Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - ఆ కొందరి వలన
#34
సినిమా సుబ్బారావు - Achanta gopalakrishna
[Image: image-2024-10-29-123303214.png]

ఏమోయ్ వంట అయ్యిందా?
కాలేజ్ కి టైం అవుతోంది అంటూ అరిచాడు సుబ్బారావు. .
సుబ్బారావు ప్రైమరీ కాలేజ్లో టీచర్ గా పని చేస్తున్నాడు . పొద్దున్నే ట్యూషన్స్ చెప్పి కాలేజ్ కి వెళతాడు ప్రతి రోజు . సాయంత్రం ఇంట్లోనే ఉంటాడు . అసమయమంతా యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు .
అతనికి సినిమా పిచ్చి .ఎప్పటికైనా సినిమాలలో చేయాలని కోరిక .
అందుకే అద్దం ముందు నుంచుని డైలాగ్స్ అవీ ప్రాక్టీసు చేస్తూ ఉంటాడు.
ఒక్కోసారి భార్యని కూర్చోమని. సినిమాలలో డైలాగ్స్ చెప్తూ ఉంటాడు . ఆవిడకి ఇవేమీ నచ్చవు. కానీ వినేదాకా వదలడు అని వింటూ ఉంటుంది.
ఆ రోజు సాయంత్రం ఇంటికి రాగానే ఏమోయ్ ఒక కప్పు కాఫీ పడేయి .
ఇవాళ అన్నగారి డైలాగ్స్ దానవీరసూరకర్ణ సినిమాలోవి ప్రాక్టీస్ చెయ్యాలి అన్నాడు . ఓరి దేవుడా , ఈయనికి ఈ సినిమా పిచ్చి ఎందుకు తగిలించావు స్వామీ ...
అంటూ తల కొట్టుకుని ,
కాఫీ తో వచ్చింది.
ఇదిగో కాఫీ మీ మాటలు వింటూ కూర్చుంటే , అవతల నా పని ఎవరు చేస్తారు, వంట అవ్వాలి కదా అంటూ విసుక్కుంది .
నన్ను ఏమైనా అంటే అను కానీ నా సినిమాని ఏమైనా అన్నావంటే ఊరుకోను . అదొక దైవదత్తమైనటువంటి కళ అంటూ, శంకర రావు లా ఓ డైలాగ్ చెపుతూ,
కాఫీ తాగాడు .
అబ్బా అంటూ అరిచాడు .. నోరు... కాలిపోయింది .
ఇంత వేడిగా ఇచ్చావేమిటి నీ దుంప తెగ , అంటూ అరిచాడు. .
ఆ డైలాగ్స్ లో పడి ఎలాగూ మర్చి పోవడం , నేను మళ్ళీ వెచ్చబెట్టి తేవడం రోజు అలవాటు అయ్యిపోయింది అందుకే ఏకంగా వేడి చేసేసా ముందు జాగ్రత్త కోసం అంది.
నీ జాగ్రత్త తగలెయ్య ,
నోరు కాలిపోయింది.
ఇప్పుడు డైలాగు సరిగా వస్తుందో రాదో అంటూ ఊదుకుని తాగేసాడు .
ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.
ఏమంటివి ఏమంటివి అంటూ. .ఇంతలో ఫోన్ మోగింది .... ఏమోయ్ ఫోన్ చూడు అన్నాడు.
విసుక్కుంటూ వచ్చింది. మీ పక్కనే ఉందిగా కాస్త తీసి మాట్లాడొచ్చుకదా అంది .
అయ్యగారు బిజీ గా వున్నారు కనబడడం లేదా ... తొందరగా తియ్యి .
వాళ్ళు కట్ చేస్తే మళ్ళీ మనం చెయ్యాలి. మనకెందుకు బిల్లు అంటూ మళ్ళీ ప్రాక్టీసులోకి వెళ్లి పోయాడు .
ఫోన్ కూతురి దగ్గరనుంచి .
అమ్మా ఎలా వున్నావే అడిగింది.
ఇదిగో ఇలా ఆ కాలేజ్ కి వెళ్ళినప్పుడే కాస్త ప్రశాంతత .
