Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక కథలు - ఇల
#9
"మానినీ మణి.. ఇలలో నీ అంత అందగత్తె మరొకరు లేరన్నది అక్షర సత్యం. ముఖ్యంగా నీ అందంలో జ్ఞాన తేజం జ్ఞానవంతంగ వెలుగుతుంది. నీలాంటి జ్ఞాన తేజ అందగత్తె ఇలలోనే కాదు పదునాలుగు లోకాలలో ఎక్కడా ఉండదన్నది నిజం నిజం నిజం. ఇంతకీ నీ పేరేమిటి?" అని బుధుడు ఇలను అడిగాడు. 



ఇల గుర్రం దిగి బుధుని ఆపాదమస్తకం ఒకసారి పరిశీలించింది. " తపోధన.. ప్రస్తుతం నా పేరేమిటో నాకే గుర్తు రావడం లేదు. నేనైతే ప్రదేశానికి చెందిన దానిని కాదు. నేనిక్కడకు ఎలా వచ్చానో నాకు అసలు జ్ఞాపకం రావడం లేదు. నన్నేదో మాయావలయం ఆవరించింది అని నాకు అనిపిస్తోంది. ఇంతకీ తమరెవరు?" అని ఇల బుధుని అడిగింది. 



"నా పేరు బుధుడు. తారాశశాంకాల తనయుడుని. నా తలిదండ్రుల వివాహ విధానం తలచుకుని ఇప్పటికీ కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. నన్ను చూసి సహ్యం గాని రీతిలో నవ్వుకుంటున్నారు. వారి నవ్వును ఎదుర్కొనే శక్తి నాకు లేదు. అందుకే నేను ఇక్కడకు వచ్చి తపస్సు చేసుకుంటున్నాను. అదిసరే నువ్వు కొంత కాలం ఇక్కడే ఉండు. ఇక్కడకు ఎందుకు వచ్చావో ఎలా వచ్చావో నెమ్మదిగా గుర్తు చేసుకో. " అని బుధుడు ఇలతో అన్నాడు. 



 ఇలకు బుధుని మాటలు నచ్చాయి. బుధునితో ఇల అలాగే అంది. బుధుడు ఇలకు ప్రత్యేక పర్ణశాలను ర్పాటు చేసాడు. 



ఇల తన గతాన్ని మరిచిపోయింది కానీ పుట్టుక తో వచ్చిన జ్ఞానంను మాత్రం మరిచిపోలేదు. ఇల పఠించే ఋగ్వేద మంత్రాల ఉదాత్తానుదాత్త స్వరాల గణిత చక్రాలు బుధుని మనసును ఆకర్షించాయి. ఇల ఖాళీ సమయంలో తన దగ్గర ఉన్న గుర్రం దగ్గరకు వెళ్ళి దానిని పరిశీలించేది. అలా తను అక్కడకు ఎలా వచ్చింది తెలుసుకోవడానికి ప్రయత్నించేది. 



 ఒకనాడు ప్రాంతంలో రాళ్ళ వర్షం కురిసింది. ఇల తన ఋగ్వేద పఠనంతో రాళ్ళ వర్షాన్ని ఆపగలిగింది. ఇల ఋగ్వేద పఠన ప్రభావం తో బుధుని తలమీద పడబోతున్న కొండరాయి ముక్కలు ముక్కలయ్యింది. అయితే ఆమె ఎంత ఆలోచించినా ఆమె గతం ఆమెకు గుర్తుకు రాలేదు. 



 ఇలా కొంత కాలం గడిచిపోయింది. ఇలాబుధులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అక్కడ ఉన్న మహర్షుల సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి పురూరవుడు అని పేరు పెట్టారు. 
 ఒకనాడు వశిష్ట మహర్షి ఇలాబుధులు ఉన్న ప్రాంతమునకు వచ్చాడు. ఇల వశిష్ట మహర్షి ని గుర్తు పట్టింది. వశిష్ట మహర్షి తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు. 



వశిష్ట మహర్షి బుధునికి ఇల ఎవరో సమస్తం వివరించి చెప్పాడు. వైవస్వత మను దంపతులను, అగస్త్యాది మహర్షులను అక్కడికి రప్పించాడు. 



