Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#21

"ఆ పిల్ల లేచిపోలేదు. మీ నాన్న ఆ పిల్లను అతని పేరు... కళ్యాణ్‍తో లేచిపోయేలా చేశారు. అతని తండ్రి రామయోగి మీ నాన్నగారికి మంచి స్నేహితుడు.



ఒకరికి తెలియకుండా ఒకరు ఎలక్షన్‍లో నిలబడాలనుకొన్నారు. ఇరువురూ నామినేషన్స్ వేశారు.
ఆ విషయం విన్న రామయోగి మీ నాన్నగారిని కలిశాడు. వారు మన కులం వారు కాదు. రామయోగి కులస్థులు చాలామంది వున్నారు. మీ నాన్న విత్‍‍డ్రా చేసుకొంటే... అతను తప్పక గెలిచేవాడు...
తన వద్దకు వచ్చి ఆ విషయాన్ని ప్రస్తావించిన రామయోగితో మీ నాన్న... తాను విత్‍డ్రా చేసికోనని నిర్మొహమాటంగా చెప్పాడు. రామయోగిని తనకు సపోర్టు చేయమన్నాడు. రామయోగి కొడుకు కళ్యాణ్, వాణి ఒకే కాలేజీలో చదివినవారు. కళ్యాణ్ మంచి అందగాడు. వాణి కన్నా ఒక సంవత్సరం సీనియర్. అతను వాణిని ప్రేమించాడు. ఎంతో తెలివైన కళ్యాణ్ వలలో వాణి పడిపోయింది. తనూ అతనిని ప్రేమించింది. వారిరువురూ కలిసి తిరగడాన్ని మీ నాన్నగారు చూచారు. వాణిని పిలిపించి విషయాన్ని అడిగాడు మీ తండ్రి. ’మేము వివాహం చేసుకోవాలనుకుంటున్నాము మామయ్యా!.... మీరే అమ్మా నాన్నలతో మాట్లాడి మా వివాహాన్ని జరిపించమని’ కోరింది వాణి.



అప్పటికి అందరం... బంధుప్రీతితో వున్నందున మీ నాన్నగారు హరికృష్ణ అన్నయ్య... మీ అత్త లావణ్యతో వాణి అభిప్రాయాన్ని చెప్పి... కాలం మారింది. మనం మన తత్త్వాలు మార్చుకొని... ఒకరిపట్ల ఒకరు ఎంతగానో ప్రేమ పెంచుకొన్న వాణి, కళ్యాణ్‍ల వివాహానికి సమ్మతించండి అని చెప్పారు.



మీ మామయ్య, అత్తయ్యలు మీ నాన్నగారి మాటలను లెక్కచేయలేదు.



ఆవేశంలో మీ అత్త లావణ్య ’నీ బిడ్డ విషయంలో మేము నీకు అలాంటి సలహా ఇస్తే నీవు పాటిస్తావా!... సరి కులంగోత్రం లేని వాడికి నా కూతురుని ఇవ్వను. పిల్లకు మేనమామ అయ్యుండి మాతో అలాంటి మాటలు చెప్పేదానికి నీకు నోరెలా వచ్చింది!!... వెళ్ళిపో మా ముందు నుంచి వెళ్ళిపో!’ అని మీ తండ్రిని అసహ్యించుకొంది.



అవమానంతో మీ నాన్నగారు ఇంటికి తిరిగి వచ్చారు. వారి వాలకాన్ని చూచిన నేను విషయాన్ని గ్రహించాను. ’ప్రణవీ!... నా మాటలను జాగ్రత్తగా విను. ఈ క్షణం నుంచీ ఆ ఇంటికి... ఈ ఇంటికి రాకపోకలు జరుగకూడదు. ఈ మాటలను గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మసలుకో!’ వీరావేశంతో నన్ను హెచ్చరించారు. కళ్యాణ్‍కు ఢిల్లీ ఆర్కలాజికల్ డిపార్టుమెంటులో ఉద్యోగం వచ్చింది. మూడు వారాల్లో వెళ్ళి డ్యూటీలో జాయిన్ కావాలి.