సాయంత్రం అయితే చాలు ఇదే గోల .
పైగా నన్ను కూర్చోపెట్టి వాయించేస్తాడు . ఆయన దెబ్బకి భయపడి ఫ్రెండ్స్ కూడా ఇంటికి రావడం మానేశారు.
ఎవరికీ చెప్పుకోను ......... ఈ వయసులో మీకిదేం పిచ్చండి అంటే . కళకు వయసుతో పని లేదు అని చెప్పాడట ఎవడో .
వాడు గానీ కనబడితే ఉతికి ఆరేయాలని ఉంది ...
మొన్నటికిమొన్న పాలవాడు పాలు పట్టుకు వస్తే , ఆపి నాలుగు డైలాగులు వినిపించారు .పాపం ఈ లోగా ఆ సైకిల్ ని ఎవరో గుద్దేసి పోయారు పాలన్నీ ఒలికిపోయాయి అంటూ గోల పెట్టాడు. ఒలికిపోయిన పాలడబ్బులు ఇస్తారా ,చస్తారా అని కూర్చుంటే ఒక 500 ఇచ్చి పంపించారు.
నిన్నటికి నిన్న
రాత్రివేళ ఇంటికి వస్తూ ఉంటే ఈయనిని చూసి పక్కింటి వాళ్ళ కుక్క మొరిగిందని దానికి చెలియో చెల్లకో అని పద్యం వినిపించారట , ఆదెబ్బకు కుక్క మొరగడమే , మానేసిందట దాంతో ఈయనే ఎదో చేశారని గొడవకి వచ్చారు.
ఇలా వుందే అమ్మడు నా బతుకు .
ఈ సమస్యకు పరిష్కారం ఏమైనా ఉంటే చూడవే అంటూ అడిగింది.
అలాగేలే ఇది రోజు వుండే భాగోతమేగా.
నీ వంట్లో ఎలావుందీ.
ఆ కళ్ళు చూపించుకున్నావా అని అడిగింది .
ఎక్కడ పొద్దున్న ట్యూషన్స్ సాయంత్రం ఈగోల ... ఆదివారం డాక్టర్ ఉండడు.. ఏదో పని జరిగిపోతోందిలే .
అల్లుడుగారిని అడిగానని చెప్పు . వుంటాను మరి అంటూ ఫోన్ పెట్టేసింది . ఎవరూ అమ్మాయా అని అడిగాడు . అవును అంటే మరి పెట్టేసావేమి . నాకు ఇచ్చి ఉంటే రెండు డైలాగులు వినిపించేవాడిని కదా అన్నాడు. ఆ చాల్లెండి సంబరం దానినైన సుఖము గా ఉండనివ్వడి అంటూ వంటింట్లోకి వెళ్ళబొయింది , ఇదిగో ఒక్క డైలాగు వినేసి వెళ్లు అంటూ ఆపేసాడు డైలాగు చెప్తూ ముక్కు ఎగరేసాడు నేను డైలాగు చెప్తే ఎదుటి వాళ్లకి కోపం వస్తుంది అని తెలుసు గానీ మాడువాసన కూడా వస్తుందనుకోలేదు .
అది మీ డైలాగు ది కాదు. స్టో మీద కూర మాడిపోయిన వాసన అంటూ వంటింట్లోకి పరిగెత్తింది. మన ప్రాక్టీస్ దెబ్బకి కూర
మాడిపోయిందా లేక మరిచి పోవడం వలన మడిపోయిందా.... ఆ గాడిద గుడ్డు...ఇవాళ్టి కి చాలు గాని...ఎమోయ్ భోజనం వడ్డించేస్తావా..అంటూ అరిచాడు... ఇదిగో వడ్డించేస్తున్నా...రండి అంది....భోజనానికి కూర్చున్నాడు...

ఇవాళ భోజనాలు ,వింతైన వంటకాలు ..తాయారు వారి విందు ...ఒహోహో మాడిపోయే... అంటూ పాట అందుకున్నాడు...
