Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - 6
#20
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 4

ఉదయం... ఎనిమిదిన్నరకు టిఫిన్ తిని దీప్తి తన గదికి వెళ్ళిపోయింది. తను హరికృష్ణ ఇంటికి వెళ్ళివచ్చాక తనకు తండ్రికి మధ్యన, తండ్రికి తల్లికి మధ్యన జరిగిన సంభాషణ, ప్రజాపతి ధోరణి... దీప్తికి విచిత్రంగా తోచాయి. తాను అమెరికాకు వెళ్ళేరోజున జరిగిన సంఘటన ఆమె కళ్ళముందు నిలిచింది.



హరికృష్ణ, లావణ్య వారి పెద్దకొడుకు దినకర్ అతని భార్య పద్మిని, కూతురు వాణి, తన తండ్రి ప్రజాపతి, తల్లి ప్రణవి, తమ్ముడు సీతాపతి, బాబాయ్ మాధవయ్య తనతో చెన్నైకి వచ్చారు.
దారి పొడుగునా సరదా సరదా కబుర్లు... ఇకఇకలు పకపకలు.. అందరూ ఎంతో ఆనందంగా దీప్తికి వీడ్కోలు చెప్పేదానికి చెన్నై ఎయిర్పోర్టుకు చేరారు.



అంతమంది తనవారిని వదిలి... తన పట్టుదలతో అమెరికాలో డాక్టర్ కావాలని బయలుదేరింది దీప్తి. రోజు దివాకర్ అతని భార్య పద్మినీ కూడా అమెరికాకు తిరిగి పయనం.



అందరూ ఎయిర్పోర్టులో వ్యాన్ దిగారు. అత్త లావణ్య దీప్తి దగ్గరకు వచ్చి తన చేతులతో ఆమె భుజాలు పట్టుకొని "దీపూ!... నీవు మా నుండి దూరంగా దేశంకాని దేశానికి వెళుతున్నావు. బాగా చదివి నీ లక్ష్యాన్ని సాధించు. వారి సాంప్రదాయాలకు, మన సాంప్రదాయాలకు ఎంతో వ్యత్యాసం. అక్కడి సమాజంలో జాగ్రత్తగా మసలుకోవాలి. వెళ్ళిన పనిని సవ్యంగా ముగించుకొని తిరిగి రావాలి. మన కుటుంబాల గౌరవ మర్యాదలను మరువకూడదు. నా కోడలుగా వెళ్ళే నీవు... నా కోడలిగానే తిరిగి రావాలి. జాగ్రత్తరా... నేను చెప్పినవన్నీ మనస్సున వుంచుకో. మరువకు..." క్షణంలో లావణ్య కళ్ళల్లో కన్నీరు. వాటిని చూచిన దీప్తి... మిగతా అందరి కళ్ళూ చెమ్మగిల్లాయి.
"ఆఁ.... అదిగో మీ ఫ్లయిట్కే అనౌన్స్ మెంటు బయలుదేరమ్మా!" అంది లావణ్య.



దివాకర్, పద్మిని, అత్తామామలకు, అమ్మా, నాన్నలకు వెళ్ళొస్తాం అని చెప్పి ఎయిర్పోర్టులో ప్రవేశించారు. అందరికీ వీడ్కోలు చెప్పిన దీప్తి.... వారి వెనకాలే ఎయిర్పోర్టులో ప్రవేశించింది. నలభై ఐదు నిముషాల తర్వాత ముగ్గురూ ఎక్కిన విమానం టేకాఫ్ను చూచి మిగిలినవారు, తమ వూరు గూడూరుకు బయలుదేరారు.



అంతటి ప్రేమాభిమానాలతో ఏక కుటుంబంగా వున్న యీ రెండు కుటుంబాలు నేడు రీతిగా... రాకపోకలు లేకుండా విరోధుల్లా ఎలా మారిపోయారు?... ఏదో బలమైన కారణం వుండి వుండాలి!... అది నాకు తెలియాలి... మామయ్య ఎవరినీ అడగవద్దని ఆంక్ష పెట్టాడు. అడగలేను... భగవాన్! నీవే నాకు సాయం చేయాలి తండ్రీ!...



తాను నమ్మిన గురుదేవులు శ్రీరమణ భగవానులను దీనంగా వేడుకొంది దీప్తి. తల్లి ప్రణవి దీప్తి గదిలోకి ప్రవేశించింది.
"దీపూ!... ఏం చేస్తున్నావ్!"



పడుకొని గతానికి సంబంధించిన ఆలోచనలతో వున్న దీప్తి... తల్లి పిలుపు విని లేచి మంచంపైన కూర్చుంది. చిరునవ్వుతో తల్లి ముఖంలోకి చూచింది.



ప్రణవి మంచంపైన కూర్చుంది. దీప్తి ముఖంలోకి చూచింది. ఆమె దేన్ని గురించో ఆలోచిస్తున్నదనే భావన... ప్రణవికి దీప్తి ముఖంలో గోచరించింది.



"దీపూ!...."



"ఏమ్మా!..."



"దేన్ని గురించిరా... దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నావ్!..." చిరునవ్వుతో అడిగింది ప్రణవి.



"భవిష్యత్తును గురించి."



"ఎవరి భవిష్యత్తును గురించి!..."



"మన కుటుంబ భవిష్యత్తును గురించి."



"నీ గురించి కాదా!..."



"నేను అన్న మన అనేదాంట్లో నేనూ వుంటాను కదా అమ్మా!..." చిరునవ్వుతో చెప్పింది దీప్తి.



"ఆఁ.... అవునవును... మీ బావ...." ఆగిపోయింది ప్రణవి.



"ఏమ్మా ఆపావు?..."



"తప్పుగా అనుకోకు..."



"అనుకోను..."



"నీతో మాట్లాడాడ?..."



"లేదు..."



"ఎలా మాట్లాడుతాడు!..." నిట్టూర్చింది ప్రణవి.



"ఎందుకని?..."



"మీ నాన్నగారి మహిమ...."



"అంటే!..."



" కుటుంబానికి కుటుంబానికి నిప్పు అంటించింది మీ నాన్నగారేగా!"



"నీ మాటలు నాకు అర్థం కాలేదమ్మా!..."



" కుటుంబానికి మీ నాన్నగారు చేసిన అన్యాయాన్ని తలచుకొంటే నా మనస్సుకు ఎంతో బాధ. నీవు అమెరికాలో వుంటివి నీకేం తెలీదుగా!.."



అవునన్నట్లు తల ఆడించింది దీప్తి.
"నేను వివరంగా చెబుతాను విను. హరికృష్ణ అన్నయ్యగారి కూతురు వాణి ఎందుకు లేచిపోయిందో నీకు తెలీదు కదా!"



"తెలీదు. కానీ పెద్దబావ దినకర్ అమెరికాలో నాతో నీవు అన్నమాటనే... అంటే వాణి ఎవరితోనో లేచిపోయిందని" దీప్తి ముగించకముందే....
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 3 - by k3vv3 - 09-11-2024, 12:15 PM



Users browsing this thread: 2 Guest(s)