రామయోగి... తన చెల్లెలి కూతురుతో కళ్యాణ్ వివాహం జరిపించి ఇరువురినీ ఢిల్లీ పంపాలని సంకల్పించి... తన నిర్ణయాన్ని కళ్యాణ్‍కు తెలియజేశాడు. కళ్యాణ్ తాను వాణిని ప్రేమించిన విషయాన్ని తండ్రికి చెప్పి... వివాహం అంటూ చేసుకొంటే నేను వాణినే చేసుకొంటాను. ఆమె తల్లిదండ్రులను కలసి మాట్లాడి ముహూర్తాలు పెట్టించండన్నాడు.



హరికృష్ణ అన్నయ్య.... రామయోగికి పెద్దగా పరిచయం లేదు. అతనికి బాగా సన్నిహితుడైన మీ నాన్నగారికి రామయోగి విషయాన్ని చెప్పి వాణీకి కళ్యాణ్‍కు వివాహం జరిగేలా చూడవలసిందిగా కోరారు. స్వార్థం... ఆ ఇంటివారు తనను అవమానించారనే ద్వేషంతో మీ నాన్నగారు రామయోగికి ఒక షరతు పెట్టారు.



’నీవు ఎలక్షన్ నామినేషన్ విత్‍డ్రా చేసుకొంటే.... నీ కొడుకు కళ్యాణ్‍కు, వాణికి వివాహం జరిగేలా చేయగలను. ఒకరోజు ఆలోచించుకొని నీ నిర్ణయాన్ని తెలియజెయ్యి!...’ అని చెప్పి రామయోగిని పంపించేశారు.



ఒక్కగానొక్క కొడుకు... మంచి ఉద్యోగం... అతడు వివాహం చేసుకోకుండా సన్యాసిగా మారడం ఇష్టం లేని రామయోగి ఎలక్షన్‍కు వేసిన నామినేషన్‍ను విత్‍డ్రా చేసుకొన్నారు. రెండవరోజు వచ్చి ఆ విషయాన్ని మీ నాన్నగారికి తెలియజేశాడు. మీ నాన్నగారికి ఎంతో ఆనందం.
వాణిని పిలిపించి...



’చూడు వాణీ!... నేను నీ విషయాన్ని గురించి... మీ అమ్మానాన్నలతో మాట్లాడాను. కానీ వారు కళ్యాణ్‍తో నీ వివాహాన్ని జరిపించేదానికి అంగీకరించలేదు. నన్ను అవమానించారు. కానీ!. నీవు నీ నిర్ణయాన్ని నన్ను నీ తండ్రిగా భావించి చెప్పినందుకు... నేను నీ వివాహాన్ని నీవు ప్రేమించిన కళ్యాణ్‍తో జరిపిస్తాను. అతనికి ఇప్పుడు ఢిల్లీలో వుద్యోగం వచ్చింది. హాయిగా పెళ్ళి అయిన తర్వాత మీ ఇరువురూ ఢిల్లీకి వెళ్ళిపోండి. ఇక మీ అమ్మా నాన్నల విషయం అంటావా!... ఈనాటి కోపం... కలకాలం వుండబోదు. కాలం వారి మనస్తత్వాలను తప్పక త్వరలోనే మారుస్తుంది. మనస్సుకు నచ్చిన వాడితో సహజీవనం ఎంతో ఆనందంగా వుంటుందమ్మా. ఎం.ఎస్సీ వరకూ చదివినదానివి నీకెందుకమ్మా భయం. నీకు ఎప్పుడు ఏది కావాలన్నా... నాకు ఫోన్ చేయ్యి నీవు నా మేనకోడలివి. నీవు ఆనందంగా జీవితం సాగించేలా చేయడం నా ధర్మం.... భయపడకు... బాధపడకు’



ఆ రీతిగా... చెప్పి వాణిని తన వశం చేసుకొన్నాడు మీ తండ్రి. కన్న తల్లిదండ్రుల కన్నా మిన్నగా వాణి నీ నాన్నను నమ్మింది. మీ అత్తయ్యా, మామయ్యా శ్రీశైలం యాత్రకు వెళ్ళారు. ఆ సమయంలో రిజిష్ట్రార్ ఆఫీసులో వాణి, కళ్యాణ్‍లకు మీ నాన్నగారు వివాహం జరిపించారు. రెండు రోజుల తర్వాత వారితో కలిసి చెన్నై వెళ్ళి వారిని విమానంలో ఢిల్లీ పంపారు.