అంతా మీ మూలంగానే... నా తప్పేమి లేదు అంటూ వడ్డించింది.అబ్బా చారు ఇలాగ ఉందే మీటే బాబు...నీళ్లు చింత పండు... తప్ప ఇంకేమి ఉన్నాయి... అన్నాడు..ఇవాళ చారు పౌడర్ అయిపోయింది.... రేపు బాగా చేస్తా నండి...అలాగే అంటున్నావు ప్రతిసారి... నీకు నామీద ప్రేమ తగ్గిందోయ్... అన్నాడు.ఏం దీనికి పాట లేదా...అంటూ వెటకారం గా అడిగింది.... ఎందుకు లేదు... ఇది గో విసురుతున్న...ప్రేమనగర్....పేరడీ...
" నీకు నేనంటే ప్రేమ లేదు...నాకు చావంటే భయం లేదు...ఈ చారు తో మరణిస్తాను...ఎవరికోసం... ఎవరికోసం
అంటూ పాట అందుకున్నాడు...

ఏమండీ... మీరు మరీనూ... ఆపండి మహాప్రభో...మీ జోలికి రాను... అంటూ దండం పెట్టింది...
ఇద్దరు నవ్వుకున్నారు...
ఆ మరునాడు ఉదయం పిల్లలు ట్యూషన్ కి వచ్చారు... సుబ్బారావు పడక కుర్చీ లో కూర్చుని పాఠం చెప్పేసి... హోమ్ వర్క్ లు చేసారో లేదో చూసి... ఇంక బయలుదేరండి... కాలేజీకి టైం అవుతోంది... అని పంపేశాడు. ఎమోయ్ కొంచెం కాఫీ ఇస్తావు.... కాలేజీకి టైం అవుతోంది... అని అన్నాడు...ఇదిగో ఇస్తున్నా...వేడిగా ఉంది చూసుకోండి... మళ్ళీ చెప్పలేదు అంటారు..అంది నాకు తెలుసు లేవోయ్...అంటూ ఉదుకుని తాగ బోయాడు. అంతలో పాము పాము అంటూ అరిచింది.పామా ఎక్కడే... అన్నాడు కంగారుగా... అక్కడే కాలు కింద పెట్టకండి... మీ కుర్చీ కిందే... ఉంది అంటూ అరిచింది. ఈ కంగారులో కాఫీ నోట్లో పొసుకుని నోరు కాలిపోయింది... చచ్చాన్రో బాబు అంటూ...అరిచాడు... ఈ లోగా గుండెల మీద పడింది కొంచెం....దీని కాఫీ తగలెయ్య ..ఇంత వేడిగా తగలేస్తుంది....తగలబడి పోయింది ఇక్కడ...నోరు..వళ్ళు... గ్లాసు వేడిగా ఉంది.... కాలు కింద పెట్టలేని పరిస్థితి....గ్లాస్ వేడిగా ఉంది..కింద పాము ఉంది...ఏదో ఒకటి చేయవే...నీ దుంప తెగ..అంటూ అరిచాడు...వణికి పోతూ... నేనేం చేయను...కావాలంటే కర్ర ఇస్తా...మీరే కొట్టండి.. అంది.నా కుర్చీ కింద నేనే ఎలా కొట్టనే...ఎవరి నైనా పిలు అన్నాడు...ఇంతలో పక్కింటి వెంకట్రావ్ వచ్చాడు....రండి అన్నయ్య గారు సమయానికి వచ్చారు... ఇదిగో ఈ కర్ర తీసుకుని మావారి కుర్చీ కింద పాము ఉంది కొంచెం కొట్టండి..అంది. నేనా..పామునా...నావల్లకాదు... అది వెళ్లి పోయాక వస్తాలే సుబ్బారావు...అంటూ పారిపోయాడు.... వెధవ ఈ సారి రాని... వాడి సంగతి చెపుతా....అనుకున్నాడు....
