, ఆ తర్వాత మూవీ కి"
"రోజంతానా ??"
"అవును"
"నువ్వు కావాలనే ఇలా ప్లాన్ చేసావ్"
"అవును. సాటర్డే అయితే ఒక సగం రోజు పోతుంది. మళ్ళా సండే మూవీ కి ఇంకో సగం రోజు పోతుంది. అందుకే సండే అయితే. సాటర్డే ఎమన్నా పనులు ఉంటె నువ్వు చూసుకోవచ్చు"
"నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావ్"
"నీ ఇష్టం సాటర్డే సండే రెండు రోజులు పోతాయి ఆలా ప్లాన్ చేస్తే"
"వద్దులే"
"స్వీటీ...."
"ఏంటి??"
"మనకి సగం పెళ్లయిపోయింది. నువ్వు ఇంకా నన్ను వేరే వ్యక్తి లాగా చూస్తున్నావ్"
"సంజు ఆలా అనుకోవద్దు. అంటే పెళ్ళికి ముందు ఇలా అంత మనం తిరుగుతూ ఉండటం......"
"మరి మనకోసమే కదా అపార్ట్మెంట్ వెతికేది, ఎంగేజ్మెంట్ అయ్యాక మనం సరిగ్గా మాట్లాడుకోలేదు, అందుకే కొంచెం సమయం గడిపినట్లుంటదని ఇలా ప్లాన్ చేశాను"
"నువ్వు చెప్పేది కరెక్టే"
"ఈ రోజు సైక్లోన్ గ్యారంటీ"
తాను ఫోన్లో నవ్వింది
"అవును నిజం. నేను చెప్పిన దానికి ఫస్ట్ టైం ఒప్పుకున్నావ్"
"సంజు.....ఇక చాలు"
"ఎం చేస్తున్నావ్??"
"నీతో ఫోన్ మాట్లాడుతున్నాను"
"అబ్బో...జోకులు కూడా బాగానే వేస్తున్నావ్"
తను నవ్వి "ఎం లేదు ఫేస్బుక్ లో మన ఫొటోస్ పెట్టముగా, ఆ ఫొటోస్ చూస్తున్నాను"
"నేను కూడా అంతే"
నాకు ఈలోపల ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది.
"సరే స్వీటీ నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది... మళ్ళా మాట్లాడుకుందాం.....బాయ్"
"బాయ్ సంజు"
టు బి కంటిన్యూడ్.....

Images/gifs are from internet & any objection, will remove them.