నాలుగురోజుల తర్వాత యాత్రనుండి తిరిగి వచ్చిన మీ అత్తయ్య మామలకు మాధవయ్య బావగారు వూర్లోలేని సమయంలో జరిగిన వాణి, కళ్యాణ్‍ల వివాహాన్ని గురించి... వారు ఢిల్లీకి వెళ్ళిపోయిన విషయాన్ని గురించి తెలియజేశాడు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం - by k3vv3 - 02-10-2024, 01:34 PM
RE: నేటి బాంధవ్యాలు - by sri7869 - 02-10-2024, 09:45 PM
RE: నేటి బాంధవ్యాలు - by k3vv3 - 04-10-2024, 09:49 AM
RE: నేటి బాంధవ్యాలు - by k3vv3 - 04-10-2024, 09:52 AM
RE: నేటి బాంధవ్యాలు - by k3vv3 - 04-10-2024, 09:53 AM
RE: నేటి బాంధవ్యాలు - by k3vv3 - 04-10-2024, 09:54 AM
RE: నేటి బాంధవ్యాలు - by k3vv3 - 04-10-2024, 09:54 AM
RE: నేటి బాంధవ్యాలు - by sri7869 - 04-10-2024, 09:11 PM
RE: నేటి బాంధవ్యాలు - by k3vv3 - 11-10-2024, 01:24 PM
RE: నేటి బాంధవ్యాలు - by k3vv3 - 11-10-2024, 01:26 PM
RE: నేటి బాంధవ్యాలు - by k3vv3 - 11-10-2024, 01:26 PM
RE: నేటి బాంధవ్యాలు - 2 - by sri7869 - 11-10-2024, 02:09 PM
RE: నేటి బాంధవ్యాలు - 2 - by Uday - 11-10-2024, 05:17 PM
RE: నేటి బాంధవ్యాలు - 2 - by k3vv3 - 21-10-2024, 09:07 AM
RE: నేటి బాంధవ్యాలు - 3 - by k3vv3 - 21-10-2024, 09:09 AM
RE: నేటి బాంధవ్యాలు - 3 - by k3vv3 - 21-10-2024, 09:11 AM
RE: నేటి బాంధవ్యాలు - 3 - by TheCaptain1983 - 25-10-2024, 05:23 AM
RE: నేటి బాంధవ్యాలు - 3 - by sri7869 - 22-10-2024, 01:09 PM
RE: నేటి బాంధవ్యాలు - 3 - by Rani125 - 24-10-2024, 01:24 PM
RE: నేటి బాంధవ్యాలు - 3 - by k3vv3 - 09-11-2024, 12:15 PM
RE: నేటి బాంధవ్యాలు - 3 - by k3vv3 - 09-11-2024, 12:18 PM
RE: నేటి బాంధవ్యాలు - 3 - by k3vv3 - 09-11-2024, 12:19 PM
RE: నేటి బాంధవ్యాలు - 3 - by k3vv3 - 09-11-2024, 12:21 PM
RE: నేటి బాంధవ్యాలు - 3 - by TheCaptain1983 - 09-11-2024, 10:28 PM
RE: నేటి బాంధవ్యాలు - 4 - by sri7869 - 10-11-2024, 10:34 PM
RE: నేటి బాంధవ్యాలు - 4 - by k3vv3 - 21-11-2024, 01:05 PM
RE: నేటి బాంధవ్యాలు - 4 - by k3vv3 - 21-11-2024, 01:06 PM
RE: నేటి బాంధవ్యాలు - 4 - by k3vv3 - 21-11-2024, 01:08 PM
RE: నేటి బాంధవ్యాలు - 4 - by TheCaptain1983 - 25-11-2024, 05:08 AM
RE: నేటి బాంధవ్యాలు - 5 - by sri7869 - 21-11-2024, 08:45 PM
RE: నేటి బాంధవ్యాలు - 5 - by k3vv3 - 05-12-2024, 02:28 PM