ఇంతలో మిలటరీ రంగనాధం అలా వెళుతుంటే ,అన్నయ్యా గారూ అంటూ పిలిచింది... ఎమ్మా పిలిచావు అంటూ వచ్చాడు.. జరిగింది చెప్పింది. ఏది ఆ కర్ర ఇటు ఇవ్వు నేను చూస్తాను అంటూ కర్ర తీసుకుని చూసాడు... తొందరగా దీన్ని తరిమేసి పుణ్యం కట్టుకోవయ్యా రంగనాధం.. అన్నాడు దీనంగా.. నువ్వు ఉండవయ్యా నన్ను చూడని ముందు... అంటూ కర్ర.తో కొట్టాడు...అది కదలలేదు.. దగ్గరికి వెళ్లి చూస్తే అది తాడు...ఓరిని తాడుని చూసి ఇంత రాద్ధాంతం చేసారా...అనిచేతితో తీసి పట్టుకుని చూపాడు...
చూసుకోవక్కర లేదా...ఎంత కంగారు పెట్టావు.... వొళ్ళు కాలింది కూడా...అన్నాడు గుండెలు రాసుకుంటూ....
ఆ నాకేం తెలుసు... నాకు సరిగా కనబడదు గా...
కళ్ళజోడు చేయించరు...నేనేమి చేసేది
..అంది...అమాయకంగా.
నువ్వు మరీనూ సుబ్బారావు... రేపే ఆ కళ్ళజోడు పని చూడు అంటూ క్లాస్ పీకి వెళ్లి పోయాడు...
ఇంతలో గడియారం గంట కొట్టింది... హమ్మో ఈ హడావిడి లో కాలేజ్ సంగతే మరచిపోయి నాను... ఇప్పుడు హెడ్ మాస్టారు తో తిట్లు తప్పవు... ముందు టిఫిన్ పెట్టు... తినేసి తొందరగా వెళ్ళాలి అంటూ పెళ్ళాన్ని తొందర పెట్టాడు... ఆదరా బాదరా గా తినేసి బయలు దేరాడు...
స్టాఫ్ రూమ్ లోకి అడుగు పెట్టిన సుబ్బారావు కి...రిజిస్టర్ బుక్ హెడ్ మాస్టర్ గారి టేబుల్ మీదకి వెళ్ళిపోయింది... మిమ్మలిని ఒకసారి రమ్మన్నారు....అన్నారు. ఎక్సపెక్ట్ చేశా...ఇంకా నిండా ములిగిన తరువాత చలి ఏమిటి అనుకుంటూ ఆయన గది లోకి అడుగు పెట్టాడు రండి సుబ్బారావు గారు కూర్చోండి అన్నాడు.
మర్యాద కొంచెం ఎక్కువ అయింది... డోస్ కూడా ఎక్కువే ఉండొచ్చు... అనుకున్నాడు... రిజిస్టర్ ముందుకి తోసాడు సంతకం పెట్టండి... అన్నాడు ఆశర్య పోయాడు... సారి సర్...ఇక ముందు ఇలా ఆలస్యంగా రాను అన్నాడు...నేను పిలిచింది అందుకు కాదు...మీ కల నెరవేరే రోజు వచ్చింది... ఎవరో సినిమా వాళ్ళు ట... మీ గురించి వచ్చారు. ఇదిగో కార్డ్...మధ్యాన్నం సెలవు పెట్టి వెళ్ళండి అన్నాడు.చాలా థాంక్స్ సర్...అంటూ కార్డ్ తీసుకుని క్లాస్ కి వెళ్ళాడు...సినిమా పేరు గౌతమ బుద్ధ ట తనకు చిన్న కారెక్టర్ ఉంది చేస్తారా అని అడిగారు... మొదటి సినిమా కదా...అని ఆలోచించకుండా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేసాడు.... వాళ్ళు చెక్ ఇచ్చారు అడ్వాన్స్ గా....మీకు టికెట్స్ పంపిస్తాం... ఆరోజు బయలుదేరి హైదరాబాద్ రావాలి... అన్నారు. సరే సర్...అంటూ ఇంటికి వెళ్ళాడు...