అగస్త్య మహర్షి మిత్రావరుణుల సహకారంతో, పార్వతీపరమేశ్వరుల కృపతో ఇలను సుద్యుమ్నునిగ మార్చాడు. సుద్యుమ్నుడుగ మారిన ఇల బుధుని, తన కుమారుడు పురూరవుని గుర్తు పట్టలేక పోయింది. 



బుధుడు అగస్త్య మహర్షికి నమస్కారం చేసి, , " మహర్షోత్తమ! ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటో మీరే సెల వివ్వాలి. " అని అన్నాడు. 



బుధుని మాటలను విన్న అగస్త్య మహర్షి, " శశాంక పుత్ర బుధ! ఇల స్త్రీగానే పుట్టింది. ఆమె తనువు స్త్రీత్వం లోనే దేదీప్యమానంగా విజ్ఞానవంతంగ ప్రకాశిస్తుంది. ఆమె తలిదండ్రుల చిరుకోరిక కారణంగా ఇల సుద్యుమ్నుడుగా లింగ మార్పిడి కి గురయ్యింది. 



ఇల వాక్ దేవత ఇడా స్వరూపం. ఇడా స్వరూపంలో సరస్వతీ తేజం, పుంభావ సరస్వతీ తేజం రెండూ ఉంటాయి. అందుకే ఇల సుద్యుమ్నునిగా కూడా కొంత కాలం ఉండగలిగింది. 
ఇల ఇకపై ఇలగానే ఉం టుంది. చంద్రవంశ బీజ తేజంగా యశసిస్తుంది. " అని పార్వతీపరమేశ్వరులను పూజించి, మిత్రావరుణుల సహాయంతో అగస్త్య మహర్షి సుద్యుమ్నుని ఇల గా మార్చాడు. 



 ఇల అక్కడ ఉన్న వారందరిని చూసింది. అందరికి నమస్కరించింది. కుమారుని దగ్గరకు తీసుకుంది. బుధుని సమీపించింది.. 



అప్పుడే అక్కడకు వచ్చిన నారద మహర్షి ఇల కు నవాక్షర మంత్రం ను నేర్పాడు. ఇల నవాక్షర మంత్రాన్ని శాస్త్రోక్తంగా పఠించింది. అప్పుడు మిత్రవరుణ ఇంద్రాగ్నుల తేజం వధూపీఠ ద్వజం మీద వెలుగొందాయి. ఇల తేజంలో నిలిచి వాక్ దేవత ఇడా గా అందరికి దర్శనం ఇచ్చింది. ఆపై వాక్ దేవత ఇడా ఇల గా అందరి ముందు నిలిచింది. 



ఇల సరస్వతీ నది ఒడ్డున పవిత్ర ప్రదేశాన్ని ఎన్నుకుంది. అక్కడ నియమబద్ధంగా, ఆచార బద్దంగా అనేక యాగాలను మహర్షులతో చేయించింది. యాగంలో పా ల్గొన్న వారందరికీ తనే స్వయంగా భోజనం చేసి పెట్టింది. 



 ఒకనాడు యాగమునకు కావల్సిన నెయ్యి సకాలంలో మహర్షులకు అందలేదు. అప్పుడు ఇల వాక్ దేవత ఇడా గా మారి నెయ్యి కారుతున్న పాదాలతో గోబృందం నడుమ నిలబడింది . మహర్షులు ఋగ్వేద మంత్రోక్తులతో ఇడ పాదాల నుండి కారుతున్న నేతిని యాగం నిమిత్తం స్వీకరించారు . ఆపై "ఓం ఇల్లాయ నమః"అంటూ మహర్షులు ఇల ను స్తుతించారు. 



అలా ఇల ఘృతపది అయ్యింది. ఇల యాగాలు చేయించిన ప్రదేశాన్ని అందరూ ఇలా భూమి అని పిలవసాగా
రు. 

 వైవస్వత మను దంపతుల, మహర్షుల సూర్యచంద్రాది దేవతల ఆశీస్సులతో ఇలాబుధులు అన్యోన్యంగా జీవించారు. వారికి పురూరవునితో పాటు, ఉత్కళ, గయ, వినతాశ్వ అనే పేర్లుగల కుమారులు కూడా కలిగారు



                    శుభం భూయాత్ 

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - ఇల - by k3vv3 - 30-10-2024, 08:37 AM



Users browsing this thread: 3 Guest(s)