RE: నేటి బాంధవ్యాలు - 5 - by k3vv3 - 05-12-2024, 02:29 PM
RE: నేటి బాంధవ్యాలు - 6 - by sri7869 - 11-12-2024, 03:27 AM
RE: నేటి బాంధవ్యాలు - 6 - by k3vv3 - 17-12-2024, 02:16 PM
RE: నేటి బాంధవ్యాలు - 6 - by k3vv3 - 17-12-2024, 02:17 PM
RE: నేటి బాంధవ్యాలు - 6 - by k3vv3 - 17-12-2024, 02:18 PM
RE: నేటి బాంధవ్యాలు - 6 - by k3vv3 - 17-12-2024, 02:20 PM
RE: నేటి బాంధవ్యాలు - 6 - by TheCaptain1983 - 19-12-2024, 06:41 AM
RE: నేటి బాంధవ్యాలు - 6 - by sri7869 - 18-12-2024, 10:04 AM
RE: నేటి బాంధవ్యాలు - 6 - by k3vv3 - 24-12-2024, 05:29 PM
RE: నేటి బాంధవ్యాలు - 6 - by k3vv3 - 24-12-2024, 05:31 PM
RE: నేటి బాంధవ్యాలు - 6 - by k3vv3 - 24-12-2024, 05:32 PM
RE: నేటి బాంధవ్యాలు - 6 - by k3vv3 - 24-12-2024, 05:33 PM
RE: నేటి బాంధవ్యాలు - 6 - by k3vv3 - 24-12-2024, 05:39 PM
RE: నేటి బాంధవ్యాలు - 6 - by TheCaptain1983 - 24-12-2024, 09:46 PM
RE: నేటి బాంధవ్యాలు - 8 - by sri7869 - 29-12-2024, 04:33 PM
RE: నేటి బాంధవ్యాలు - 8 - by k3vv3 - 03-01-2025, 09:26 AM
RE: నేటి బాంధవ్యాలు - 8 - by k3vv3 - 03-01-2025, 09:28 AM
RE: నేటి బాంధవ్యాలు - 8 - by k3vv3 - 03-01-2025, 09:29 AM
RE: నేటి బాంధవ్యాలు - 8 - by k3vv3 - 03-01-2025, 09:30 AM
RE: నేటి బాంధవ్యాలు - 9 - by sri7869 - 03-01-2025, 11:05 PM
RE: నేటి బాంధవ్యాలు - 9 - by k3vv3 - 10-01-2025, 09:38 PM
RE: నేటి బాంధవ్యాలు - 9 - by k3vv3 - 10-01-2025, 09:39 PM
RE: నేటి బాంధవ్యాలు - 9 - by k3vv3 - 10-01-2025, 09:40 PM
RE: నేటి బాంధవ్యాలు - 9 - by k3vv3 - 10-01-2025, 09:41 PM
RE: నేటి బాంధవ్యాలు - 9 - by k3vv3 - 10-01-2025, 09:42 PM
RE: నేటి బాంధవ్యాలు - 10 - by sri7869 - 10-01-2025, 10:26 PM
RE: నేటి బాంధవ్యాలు - 10 - by k3vv3 - 22-01-2025, 09:51 AM
RE: నేటి బాంధవ్యాలు - 10 - by k3vv3 - 22-01-2025, 09:52 AM
RE: నేటి బాంధవ్యాలు - 10 - by k3vv3 - 22-01-2025, 09:54 AM
RE: నేటి బాంధవ్యాలు - 10 - by k3vv3 - 22-01-2025, 09:55 AM
RE: నేటి బాంధవ్యాలు - 10 - by k3vv3 - 22-01-2025, 09:58 AM
RE: నేటి బాంధవ్యాలు - 10 - by k3vv3 - 22-01-2025, 10:01 AM
RE: నేటి బాంధవ్యాలు - 11 - by sri7869 - 22-01-2025, 10:22 AM
RE: నేటి బాంధవ్యాలు - 11 - by k3vv3 - 30-01-2025, 11:46 AM
RE: నేటి బాంధవ్యాలు - 11 - by k3vv3 - 30-01-2025, 11:48 AM