తయారు ఒసే తయారు అంటూ పిలిచాడు... లోపల పిండి రుబ్బుతోంది... వినబడలేదు.... ఒసే తారు అంటూ లోపలికి వచ్చి పిలిచాడు... మిమ్మలిని అలా పిలవద్దన్నానా...అంది కోపం గా... ఏదో ముద్దు వచ్చినప్పుడు అలా పిలుస్తా లే వే... అన్నాడు....ఇప్పుడు ముద్దు ఎందుకు వచ్చానో... అంతగా అంది...చెక్ తీసి చూపించాడు... సినిమా ఛాన్స్ వచ్చిందే...ఇది అడ్వాన్స్...అన్నాడు...నిజమా ...ఈ విషయం అంత మందికి చెప్పాలి...అంటూ బైటకి పరిగెత్తింది....కొంచెం కాఫీ ఇచ్చి వెల్లవే అన్నాడు....తరువాత ఇస్తా....అంటూ బైటకి వెళ్ళిపోయింది..దీనికి ఆనందం వచ్చిన...పట్టలేము
కోపం వచ్చినా పట్టలేము...అనుకున్నాడు..
అందరూ వచ్చి అభినందించారు...
ఆ పక్కింటాయన ఇంకా ఉన్నాడు...
ఒక్క మాట అండీ అన్నాడు...
ఇప్పుడు ఆటోగ్రాఫ్ లు అవి ...ఇంకా సినిమా మొదలు అవలేదు కదండీ అన్నాడు... అదికాదు ...
మీరు మా కుక్కని ఏం చేశారు... ఇప్పటికి వారం అయింది.... ఒక్కసారి కూడా భౌ మని ఆరవ ట్లేదు... పైగా మీ గొంతు విన్నా మీపేరు విన్నా.... మంచం కింద దాక్కుంటోంది... అన్నాడు...ఏమో నాకేమి తెలుసు... నేనేమి చేయలేదు ...అన్నాడు...బింకంగా... చూద్దాం... అంటూ వెళ్ళిపోయాడు.
సినిమా వాళ్ళనించి ఫోన్ వచ్చింది... అందరూ ట్రైన్ ఎక్కించి వెళ్లారు...లొకేషన్ చేరుకున్నాడు...
అక్కడ అంతా హడావిడిగా ఉంది...సుబ్బారావు ని చూసి రండి ఇదిగో మీ డైలాగ్ పేపర్...రెండే రెండు...బాగాచెప్పాలి...మేకప్ వచ్చాడు...
ఇదిగో అబ్బాయి బాగా వేయాలి...ఫస్ట్ లుక్ అదిరిపోవాలి... అన్నాడు...ఓకసారి జాలిగా చూసి నేను ఇప్పుడే వస్తా...అని వెళ్ళాడు... దర్శకుడు వచ్చి ఏది ఆ డైలాగ్ చెప్పండి...అన్నాడు...చెప్పాడు... బాగా వచ్చింది...ఇంకా మిగతా అంత ఏక్షన్ ...మీ ఎక్స్ప్రెషన్స్ బాగుండాలి అన్నాడు...మీరే చూస్తారు గా...అన్నాడు....
మేకప్ మాన్ వచ్చి నల్ల రంగు పుసాడు.... ఇదేమిటి ఇలా ..
అది అంతే... హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి విగ్రహం పడిపోయాక ఆయన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అన్న పాత్ర మీది... ఒంటినిండా ఇలా రాసుకుంటే నేను ఎక్కడ కనపడతాను... అప్పటికి వాడు చెప్పాడు ..
మీ క్యారెక్టర్ కనబడుతోంది కానీ మీరు కనబడరు అని ...నేనె అర్థం చేసుకో లేక పోయాను....
తొందర గా మీ సీన్ చేయమనండి... లేక పోతే... కడుక్కోవడానికి గంట పట్టుద్ది అన్నాడు మేకప్ మాన్...
.ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాడు...మేకప్ భలే కుదిరింది అండీ అన్నాడు....నవ్వుతూ...
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే....ఏదో సామెత చెప్పినట్లు... కధ వినకుండా సంతకం పెట్టడం నా తప్పు... ఇప్పుడు
నేను ఈ సినిమా చేయను అన్నాడు....
అయితే మీరే డబ్బు ఎదురు ఇవ్వాలి...
అగ్రిమెంట్ సంతకం పెట్టారుగా... అన్నాడు...
చేసేది ఏమి లేక మూసుకుని వారం రోజులు, అరగంట మేకప్ వేసుకోవడానికి, గంట తీసుకోవడానికి...సరిపోయేది...
ఏదో అయింది అనిపించాడు..ఇంక జన్మ లో సినిమా జోలికి పోకూడదు అనుకున్నాడు..
ప్రొడ్యూసర్ పిలిచి ఇదిగో అండీ మీ బాలన్స్ చెక్....
మళ్ళీ ఏదైనా పాత్ర ఉంటే పిలుస్తా అంటూ వెళ్లిపోయారు.
ట్రైన్ లో ఊరు చేరాడు...అక్కడ అంతా కోలాహలం...దండలతో రిసీవ్ చేసు కున్నారు...వీళ్ళకి తెలియదు...నేనేం చేసానో..తెలిస్తే పరువు పోతుంది....అనుకున్నాడు.
.సినిమా రిలీజ్ రోజు నా అందరికి టికెట్స్ తీసాడు... మొదలు అయింది...సుబ్బారావు సీన్ రాలేదు... ఇంటర్వెల్ తరవాత వస్తుంది లే అన్నారు ఎవరో...అప్పుడు రాలేదు.. మొత్తం అయిపోయింది అయినా రాలేదు... అయ్యో ఎంత మోసం ...పాపం సుబ్బారావు నటించింది అంత తీసేసారు... అని జాలి చూపించారు...బ్రతికాను రా భగవంతుడా...అని ఇల్లు చేరుకున్నాడు...
.ప్రొడక్షన్ వాళ్ళకి ఫోన్ చేసాడు....ఏమి జరిగింది అని....
బురద తో కూడిన బుద్ధుని సీను లు భక్తుల మనో భావాలు దెబ్బ తిన్నాయని మొత్తం తీసేశారుట....
క్షమించండి అని అడిగారు...
థాంక్స్ అని పెట్టాశాడు....
వాళ్ళకి అర్థం కాలేదు , ఇదేమిటి సారి చెపితే థాంక్స్ అంటాడు....అనుకున్నారు....
హమ్మయ్య ఈ గండం గడిచింది..
ఇంక జన్మ లో సినిమా పేరు ఎత్తను...అనుకున్నాడు...
అప్పటి నుంచి సాయంత్రం కూడా ట్యూషన్స్ చెప్పడం ప్రారంభించాడు...తయారు కి కళ్ళజోడు చేయించాడు....అతని లో వచ్చిన మార్పు కి
తయారు ఆశ్చర్యం పోయింది...
ఏమిటండి ఈ మార్పు...అని అడిగింది...ఒక్క సినిమా చేయాలని అనుకున్నా... చేసేసా....ఇంక నాకు ఆ మోజు లేదు...
అందుకే మనకి కలిసి వచ్చిన అధ్యాపక పనిని చేసుకుంటున్నా అన్నాడు...
తన భర్త లో వచ్చిన మార్పుకి చాలా... సంతోషించింది
ఒక ఆదివారం ఉదయం భార్య
చేసిన జీడిపప్పు ఉప్మా తింటుండగా...
ఫోన్ మోగింది... హలొ ఎవరు సుబ్బారావు గారేనా...
మేము ప్రొడక్షన్ హౌస్ నించి మాట్లాడుతున్నాం....
ఒక పాత్ర ఉంది చేస్తారా అని అడిగారు....
ఒక సెకను ఆలోచించి....
రాంగ్ నంబర్ అంటూ పెట్టెసాడు....
ప్రశాంతంగా ఉప్మా తినడం కొనసాగించాడు...
మళ్ళీ సినిమా లు చెయ్యక పోయినా....
సుబ్బారావు కు జరిగిన అన్యాయానికి....
కాలనీ లో "సినిమా సుబ్బారావు" అన్న పేరు మాత్రం స్థిరపడిపోయింది....
....శుభం....
(ఇది కేవలం కల్పితం... పాత్రలు సన్నివేశాలు.... కల్పించి రాయబడినవి)
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: హాస్య కథలు - వామన రావు - విమానయానం - by k3vv3 - 29-10-2024, 12:35 PM



Users browsing this thread: 7 Guest(s)