RE: నేటి బాంధవ్యాలు - 11 - by k3vv3 - 30-01-2025, 11:49 AM
RE: నేటి బాంధవ్యాలు - 11 - by sri7869 - 30-01-2025, 11:51 AM
RE: నేటి బాంధవ్యాలు - 11 - by k3vv3 - 30-01-2025, 11:51 AM
RE: నేటి బాంధవ్యాలు - 11 - by TheCaptain1983 - 31-01-2025, 06:05 AM
RE: నేటి బాంధవ్యాలు - 12 - by sri7869 - 30-01-2025, 12:17 PM
RE: నేటి బాంధవ్యాలు - 12 - by k3vv3 - 07-02-2025, 12:53 PM
RE: నేటి బాంధవ్యాలు - 12 - by k3vv3 - 07-02-2025, 12:55 PM
RE: నేటి బాంధవ్యాలు - 12 - by k3vv3 - 07-02-2025, 12:58 PM
RE: నేటి బాంధవ్యాలు - 12 - by k3vv3 - 07-02-2025, 01:01 PM
RE: నేటి బాంధవ్యాలు - 12 - by k3vv3 - 07-02-2025, 01:04 PM
RE: నేటి బాంధవ్యాలు - 12 - by TheCaptain1983 - 09-02-2025, 08:59 PM
RE: నేటి బాంధవ్యాలు - 13 - by k3vv3 - 24-02-2025, 11:23 AM
RE: నేటి బాంధవ్యాలు - 13 - by k3vv3 - 24-02-2025, 11:24 AM
RE: నేటి బాంధవ్యాలు - 13 - by k3vv3 - 24-02-2025, 11:26 AM
RE: నేటి బాంధవ్యాలు - 13 - by k3vv3 - 24-02-2025, 11:28 AM
RE: నేటి బాంధవ్యాలు - 13 - by TheCaptain1983 - 26-02-2025, 06:55 AM
RE: నేటి బాంధవ్యాలు - 14 - by k3vv3 - 08-03-2025, 09:52 AM
RE: నేటి బాంధవ్యాలు - 14 - by k3vv3 - 08-03-2025, 09:53 AM
RE: నేటి బాంధవ్యాలు - 14 - by k3vv3 - 08-03-2025, 09:55 AM
RE: నేటి బాంధవ్యాలు - 14 - by k3vv3 - 08-03-2025, 09:57 AM
RE: నేటి బాంధవ్యాలు - 14 - by TheCaptain1983 - 08-03-2025, 08:58 PM
RE: నేటి బాంధవ్యాలు - 14 - by k3vv3 - 08-03-2025, 10:07 AM
RE: నేటి బాంధవ్యాలు - 14 - by k3vv3 - 08-03-2025, 10:09 AM
RE: నేటి బాంధవ్యాలు - 14 - by TheCaptain1983 - 08-03-2025, 09:01 PM
RE: నేటి బాంధవ్యాలు - 15 - by k3vv3 - 08-03-2025, 09:55 PM
RE: నేటి బాంధవ్యాలు - 15 - by TheCaptain1983 - 08-03-2025, 10:23 PM
RE: నేటి బాంధవ్యాలు - 15 - by k3vv3 - 16-03-2025, 10:02 AM
RE: నేటి బాంధవ్యాలు - 15 - by k3vv3 - 16-03-2025, 10:04 AM
RE: నేటి బాంధవ్యాలు - 15 - by k3vv3 - 16-03-2025, 10:05 AM
RE: నేటి బాంధవ్యాలు - 15 - by k3vv3 - 16-03-2025, 10:10 AM
RE: నేటి బాంధవ్యాలు - 15 - by TheCaptain1983 - 16-03-2025, 09:22 PM
RE: నేటి బాంధవ్యాలు - 16 - by k3vv3 - 27-03-2025, 09:48 AM
RE: నేటి బాంధవ్యాలు - 16 - by k3vv3 - 27-03-2025, 09:50 AM
RE: నేటి బాంధవ్యాలు - 16 - by k3vv3 - 27-03-2025, 09:51 AM
RE: నేటి బాంధవ్యాలు - 16 - by k3vv3 - 27-03-2025, 09:52 AM
RE: నేటి బాంధవ్యాలు - 16 - by k3vv3 - 27-03-2025, 09:53 AM
RE: నేటి బాంధవ్యాలు - 16 - by TheCaptain1983 - 29-03-2025, 06:09 AM
RE: నేటి బాంధవ్యాలు - 17 - by k3vv3 - 06-04-2025, 09:58 AM
RE: నేటి బాంధవ్యాలు - 17 - by k3vv3 - 06-04-2025, 10:00 AM
RE: నేటి బాంధవ్యాలు - 17 - by k3vv3 - 06-04-2025, 10:01 AM
RE: నేటి బాంధవ్యాలు - 17 - by k3vv3 - 06-04-2025, 10:04 AM
RE: నేటి బాంధవ్యాలు - 17 - by k3vv3 - 06-04-2025, 10:08 AM
RE: నేటి బాంధవ్యాలు - 17 - by TheCaptain1983 - 10-04-2025, 07:58 AM
RE: నేటి బాంధవ్యాలు - 18 - by k3vv3 - 16-04-2025, 12:41 PM
RE: నేటి బాంధవ్యాలు - 18 - by k3vv3 - 16-04-2025, 12:43 PM
RE: నేటి బాంధవ్యాలు - 18 - by k3vv3 - 16-04-2025, 12:44 PM
RE: నేటి బాంధవ్యాలు - 18 - by k3vv3 - 16-04-2025, 12:45 PM
RE: నేటి బాంధవ్యాలు - 18 - by k3vv3 - 16-04-2025, 12:48 PM
RE: నేటి బాంధవ్యాలు - 18 - by TheCaptain1983 - 17-04-2025, 04:18 AM
RE: నేటి బాంధవ్యాలు - 19 - by k3vv3 - 24-04-2025, 05:03 PM
RE: నేటి బాంధవ్యాలు - 19 - by k3vv3 - 24-04-2025, 05:04 PM
RE: నేటి బాంధవ్యాలు - 19 - by k3vv3 - 24-04-2025, 05:06 PM
RE: నేటి బాంధవ్యాలు - 19 - by k3vv3 - 24-04-2025, 05:07 PM
RE: నేటి బాంధవ్యాలు - 19 - by k3vv3 - 24-04-2025, 05:09 PM
RE: నేటి బాంధవ్యాలు - 19 - by k3vv3 - 24-04-2025, 05:10 PM
RE: నేటి బాంధవ్యాలు - 19 - by TheCaptain1983 - 25-04-2025, 09:16 AM
RE: నేటి బాంధవ్యాలు - 20 - by k3vv3 - 01-05-2025, 04:47 PM
RE: నేటి బాంధవ్యాలు - 20 - by k3vv3 - 01-05-2025, 04:49 PM
RE: నేటి బాంధవ్యాలు - 20 - by k3vv3 - 01-05-2025, 04:50 PM
RE: నేటి బాంధవ్యాలు - 20 - by TheCaptain1983 - 02-05-2025, 05:46 AM
RE: నేటి బాంధవ్యాలు - 20 - by k3vv3 - 01-05-2025, 04:52 PM
RE: నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం - by k3vv3 - 01-05-2025, 04:59 PM
RE: నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం - by TheCaptain1983 - 02-05-2025, 05:44 AM
RE: నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం - by parinda35 - 17-10-2026, 06:01 PM



Users browsing this thread: 1 Guest(s)